రూ. 7.50 కోట్ల విలువైన ఆలయ ఆస్తులు స్వాధీనం
తిరుత్తణి : తిరువలంగాడు ఆలయానికి వీలునామా రాసి ఆస్తులను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించి తన ఆదీనంలో వుంచుకోవడంతో గుర్తించిన తిరుత్తణి ఆలయ అధికారులు, రూ.7.50 కోట్లు విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి అనుసంధానంలోని తిరువలంగాడు వడారన్నేశ్వరర్ ఆలయానికి చైన్నెకు చెందిన మునియమ్మ అనే మహిళ చైన్నెలోని సూలైమేడు ప్రాంతంలోని రెండిళ్లు తన ఆస్తులను వీలునామా రాసి ఇచ్చారు. తన కాలం అనంతరం తన ఆస్తులను ఆలయం అధికారులు స్వీకరించి అందులో వచ్చే ఆదాయాన్ని ఆలయ కై ంకర్యాలకు వినియోగించుకోవాలని సూచించారు.అయితే మునియమ్మ మరణం అనంతరం ఆమె బంధువులు రెండు ఇళ్లను స్వాధీనం చేసి ప్రైవేటు వ్యక్తికి 98 సంవత్సరాలకు లీకుకు ఇచ్చారు. ఈ క్రమంలో తిరుత్తణి ఆలయ ఆస్తులుకు సంబంధించి తనిఖీలో చైన్నె సూలైమేడులోని ఆస్తి గుర్తించారు. అక్కడి వెళ్లి చూడగా ప్రైవేటు వ్యక్తి తన కనుసున్నల్లో వినియోగించుకున్నట్లు గుర్తించారు. ఈ విషయమై తిరుత్తణి ఆలయ జాయింట్ కమిషనర్ హిందు దేవదాయ శాఖ కమిషనర్ శ్రీధర్‌కు సమాచారం ఇచ్చారు. కమిషనర్ ఆదేశాల మేరకు తిరుత్తణి ఆలయ జాయింట్ కమిషనర్ రమణి, తన సిబ్బందితో శుక్రవారం చైన్నెకు వెళ్లి తిరువలంగాడు ఆలయ ఆస్తులను పోలీసుల సహాకారంతో స్వాధీనం చేసారు. ఆ ప్రాంతంలో తిరువలంగాడు ఆలయ ఆస్తులుగా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. చైన్నెలోని ఆలయ ఆస్తులు రక్షించే బాధ్యతలను తిరుత్తణి ఆలయ జాయింట్ కమిషనర్‌కు అప్పగిస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.


