తమిళసినిమా: కథానాయకులుగా అవతారమెత్తిన సక్సెస్‌ఫుల్ సంగీత దర్శకుల్లో విజయ్ ఆంటోని ఒకరు. ఈయన వైవిధ్యభరిత కథా చిత్రాలు చేస్తూ తన కంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. తనకు హీరోగా బిగ్గెస్ట్ ఇచ్చిన పిచ్చైక్కారన్ చిత్ర సీక్వెల్ ద్వారా దర్శకుడిగానూ అవతారమెత్తిన విజయ్ ఆంటోని ప్రస్తుతం శక్తి తిరుమగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది తమిళంలో పాటు, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనితో పాటు ఈయన నటించిన వళ్లీ మయిల్, గగన్ మార్గన్ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. తాజాగా మరో నూతన చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఇటీవల జెంటిల్‌ఉమెన్ పేరుతో వైవిధ్యభరిత కథా చిత్రాన్ని తెరకెక్కించి మంచి క్రిటిక్స్ అందుకున్న జోశ్వా సేతురామన్ తాజా చిత్రంలో విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించనున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన అఽధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది.


