ఆటిజం అవగాహనకు వాకథాన్‌ | - | Sakshi
Sakshi News home page

ఆటిజం అవగాహనకు వాకథాన్‌

Apr 7 2025 10:10 AM | Updated on Apr 7 2025 10:10 AM

ఆటిజం అవగాహనకు వాకథాన్‌

ఆటిజం అవగాహనకు వాకథాన్‌

సాక్షి, చైన్నె: ఆటిజంపై అవగాహన కల్పించే విధంగా వాకథాన్‌లో వైద్యులు, తల్లిదండ్రులు, ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు కలిసి అడుగులు వేశారు. ఐక్యత, కరుణను శక్తివంతంగా ప్రదర్శించే క్రమంలో చైన్నెలోని రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ నేతృత్వంలో ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని బెసెంట్‌ నగర్‌ బీచ్‌లో ఈ వాకథాన్‌ను ఆదివారం నిర్వహించారు. రెయిన్‌బో హాస్పిటల్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఆధన్‌ర్యంలో జరిగిన ఈ కార్యక్రమం, ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు, వారి తల్లిదండ్రులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బందిని ఒకచోట చేరారు. సమ్మిళిత, సహాయక సమాజాన్ని నిర్మించడానికి సమష్టిగా నిబద్ధతతో ముందడుగు వేశారు. ఆటిజం స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌ గురించి అవగాహన పెంచడం , ఆటిజం ఉన్న వ్యక్తులకు ముందస్తు రోగ నిర్ధారణ, గుర్తింపు, వైద్య పరంగా మద్దతును ప్రోత్సహించడంపై ఈ వాకథాన్‌ దృష్టి పెట్టారు. ఆటిజంతో బాధపడుతున్న పిల్లలను శక్తివంతం చేయడంలో సానుభూతి, ముందస్తు జోక్యం, సమాజ మద్దతు, ప్రాముఖ్యతను ఆస్పత్రి సీనియర్‌ వైద్యుల స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్స్‌లోని చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, డెవలప్‌మెంటల్‌ అండ్‌ బిహేవియరల్‌ పీడియాట్రిక్స్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ పెరుమాళ్‌ సత్య ఎస్‌తో పాటు పెద్ద సంఖ్యలో వైద్యులు తమసందేశాలను ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement