సత్యరాజ్, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో ‘మెడ్రాస్ మ్య
తమిళసినిమా: నటుడు సత్యరాజ్, కాళీవెంకట్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మెడ్రాస్ మ్యాట్నీ. నటి రోషిణి, హరిప్రియన్, సెల్వి, విశ్వ, జార్జ్ మరియన్,అర్చన సంతోష్, సునిల్, సుగధ, శ్యామ్స్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా ఇందులో నటుడు సత్యరాజ్ శాస్త్రవేత్తగా నటించారు. కార్తీకేయన్ మణి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మెడ్రాస్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా అభిషేక్ రాజ్, ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్రూసర్‌గా మూమెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అధినేత జీఏ హరికృష్ణన్ వ్యవహరించారు. కాగా దీనికి ఆనంద్ జీకే ఛాయాగ్రహణం, కేసీ.బాలస్వరంగన్ సంగీతాన్ని అందించారు. చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల మంచి స్పందన వచ్చిందని నిర్మాతలు పేర్కొన్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇంతకు ముందు అరివి, జోకర్, ఖైదీ వంటి పలు విజయవంతమైన చిత్రాలను విడుదల చేసిన డ్రీమ్ వారియర్స్ సంస్థ తమిళనాడులో విడుదల చేయనుంది. కాగా ఈ చిత్రాన్ని మే నెలలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు.


