ప్రాణ రక్షణ కోసం బ్లడ్ బ్యాంక్
సాక్షి, చైన్నె: అత్యవసర పరిస్థితులలో ఉన్న పేదలు, మధ్య తరగతి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు మొగప్పేర్‌లో మద్రాసు మెడికల్‌మిషన్, శివ ప్యారి బాయ్ బ్రిజ్ లాల్ ధూత్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఎంఎంఎం–బ్రిజ్ లాల్ రామ్‌నాథ్ ధూత్ రోటరీ బ్లడ్ బ్యాంక్ పేరిట దీనిని ఏర్పాటు చేశారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయల కల్ప, పాణ రక్షణ అంశాలకు మద్దతు నిలిచే విధంగా ఈ బ్లడ్ బ్యాంక్‌తో పాటుగా ఇక్కడి సేవలు ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రోటరీ, ఎంఎంఎం, ఆ ట్రస్టు ప్రతినిధులు,నిర్వాహకులు ఇషాక్ నాజర్, వీణా జహ్హవీర్, ఎస్ మహావీర్ బోత్రా, డాక్టరుల జాకబ్ రాయ్ , క్రిసోఫర్ రాయ్, సెంథిల్‌కుమార్, నందకుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రక్త దాతలను సత్కరించారు.


