సీనియర్‌ సినీ నిర్మాత రామనాధన్‌ కన్నుమూత | - | Sakshi
Sakshi News home page

సీనియర్‌ సినీ నిర్మాత రామనాధన్‌ కన్నుమూత

Apr 8 2025 7:29 AM | Updated on Apr 8 2025 7:29 AM

సీనియర్‌ సినీ నిర్మాత  రామనాధన్‌ కన్నుమూత

సీనియర్‌ సినీ నిర్మాత రామనాధన్‌ కన్నుమూత

తమిళసినిమా: సీనియర్‌ సినీ నిర్మాత రామనాథన్‌(72) సోమవారం చైన్నెలో ఆనారోగ్యం కారణంగా కన్నుమూశారు. నటుడు సత్యరాజ్‌ వద్ద నిర్వాహకుడిగా పని చేసిన రామనాథన్‌ అనంతరం రాజ్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించిన నటుడు సత్యరాజ్‌ కథానాయకుడిగా వాద్దియార్‌ వీట్టి పిళ్‌లై, నడిగన్‌, వళ్లల్‌, తిరుమతి పళనీసామి, బ్రహ్మ, ఉడన్‌ పిరప్పు, విల్లాది విల్లన్‌ వంటి చిత్రాలను నిర్మించారు. అదే విధంగా నటుడు విజయ్‌కాంత్‌ హీరోగా భారతీరాజా దర్శకత్వంలో తమిళ్‌ సెల్వన్‌ చిత్రాన్ని నిర్మించారు. కాగా స్థానిక నుంగంబాక్కమ్‌, కొత్తారి రోడ్డులో నివశిస్తున్న రామనాథన్‌ ఆనారోగ్యం కారణంగా చైన్నెలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే వైద్యం ఫలించక సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈయనకు ప్రమిళ అనే భార్య, కారుణ్య, శరణ్య అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా విదేశాల్లో ఉన్న కూతుళ్లు చైన్నెకి తిరిగి చేరుకున్న తరువాత బుధవారం రామనాథన్‌ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా నిర్మాత రామనాథన్‌ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

చైన్నెలో సిటీ బస్సు డ్రైవర్లకు

రోజూ బ్రీత్‌ అనలైజర్‌ టెస్ట్‌

ప్రమాదాల నివారణకు చర్యలు

కొరుక్కుపేట: చైన్నెలోని సిటీ బస్సు డ్రైవర్లకు రోజూ మద్యం పరీక్షలు చేస్తున్నారు. ప్రమాదాల నివారణకు ఈ పద్ధతిని చేపట్టారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలా వరకు మద్యం తాగి వాహ నాలు నడిపే వారి వల్లే జరుగుతున్నట్లు సమాచారం. దీంతో చైన్నె సిటీ బస్సు డ్రైవర్లకు కూడా మద్యం పరీక్షలు చేస్తున్నారు. వారు తమ పనిని ప్రారంభించే ముందు ఈ పరీక్ష ఆల్కహాల్‌ టెస్టింగ్‌ ఎక్విప్‌మెంట్‌ ద్వారా నిర్వహించనున్నారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం షిఫ్ట్‌లలో. రాష్ట్ర రహదారి భద్రతా మండలి ఈ పద్ధతిని రాష్ట్ర రవాణా సంస్థ, రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌ రవాణా సంస్థల్లో అమ లు చేయాలని సూచించింది. ఇందుకోసం మొత్తం 339 ఆల్కహాల్‌ టెస్టింగ్‌ కిట్‌లను కొనుగోలు చేశారు. విల్లుపురం డివిజన్‌కు 70, సేలం డివిజనన్‌కు 39, కోయంబత్తూరు డివిజన్‌కు 82, కుంభకోణం డివిజన్‌కు 50, మధురై డివిజన్‌కు 58, తిరునల్వేలి డివిజన్‌కు 20 కిట్‌లు అందించారు. ప్రభుత్వ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ కార్పొరేషన్‌కు 20 ఆల్కహాల్‌ టెస్టింగ్‌ కిట్‌లను అందించడం గమనార్హం.

పాఠశాల వార్షిక పరీక్షలు ప్రారంభం

తిరువొత్తియూరు: 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అయితే వేసవి తాపం కారణంగా 1 నుంచి 5 తరగతుల తుది పరీక్షల షెడ్యూల్‌ను ఏప్రిల్‌ 7 నుంచి 17 వరకు ముందుగానే నిర్వహించనున్నారు. దీని ప్రకారం 1 నుంచి 5వ తరగతుల చివరి టర్మ్‌ పరీక్ష సోమవారం ప్రారంభమైంది. తొలిరోజు సోమవారం తమిళం సహా భాషా పరీక్షలు జరిగాయి. 1, 2, 3 తరగతులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 4, 5 తరగతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. 6 నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు మంగళవారం (8వ తేదీ) ప్రారంభం అవుతాయి. ఇక పరీక్షల అనంతరం 1 నుంచి 3 తరగతులకు వేసవి సెలవులు ఏప్రిల్‌ 12న, 4, 5 తరగతులకు ఏప్రిల్‌ 18న, 6 నుంచి 9 తరగతులకు 25న ప్రారంభమవుతాయి. అయితే పాఠశాలలో చివరి పనిదినం వరకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా విధులకు రావాలని, వేసవి సెలవుల అనంతరం జూన్‌ మొదటి వారంలో పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

సీఎం ఫార్మసీల్లో రాయితీపై మందులు

కొరుక్కుపేట: తమిళనాడులో కేంద్ర ప్రభుత్వ పీపుల్స్‌ ఫార్మసీలు, ప్రైవేట్‌ ఫార్మసీల కంటే ము ఖ్యమంత్రి ఫార్మసీల్లో ధరలు తక్కువగా ఉన్నా యని సహకార శాఖాఽఽధికారులు వెల్లడించారు. దీంతో ప్రజలకు వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గాయి. 2024 ఆగస్టు 15న జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ మాట్లాడుతూ ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రజలు మందులకు అధిక ధరలు చెల్లించాల్సి వచ్చింది. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు రోజూ మందు లు వాడాల్సి రావడంతో ప్రజలకు వైద్య ఖర్చు లు పెరుగుతున్నాయి. అందుకోసం సాధారణ మందులు, ఇతర మందులకు తక్కువ ధరకే సీఎం ఫార్మసీ అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి ఫార్మసీకి సాధారణ ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. దీన్నిబట్టి చూస్తే ప్రైవేట్‌ ఫార్మసీలే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ఫార్మసీలు కూడా వాటితో పోలిస్తే తక్కు వ ధరకే మందులను విక్రయిస్తున్నట్లు స్పష్టమవుతోంది. చైన్నెలోని స్థానిక ఫార్మసీల్లో మధుమేహం, రక్తపోటు, ఊబకాయం మందులను పోల్చి చూ స్తే, సీఎం ఫార్మసీల్లో 30 శాతం చౌకగా ఉన్నా య ని తేలింది. మరో ప్రయోజనం ఏమిటంటే, జనరిక్‌ మందులు ఫార్మసీల్లో సులభంగా అందుబా టులో ఉంటాయి. 25 శాతం వరకు తగ్గింపుతో అందిస్తారు. ప్రస్తుతం సీఎం ఫార్మసీల్లో 206 రకాల మందులు విక్రయిస్తున్నట్లు సహకార శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement