తమిళసినిమా: కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుందంటారు. ఇందుకు తాజా ఉదాహరణ దర్శకుడు అశ్వద్ మారిముత్తు. ఈయన 2020లో ఓ మై కడవలే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. చిన్న చిత్రంగా విడుదలైన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో అదే చిత్రాన్ని తెలుగులో ఓరి దేవుడా పేరుతో రీమేక్ చేశారు. కాగా మళ్లీ నాలుగేళ్ల తర్వాత తమిళంలో ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడుగా డ్రాగన్ చిత్రాలు చేశారు. నటి అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా డ్రాగన్ చిత్ర యూనిట్ నటుడు విజయతని కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. దీని గురించి దర్శకుడు అశ్వద్ మారిముత్తు తన ఎక్స్ వీడియోలో పేర్కొంటూ.. సాధారణంగా నేను ఎక్కువగానే మాట్లాడతాను అయితే నటుడు విజయ్ ని కలిసిన తర్వాత నోట మాట రాలేదు అలాగే ఆయన్ని చూస్తూ ఉండిపోయాను. విజయ్ కూడా తన ఎదురుగా నిలబడి నన్నే చూస్తుండి పోయారు. ఆయన చూసిన ఆనందంతో తన కళ్లు ఆనందభాష్పాలతో నిండిపోయాయి. మా చిత్ర యూనిట్ అంతా ఆశ్చర్యంతో, ఈయనకు విజయ్ అంటే అంత ప్రేమ ఎందుకు అనేలా చూశారు. నటుడు విజయ్ కలవడంతో నా కల నిజమయింది అనిపించింది. నేను నా ఫ్రెండ్ ప్రదీప్ రంగనాథన్‌తో చిత్రం చేయడానికి వచ్చాను.. అయితే ఆయన అద్భుతమైన స్క్రీన్ ప్లే రాశారు సోదరా అని చెప్పడంతో తన నా జీవితం పరిపూర్ణం అయినట్లు భావించాను నాకు అది చాలు.. అని దర్శకుడు అశ్వద్ మారిముత్తు పేర్కొన్నారు. కాగా తాజాగా ఈయన నటుడు శింబు కథానాయకుడిగా భారీ చిత్రాన్ని చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.


