సమస్యలు పరిష్కరించాలని ధర్నా
వేలూరు: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జాక్టో జియో ప్రతినిధులు జిల్లావ్యాప్తంగా అన్ని తాలుకా కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు. జాక్టో జియో ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పథకాన్ని అమలు చేయాలని, టీచర్‌లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లోను కాలీ పోస్టులను భర్తీ చేయాలని తదితర డిమాండ్‌లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. తమ డిమాండ్‌ల సాధనకు ప్రభుత్వం వద్ద పలు మార్లు వినతిపత్రాలు సమర్పించినా వాటిపై ఏమాత్రం స్పందించక పోవడంతోనే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికై నా స్పందించి తమ రాష్ట్ర నాయకులతో చర్చలు జరపకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు. ఈ ధర్నాలో తమిళనాడు ఓకేషనల్ టీచర్స్ అసోషియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దనన్, జాక్టో జియో జిల్లా అద్యక్షులు జోషి, శరవణన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment