ఉన్నత విద్యలో తమిళనాడుకు అగ్రస్థానం
–మంత్రి కోవి. చెజియన్
కొరుక్కుపేట: ఉన్నత విద్యలో తమిళనాడు రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడం గర్వంగా ఉందని ఉన్నత విద్యా శాఖమంత్రి కోవి చెలియన్ అన్నారు. తంజై కుందవై నాచియార్ ప్రభుత్వ మహిళా ఆర్ట్స్ కళాశాల స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో అతిథిగా పాల్గొన్న మంత్రి విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేసి మాట్లాడుతూభారతదేశంలో ఉన్నత విద్యలో తమిళనాడు అగ్రస్థానంలో ఉందన్నారు మొత్తం భారతదేశంలో ఉన్నత విద్యలో నమోదు రేటు 28 శాతం. 2035 నాటికి 50 శాతానికి చేరుకుంటామని కేంద్ర మంత్రి పార్లమెంటులో ప్రకటించారు. కానీ తమిళనాడులో ప్రస్తుతం ఉన్నత విద్యలో 48 శాతం ఉందన్నారు. 2025 నాటికి కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైన 50 శాతం సాధించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టానిల్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
వైద్య గుణం కలిగిన 1.5 టన్నుల
కూరై కత్తాలై చేపలు లభ్యం
తిరువొత్తియూరు: చైన్నె కాశిమేడు సముద్రంలో జాలరి చేపల పడుతున్న సమయంలో అతని వలలో అరుదైన వైద్య గుణం కలిగిన 1.5 కూర కత్తాలై అనే చేపలు చిక్కాయి. వీటి ధర ఒక కిలో రూ. 5,000 నుంచి 10,000 వరకు పలుకుతాయని జాలర్లు తెలిపారు. కాశిమేడు ప్రాంతానికి చెందిన దేవరాజు జాలరి. ఇతను గత కొన్ని రోజుల క్రితం సముద్రంలో చేపలు పట్టడానికి ఫైబర్ పడవలో వెళ్లాడు. ఆ సమయంలో అతని వలలో సుమారు ఒకటిన్నర టన్నుల వైద్య గుణం కలిగిన చేపలు చిక్కాయి. ఆ చేపలతో దేవరాజు వడ్డుకు తిరిగి వచ్చాడు. ఈ చేపలు గుండె నొప్పి నివారణ, ఎముకల బవలం వంటి వైద్య గుణం కలిగి పనిచేస్తుందని జాలర్లు తెలిపారు. అలాగే కూర కత్తాలై చేపలు ఎక్కువ ధర పలుకుతుందని తెలిపారు. దీని గురించి దేవరాజు మాట్లాడుతూ ఈ చేపలు రూ. 28 లక్షల వరకు వేలంలో అమ్ముడైనట్లు పేర్కొన్నారు.
లంక చెర నుంచి 14 మంది జాలర్ల విడుదల
సేలం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేడుకోలుకు అనుగుణంగా తమిళ జాలర్లు 14 మంది శ్రీలంక ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. ప్రధాన నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయనకు ఆ దేశ ప్రధాని ఘన స్వాగతం పలికారు. శ్రీలంక రాజధాని కొలంబోలు జరిగిన కార్యక్రమంలో ప్రధాని అనురా కుమార దిసనాయకోవై ప్రధాని మోదీని ప్రత్యేకంగా సమావేశమైయ్యారు. ఆ సమయంలో జాలర్ల సమస్య గురించి శ్రీలంక ప్రధానితో మోదీ చర్చించారు. ఆ సమయంలో తమిళ జాలర్లను విడుదల చేయాలని మోదీ కోరారు. ఈక్రమంలో వారి చర్చ అనంతరం శ్రీలంక ప్రభుత్వం ఆదివారం 14 మంది జాలర్లను జైలు నుంచి విడుదల చేసింది. వారిని త్వరలో తమిళనాడుకు తిరిగి వస్తుండడంతో అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. అదే సమయంలో సీజ్ చేసిన రూ. లక్షల విలువ చేసే మర పడవలను త్వరలో విడుదల చేసి అప్పగిస్తారని తమిళ జాలర్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐపీఎల్ టిక్కెట్లు
అదనపు ధరకు విక్రయం
– 11 మంది అరెస్టు
తిరువొత్తియూరు: చైన్నె–ఢిల్లీ ఐపీఎల్ మ్యాచ్ కోసం టికెట్లను బ్లాక్‌లో ఎక్కువ ధర కు విక్రయిస్తున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 34 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. చైన్నెలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో చాలా మంది టిక్కెట్లను అదనపు ధరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సీఎస్‌కే–ఢిల్లీ జట్ల మధ్య జరిగిన పోటీ సమయంలో అదనపు ధరకు విక్రయిస్తున్న 11 మందిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించి కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 34 టిక్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
25 మందితో ఎన్‌టీకే జాబితా
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల జాబితాను నామ్ తమిళర్ కట్చి ఆదివారం ప్రకటించింది. ఆ పార్టీ కన్వీనర్ సీమాన్ 25 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన ఓటు బ్యాంకుతో కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపును నామ్ తమిళర్ కట్చి దక్కించుకున్న విషయం తెలిసిందే. తమకు బలం ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసి అభ్యర్థులను ప్రకటించే పనిలో ఆ పార్టీ కన్వీనర్ సీమాన్ నిమగ్నమయ్యారు. ఇందులోభాగంగా 25 మందితో జాబితాను ప్రకటించారు. తిరువళ్లూరులో సెంథిల్‌కుమార్, గుమ్మిడిపూండిలో శ్రీధర్, చైన్నె థౌజండ్‌లైట్స్‌లో కలైంజియం పోటీ చేస్తారని ప్రకటించారు.


