సాక్షి,చైన్నె : ఫెడరేషన్ ఆఫ్ డైరెక్టర్ సెల్లింగ్ పారిశ్రామిక వృద్ధిలో మహిళల పాత్రను మరింతగా ప్రోత్సహించే దిశగా ఎఫ్‌డీఎస్‌ఏ కేంద్రం మారిందని వక్తలు వ్యాఖ్యానించారు. ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ సమాఖ్య, షూలిని వర్సిటీ నేతృత్వంలో చైన్నె అరుంబాక్కంలో గురువారం విద్య, అవగాహన కార్యక్రమాన్నినిర్వహించారు. తమిళనాడులోని 300 మందికి పైగా డైరెక్ట్ సెలర్లు, 29 క్రియా శీలక సభ్య కంపెనీల డైరెక్టర్ సెల్లింగ్ పరిశ్రమల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎఫ్‌డీఎస్‌ఏఅధ్యక్షుడు ఏపీ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజీవ్ గుప్తా, దేవ్ ఆనంద్, షూలినీ వర్సిటీ ప్రతినిధులు ప్రొఫెసర్ థామస్ జోషప్, ప్రొఫెసర్ కమల్‌కాంత్ వశిష్టలు హాజరయ్యారు. ఇందులో రాష్ట్ర పౌరసరఫరాల విభాగం డైరెక్టర్ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని పరిశ్రమ అవగాన, స్థిరమైన ప్రయత్నాలను ప్రశంసించారు. డైరెక్ట్ సెల్లింగ్ నియమాలు, నైతిక పద్ధతులు, నియంత్రణ చట్టాలు, ది కన్స్యూమర్ ప్రొటెక్షన్ (డైరెక్ట్ సెల్లింగ్) విధానాలను వివరించారు. దీనిని ఒక విద్యా కార్యక్రమంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ ప్రయాణం గురించి ప్రస్తావిస్తూ, రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలతో సహకారం, వినియోగదారుల రక్షణ వంటి అంశాలను విశదీకరించారు. దక్షిణ భారత దేశంలో తమిళనాడు పరిశ్రమలపరంగా ముందంజలో ఉన్నట్టు, ప్రతి జిల్లాకు కనీసం ఒక డైరెక్టర్‌సెల్లింగ్ నిలయాలు ఉన్నట్టు వివరించారు. ఈ పరిశ్రమ వార్షిక అమ్మకాలు రూ. 26,000 కోట్లకు విస్తరించినట్టు పేర్కొంటూ ప్రధానంగా మహిళా భ్యున్నతికి మరింత తోడ్పాటుగా మారిందని వివరించారు.


