ఘనంగా రంజాన్ వేడుకలు
తిరువళ్లూరు: ముస్లింలు ప్రతి ఏటా నిర్వహించుకునే రంజాన్ వేడుకలను తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా మసీదుల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ముస్లింలు నెల రోజులపాటు ఉపవాసం ఉండి రంజాన్ వేడుకలను నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే గత నెల క్రితం రంజాన్ ఉపవాసాలు ప్రారంభించారు. ఉదయం నాలుగు గంటలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అల్పాహారం తీసుకోవడం, సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసిన తరువాత ఉపవాసాన్ని ముగించడం ప్రత్యేకత. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం రంజాన్ కావడంతో తిరువళ్లూరు, మనవాలనగర్, ఊత్తుకోట, తామరపాక్కం, ఆవడి, అంబత్తూరు, పూందమల్లి, పొన్నేరి, గుమ్మిడిపూండి తదితర ప్రాంతాల్లోని మసీదుల్లో పండుగ కోలాహలం నెలకొంది. నూతన దుస్తులు ధరించిన ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థఽనలు ముగిసిన తరువాత ఒకరినొకరు ఆలింగనాలు చేసుకుని పండుగ శుభాకాంక్షలు అందుకున్నారు. అనంతరం నిరుపేద ముస్లింలకు మాంసం, గోధుమలు, బియ్యం తదితర వాటిని ఉచితంగా అందజేశారు. తిరువళ్లూరు పట్టణంలోని ఈద్గా మైదానంలో జరిగిన ప్రత్యేక ప్రార్థఽనలకు వేలాది మంది హాజరయ్యారు. ప్రార్థనల అనంతరం అన్నదానం, మజ్జిగ తదితర వాటిని అందజేశారు.
రంజాన్ వేడుకల కోలాహలం
పళ్లిపట్టు: పళ్లిపట్టు, తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. పేదలకు సహాయకాలు పంపిణీ చేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టారు. దీంతో సోమవారం రంజాన్ పర్వదినం సందర్భంగా పళ్లిపట్టులోని జుమ్మా మసీదులో ముస్లింలు ఏకమై ఊరేగింపుగా పట్టణ బస్టాండు సమీపంలోని ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. పేదలకు బియ్యం, గోధుమలు, చీర, దోవతులు పంపిణీ చేశారు. అలాగే తిరుత్తణి గాంధీ రోడ్డు మార్గంలోని మక్కా మసీదులో నిర్వహించిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో 500 మంది ముస్లింలు పాల్గొన్నారు. పొదటూరుపేట, ఆర్కేపేట, అత్తిమాంజేరిపేట, కొళత్తూరు సహా వివిధ ప్రాంతాల్లో ముస్లింలు రంజాన్ సందర్భంగా నూతన దుస్తులు ధరించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మధ్యాహ్నం పేదలకు బిరియానీ పంపిణీ చేశారు.
వేలూరు, తిరువణ్ణామలైలో రంజాన్ వేడుకలు
వేలూరు: వేలూరు ఉమ్మడి జిల్లాతో పాటూ తిరువణ్ణామలై జిల్లాలోను రంజాన్ వేడుకలను ముస్లీం సోదరులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. వేలూరు ఆర్‌ఎన్ పాళ్యంలోని ఈద్‌ఖా మైదానంలో అధిక సంఖ్యలో ఇస్లామియన్‌లు ప్రార్థనలు చేశారు. అదేవిధంగా వేలూరు కస్పాలోని పెద్ద మసీదు, చిన్న మసీదు, అల్లాపురం, కొనవట్టం, విరుదంబట్టులో ప్రత్యేక ప్రార్థనలు జరిపి ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదే విధంగా ఆంబూరు, వానియంబాడి, మేల్ విషారం, కీల్ విషారం, వాలాజ వంటి ప్రాంతాల్లో ముస్లింలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇదిలా ఉండగా వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని అన్ని మసీదుల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేలూరు ఆర్‌ఎన్ పాళ్యంలోని పెద్ద మసీదు వద్ద ట్రాఫిక్ సమస్య రాకుండా ముందుస్తు జాగ్రత్తగా పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. రంజాన్ పండుగ సందర్భంగా అన్నీ మసీదుల్లో ముస్లింలతో కిటకిటలాడింది.
ఘనంగా రంజాన్ వేడుకలు
ఘనంగా రంజాన్ వేడుకలు
ఘనంగా రంజాన్ వేడుకలు
ఘనంగా రంజాన్ వేడుకలు


