మండేలాకు.. ఐదేళ్లు
దర్శకుడు మడోన్న
అశ్విన్‌తో యోగిబాబు
తమిళసినిమా: నటుడు యోగిబాబు కథానాయకుడిగా నటించిన చిత్రం మండేలా. నటి షిలా రాజ్కుమార్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని వైనాట్ ఫిలిం స్టూడియోస్ పతాకంపై శశికాంత్ నిర్మించారు. మడోనా అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సమకాలీన రాజకీయాలపై వ్యంగ్యస్త్రాలు సంధించిన కథాంశంతో రూపొందింది. ముఖ్యంగా ఎన్నికల్లో ఓట్ల కోసం రాజకీయ నాయకులు పడే పాట్లు, అధికారం కోసం పడే ఆరాటం వంటి అంశాలను వినోదభరితంగా చూపించిన చిత్రం మండేలా. చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించడంతో విశ్లేషకుల ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రం విడుదలై ఐదేళ్ల పూర్తి అయ్యింది. దీంతో ఇందులో కథానాయకుడిగా నటించిన నటుడు యోగిబాబు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నటుడిగా తన జీవితంలో పలు ముఖ్యమైన మలుపులకు కారణమైన చిత్రం మండేలా అని పేర్కొన్నారు. నువ్వులను, సామాజిక పరమైన ఆలోచనలను, పలు వాస్తవాలను అందించిన చిత్రం మండేలా అన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు శశికాంత్, బాలాజీ మోహన్‌ను ధన్యవాదాలు తెలుపుకంటున్నానన్నారు. సహోదరుడు, ఈ చిత్ర దర్శకుడు మడోనా అశ్విన్ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాను అని నటుడు యోగిబాబు పేర్కొన్నారు. చక్కని సంగీతం, అందమైన ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరింత బలాన్నిచ్చిందన్నారు. ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే మండేలా చిత్రంలో తాను చిన్న భాగం అయినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు.


