పట్టుదల ఉంటే విజయం తథ్యం | - | Sakshi
Sakshi News home page

పట్టుదల ఉంటే విజయం తథ్యం

Apr 6 2025 2:05 AM | Updated on Apr 6 2025 2:05 AM

పట్టుదల ఉంటే విజయం తథ్యం

పట్టుదల ఉంటే విజయం తథ్యం

● సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుందరేష్‌

వేలూరు: విద్యార్థులు కృషి, పట్టుదల, అంకితభావం ఉంటే ఉన్న శిఖరాలకు చేరుకోవచ్చని సుప్రీంకోర్టు జడ్జి సుందరేష్‌ అన్నారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీ 40 వార్షికోత్సవం, క్రీడా పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, బంగారు పథకాలు పంపిణీ చేసే కార్యక్రమం వీఐటీ చాన్స్‌లర్‌ విశ్వనాథన్‌ అధ్యక్షతన శనివారం ఉదయం వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా హాజరైన ఆయన బంగారు పథకాలు, సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు.

క్రీడలు విద్యలో ఓ భాగమని వైఫల్యాలను అంగీకరించగలగాలని, అపజయాల నుంచి మంచి అనుభవం లభిస్తుందన్నారు. ఐపీఎల్‌ టోర్నమెంట్‌ అన్ని వర్గాల ప్రజలను ఏకం చేస్తుందని నేడు మూడు తరాల తాత, కొడుకు, మనవడు కలిసి కూర్చుని క్రికెట్‌ చూస్తున్నారన్నారు. మార్టిన్‌ లూథర్‌కింగ్‌ ఏ పనిచేసినా సమర్థవంతంగా చేయాలని అని అంటారు. అలాగే విద్యార్థులు నైపుణ్యంతో ముందుకు సాగాలన్నారు. వీఐటీ చాన్స్‌లర్‌ విశ్వనాథన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం క్రీడా పోటీల్లో 3,400 మంది విద్యార్థులు వివిద క్రీడల్లో విజయం సాధించారని వారికి రూ. 1.4 కోట్ల విలువైన బహుమతులు, స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నామన్నారు. విద్యార్థులు వందశాతం హాజరు ఉండాలన్నారు. వీఐటీని మొదట్లో 15 ఫ్రొఫెసర్‌లతో ప్రారంభించి అప్పట్లో వారికి నెల వారి ఖర్చు రూ. లక్ష మాత్రమే అన్నారు. రైతు, బడుగు మధ్యతరగతి వర్గాలకు ఉన్నత విద్య ఓ కలగా మారిందన్నారు. విద్యపై అధిక వ్యయం చేస్తున్న దేశాల కంటే భారత దేశం వెనుక బడి ఉందన్నారు. ఉన్నత విద్యకు అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో బిహార్‌ ఆఖరి స్థానంలో ఉండగా తమిళనాడు అగ్రస్థానంలోనూ, కేరళ రాష్ట్రం రెండవ స్థానంలో ఉందన్నారు. ఉన్నత విద్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు కేటాయించాలన్నారు. మనది అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉందని ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసిస్తే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు. జనాభా పరంగా చూస్తే చైనా కంటే మనం ముందున్నామన్నారు. ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. బిలియనర్ల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో చైనా రెండవ స్థానంలోనూ, ఇండియా మూడవ స్థానంలో ఉందన్నారు. వీఐటీలో మొత్తం 70 దేశాలకు చెందిన మొత్తం 44 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్‌, శేఖర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంద్య పెంటారెడ్డి, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కాదంబరి విశ్వనాథన్‌, వైస్‌ చాన్స్‌లర్‌ కాంచన, అసోసియేట్‌ వైస్‌ చాన్స్‌లర్‌ పార్థసారథి మల్లిక్‌, రిజిస్టార్‌ జయభారతి, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement