పేరంబాక్కంలో వైభవంగా రఽథోత్సవం
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా పేరంబాక్కం గ్రామంలో ప్రసిద్ధి చెందిన కామాక్షి అమ్మవారు సమేత సోలీశ్వరుడి ఆలయం ఉంది. ఆలయంలో ఏటా పంగణి ఉత్సవాలను పది రోజుల పాటు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈనెల 1వ తేదీన ఉత్సవాలు ద్వజారోహణంతో ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా రోజు ఉదయం సాయంత్రం ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకం, రాత్రి సమయంలో వాహనాలపై ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం రఽథోత్సవం నిర్వహించారు. ఉదయం ఏడు గంటల నుంచి 9 గంటల వరకు రధాన్ని లాగిన భక్తులు తమ మొక్కుబడిని చెల్లించుకున్నారు. కాగా రథం నుంచి కామాక్షి అమ్మవారు, సోలీశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చారు.


