ఘనంగా సూర్య మగళ్ అవార్డుల వేడుక
కొరుక్కుపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డి.ఎం.కె. పార్టీ తరపున 35 మంది ప్రముఖ మహిళలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. దీనికి చైన్నెలోని బ్రాడ్‌వేలోని రాజా అన్నామలై మండ్రం వేదికై ంది. చైన్నె కార్పొరేషన్ మేయర్ మేయర్ ప్రియ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్, ప్రత్యేక అతిథులుగా నటులు సత్యరాజ్, ప్రభు హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో సమాజంలోని వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలను అవార్డులతో సత్కరించుకున్నారు. వీరిలో ప్రముఖ నేపథ్య గాయని పి.సుశీల, చైన్నె హైకోర్టు న్యాయమూర్తి టి.ఎన్. మాల, అగ్నిమాపక శాఖ మాజీ జాయింట్ డైరెక్టర్ ప్రియా రవిచంద్రన్, రచయిత్రి శివశంకరి, అపోలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రీతారెడ్డి, డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఇనన్‌స్టిట్యూట్ ప్రెసిడెంట్ సౌమ్య తదితర 35 మంది మహిళలకు అవార్డులను అందించారు.


