టోల్‌గేట్లలో మినహాయింపు ఇవ్వాలి
కొరుక్కుపేట: టోల్‌గేట్లలో ఓమ్ని బస్సులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ యజమానులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఓమ్నీ బస్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్బజగన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి తమిళనాడులోని పలు ప్రాంతాల నుంచి 200 మందికి పైగా ఓమ్నీ బస్సు యజమానులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధాన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. భారతదేశంలోని నాలుగు లేన్లు, 6 లేన్లు , 8 లేన్లలో మూడు రకాల రోడ్లపై సెంట్రల్, రాష్ట్ర రహదారులపై ఏర్పాటు చేసిన టోల్‌గేట్లలో భారతదేశం అంతటా 1,228 టోల్‌గేట్లలోని ఓమ్మీ బస్ వంటి ప్రజా రవాణా వాహనాలకు మినహాయింపు ఉంది. అయితే ఓమ్నీ బస్సుకు ప్రత్యేక పర్మిట్ లేకపోవడంతో అనేక అడ్డంకులను ఎదుర్కోవలసి వస్తుంది. ఓమ్నీ బస్సులకు కొత్త తరహా పర్మిట్‌ను రూపొందించి జారీ చేయాలని కోరారు.
ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తులు
●1,299 పోస్టులకు నోటిఫికేషన్
కొరుక్కుపేట: పోలీసు శాఖలో 1,299 ఎస్‌ఐ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 7 నుంచి మే 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తమిళనాడు యూనిఫామ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. తమిళనాడు యూనిఫామ్డ్ స్టాఫ్ సెలక్షన్ బోర్డ్–2025లో పోలీస్ ప్రో–ఇన్‌న్‌స్పెక్టర్ల (తాలూకా పోలీస్, ఆర్ముడ్ పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 1, 299 ఎస్‌ఐ పోస్టులకు ఆన్‌న్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 7న ప్రారంభం కానుంది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మే 3. అభ్యర్థులకు పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తారు.
ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ
● ముగ్గురు దుర్మరణం
సేలం: తిరుచ్చి సమీపంలో లారీ ఢీకొని ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. తిరుచ్చి జిల్లాలోని పుల్లంబడి సమీపంలోని అళుంతలైపూర్ గ్రామ ప్రజలు ప్రతి ఏడాది తమ ఇంటి అవసరాల కోసం మన్నచనల్లూరులోని రైస్ మిల్లు నుంచి బియ్యాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఈక్రమంలో మన్నచనల్లూరు వెళ్లిన 20 మంది మహిళలు బియ్యం బ్యాగులను కొని ట్రాక్టర్‌లో ఎక్కించుకుని ఇంటికి తిరిగి బయలుదేరారు. ఆ సమయంలో తిరుచ్చి– చిదంబరం కొత్త నేషనల్ హైవేలోని ఇరుదయపురం సమీపంలో ట్రాక్టర్ వెళుతుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బియ్యం బస్తా పైన కూర్చున్న శాంతి (58), సెల్వనాయికి (60), రాసంబాల్ (60) అనే మహిళలు సంఘటన స్థలంలోనే మృతిచెందారు. విషయం తెలిసి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లాల్గుడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సీనియర్ నటుడు
రవికుమార్ కన్నుమూత
తమిళ సినిమా: సీనియర్ నటుడు రవికుమార్ (71) శుక్రవారం మధ్యాహ్నం చైన్నెలో కన్నుమూశారు. బాలచందర్ దర్శకత్వం వహించిన అవర్‌గళ్ చిత్రంలో కమలహాసన్ తదితర ముగ్గురు హీరోలలో ఒకరిగా నటించారు. అనంతరం పలు చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించిన రవి కుమార్ పలు టీవీ సీరియళ్లలో నటించారు ఆఢముఖ్యంగా చిత్తి, రాణి వాణి వంటి మెగా సీరియళ్లలో నటించారు. కాగా అనారోగ్యం కారణంగా స్థానిక వేలచ్చేరిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈయన మృతికి పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. నటి రాధిక శరత్ కుమార్ మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కత్తితో హల్‌చల్
తిరువళ్లూరు: నడిరోడ్డులో కత్తితో హల్‌చల్ చేసిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. తిరువళ్లూరులోని పుంగత్తూరు గాంఽధీనగర్ ప్రాంతంలో ముగ్గురు యువకులు నడిరోడ్లో కత్తులతో వీరంగం చేస్తున్నారని సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్ అంథోని స్టాలిన్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వీరు.. పుంగత్తూరుకు చెందిన విన్నరసు(23), కమలకన్నన్(19), మనవాలనగర్‌కు చెందిన డేనియల్ ఎడ్వర్డ్(19) అని తేలింది. వీరు గంజాయి మత్తులో తరచూ ప్రజలను భయాందోళనకు గురి చేసేలా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
టోల్‌గేట్లలో మినహాయింపు ఇవ్వాలి


