పరిశోధనలపై దృష్టి పెట్టాలి
కొరుక్కుపేట: సామాజిక ప్రభావ పరిశోధనలపై విద్యార్థులు దృష్టి పెట్టాలని అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న అతిథులు, వక్తలు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎస్‌ఆర్‌ఎం కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (ఎమర్జింగ్ టెక్నాలజీస్ )ఆధ్వర్యంలో అంతర్జాతీయ కంప్యూటింగ్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ సస్టైనబుల్ ప్లానెట్ (ఐసీసీఈటీఎస్‌పీ–2025)అనే సదస్సు బుధవారం ఆరంభమైంది. సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ, అసొసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ భారతీ గోపాలస్వామి సదస్సు లక్ష్యాలను వివరించగా, స్వాగతోపన్యాసాన్ని విభాగాధిపతి డాక్టర్ పి.చిత్ర చేశారు. ముఖ్యఅతిథిగా డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ శాస్త్రవేత్త, డైరెక్టర్ డాక్టర్ ఆర్ బాలమురళీకృష్ణన్, గౌరవ అతిథిగా మలేషియాలోని టేలర్స్ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అఫిజాన్ బిన్ అజ్మాన్ ముఖ్య ప్రసంగం చేశారు. కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. అన్ని విభాగాల విద్యార్థులు సామాజిక ప్రభావ పరిశోధనలపై పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈ సదస్సుకు 350కిపైగా పరిశోధన పత్రాలు రాగా వాటిలో 130 పత్రాలు షార్ట్‌లిస్ట్ చేసినట్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.ప్రభ తెలిపారు. ఇందులో డాక్టర్ సీవీ జయకుమార్, డాక్టర్ సి. గోమతి, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
● అంతర్జాతీయ సదస్సులో అతిథులు


