
మురుగన్ సేవలో పవన్ కల్యాణ్
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామిని ఆంధ్రా డిపూటీ సీఎం పవన్‌కల్యాణ్ దర్శనం చేసుకోవడం కోసం మురుగన్‌కు పంచామృత అభిషేకం 45 నిమషాలు ఆలస్యం చేయడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. కుమారుడు అకిరానందన్‌తో కలిసి శనివారం తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకునేందుకు వీలుగా హెలికాప్టర్‌లో అరక్కోణంలోని ఎన్‌డీఆర్‌ఎప్ వైమానిక దళం చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కొండ ఆలయానికి వచ్చారు. డీఆర్‌వో రాజ్‌కుమార్, ఆలయ సూపరింటెండెంట్ చిత్ర స్వాగతం పలికారు. పవన్ రాక సందర్భంగా డీఎస్పీ కందన్ ఆధ్వర్యంలో 300 పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఘాట్‌రోడ్డులో వాహనాలు నిలిపివేసి కొండ కింద భాగంలో పార్కింగ్‌కు అనుమతిచ్చారు. దీంతో భక్తులు చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు కొండకు ఘాట్‌రోడ్డులో నడిచి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం 12 గంటలకు మూలవర్లకు పంచామృత అభిషేకంకు టికెట్లు కొనుక్కున్న భక్తులు 45 నిమషాలు ఆలస్యం చేయడంతో భక్తులు వేచిఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment