● నలుగురు అరెస్టు
తిరువళ్లూరు: పొన్నేరి సమీపంలో వ్యక్తులను తారుమారు చేసి సుమారు రూ.30 లక్షల విలువ చేసే భూమిని ఆక్రమించిన ముగ్గురు మహిళలు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా మీంజూరు సమీపంలోని వల్లూరు గ్రామానికి చెందిన కోటీశ్వరి(64). ఈమెకు పొన్నేరి సమీపంలోని విచ్చూరు గ్రామంలో 3600 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇంటి స్థలం ఉంది. సంబంధిత స్థలాన్ని అదే ప్రాంతానికి చెందిన సెల్వనాథన్ అనే వ్యక్తి నుంచి 1985లో కోటీశ్వరి కొనుగోలు చేశారు. ఈ క్రమంలో సెల్వనాథన్ కుమారుడు తమిళ్‌సెల్వవన్ గత 2022వ సంవత్సరంలో కోటీశ్వరికి బదులు వేరే మహిళను చూపించి సంబందిత భూమిని వేరే వ్యక్తికి విక్రయించాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన కోటీశ్వరి ఆవడి పోలీసు కమిషనర్ శంకర్‌కు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో మోసం జరిగినట్టు నిర్ధారణ కావడంతో ప్రధాన నిందితుడు తమిళ్‌సెల్వవన్(42)ను గత రెండు వారాల క్రితం అరెస్టు చేశారు. అతడికి సహాకరించిన చైన్నె కొడుంగయూర్ ప్రాంతానికి చెంది సౌభాగ్యవతి(42), రేఖ(36) ఐనావరం ప్రాంతానికి చెందిన హంసవేణి(38) మీంజూరుకు చెందిన విమల్‌కుమార్(43) తదితర నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


