ఉపవాస దీక్షలతో గుడ్‌ఫ్రైడే
సేలం: రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ ఆలయాలలో గుడ్‌ఫ్రైడే ప్రార్థనలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన ఏసు శిలువ ర్యాలీలు క్రైస్తవులు కన్నీటి పర్యంతమయ్యారు. చైన్నె నగరంలోని సెయింట్ థామస్ మౌంట్, ప్యారిస్ వేలాంకన్ని చర్చ్ తదితర పలు ప్రాంతాలలో ఉన్న క్రైస్తవ మందిరాలలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.
సేలంలో..
గుడ్‌ఫ్రైడే వేడుకలను సేలంలో బాల యేసు కేథడ్రల్ చర్చ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్లకు కట్టే రీతిలో జరిపిన ఏసు శిలువ మోసిన ఘటనలు క్రైస్తవులు కన్నీటి పర్యంతమయ్యారు. సేలం నాల్ రోడ్‌లోని ఇనఫాంట్ జీసస్ కేథడ్రల్ చర్చ్‌లో ప్రధాన ఫాదర్ జోసెఫ్ లాజర్ నేతృత్వంలో యేసుక్రీస్తు శిలువ వేయడంపై ప్రార్థనలు, పాటల కార్యక్రమం జరిగింది. సేలంలో ఉన్న ఇన్‌ఫాంట్ జీసస్ కేథడ్రల్ చర్చ్‌లు శుక్రవారం ఉదయం ఏసుక్రీస్తు చేత శిలువ మోయించడం, వీధుల్లో ఊరేగింపు తీసుకెళ్లి ఏసుక్రీస్తును శిలువ వేయడం పలు కార్యక్రమాన్ని వీక్షించడానికి వేలాది మంది క్రైస్తవులు కేథడ్రల్ కాంప్లెక్స్ వద్ద గుమిగూడారు. ఆ సమయంలో చర్చ్ వద్దకు ఏసుక్రీస్తు వేషధారణలో ఉన్న ఒక క్రైస్తవుడు శిలువను మోస్తూ చర్చ్ వద్దకు వచ్చిన సంఘటన, ఆ తర్వాత ఆయన్ని శిలువ వేసిన ఘటనలను చూసి క్రైస్తవులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.
చర్చిల్లో గుడ్‌ఫ్రైడే ప్రార్థనలు
తిరువళ్లూరు: క్రైస్తవులు పవిత్రంగా భావించే గుడ్‌ఫ్రైడే సందర్భంగా తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా వున్న చర్చిల్లో శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏసు క్రీస్తును శిలువ వేసిన రోజును గుడ్‌ఫ్రైడే భావించి ప్రత్యేక ప్రార్థనలను ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందు కోసం 40 రోజులపాటు ఉపవాసం చేస్తున్న క్రైస్తవులు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏసు క్రీస్తును పాటలు సువార్తతో ఆరాధించారు. ఏసు క్రీస్తును శిలువలో వేసే సమయంలో క్రీస్తు చేసిన ఏడు ప్రధానమైన వ్య్ఖ్యాలను ఆధారంగా చేసుకుని మతబోధకులు ప్రత్యేక వాక్యపరిచర్య చేశారు. గుడ్‌ఫ్రైడే ఆరాధనలు తిరువళ్లూరు ఊత్తుకోట మనవాలనగర్ పూందమల్లి సెవ్వాపేట రామంజేరి తామరపాక్కం కడంబత్తూరు పేరంబాక్కంతోపాటు జిల్లా వ్యాప్తంగా చర్చిల్లో నిర్వహించారు. ఏసుక్రీస్తు పునర్జన్మ వేడుకలను ఆదివారం ఈస్టర్‌గా జరుపుకోనున్నారు.
గుడ్‌ఫ్రైడే వేడుకలు
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో గుడ్‌ఫ్రైడే వేడుకలను శుక్రవారం క్రైస్తవ సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. సమస్త మానవాళి పాప పరిహారం నిమిత్తం ప్రవక్త ఏసు ప్రభువుని యూదా రాజులు శిలువపై వేలాడి దీసిన రోజును క్రైస్తవులు మంచి శుక్రవారంగా(గుడ్‌ఫ్రైడే) దినంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా క్రైస్తవులందరూ 40 రోజులపాటు ఉపవాసం ఉంటారు. పాపుల కోసం ఏసు ప్రభువు ప్రాణాలు అర్పించారని, ఆయన కోసమే జీవితాన్ని అర్పిస్తామని ప్రార్థనలు చేసుకోవడం ఆనవాయితి. అందులో భాగంగా గురువారం రాత్రి నుంచే కొన్ని చర్చిలలతో ప్రార్థనలు చేపట్టి స్వామివారి బైబిల్‌ను మత బోధకులు తెలియజేశారు. అదే విధంగా శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని చర్చిలలో ఏసు ప్రభువును శిలువలో వేసిన సమయంలో ప్రజల కోసం చెప్పిన ఏడు వాక్యాలను మత బోధకులు వివరించి సోదరులకు తెలియజేశారు. సోదరులు ఉదయం నుంచి ఉపవాసంతో ఉండి మద్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక గంజిని తాగి ఉపవాసాన్ని ముగించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం ఏసు ప్రభువు శిలువను మోసుకెళ్లే విధంగా ఊరేగింపుగా శిలువలను చేతపట్టి చర్చిలకు వెల్లారు. కొన్ని చర్చిలలో క్రైస్తవులు కన్నీళ్లు పెట్టి ప్రార్థనలు చేపట్టి ఏడు వచనాలను వివరించారు.
కళ్లకు కట్టిన ఏసు శిలువ ఘటన
క్రైస్తవులు కన్నీటి పర్యంతం
ఉపవాస దీక్షలతో గుడ్‌ఫ్రైడే


