అజిత్ 65వ చిత్రానికి దర్శకుడు..?
తమిళసినిమా: నటుడు అజిత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. నటి త్రిష నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో టాలీవుడ్ చిత్రం నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఇటీవల ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇది నటుడు అజిత్ కథానాయకుడు నటించిన 64వ చిత్రం అన్నది గమనార్హం. దీంతో ఈయన నటించే 65వ చిత్రానికి దర్శకుడు ఎవరు? ఏ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించనుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. నటుడు అజిత్‌కు ఓ పాలసీ ఉంది. హాయ్ రా నటించిన చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధిస్తే మళ్లీ అదే దర్శకుడితోనో, అదే నిర్మాణ సంస్థలో చిత్రం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అలా ఇంతకుముందు దర్శకుడు శివతో వరుసగా నాలుగు చిత్రాలు, అదేవిధంగా విష్ణువర్ధన్‌తో రెండు చిత్రాలు, దర్శకుడు హెచ్. వినోద్‌తో రెండు చిత్రాలు చేసి మంచి విజయాలను అందుకున్నారు. కాగా తాజాగా ఈయన నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మంచి విజయాన్ని సాధించడంతో, మళ్లీ ఆ చిత్ర దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ మరో ఛానన్స్ ఇవ్వబోతున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే అంతకుముందే నటుడు ధనుష్ అజిత్‌ను కలిసి కథ చెప్పినట్లు ఆ కథ నచ్చడంతో ఆయన దర్శకత్వంలో నటించడానికి అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కాగా తాజాగా మరో టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడితో పనిచేయడానికి అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఆయన ఎవరో కాదు. ఇంతకుముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా పుష్ప, పుష్ప– 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్ అని సమాచారం. ఈ దర్శకుడు త్వరలో నటుడు అజిత్ ను కలిసి కథ వినిపించడానికి సిద్ధమవుతున్నట్లు టాక్. అయితే ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే ఈ రేర్ కాంబినేషన్‌లో చిత్రం అంటే కచ్చితంగా అది వేరే లెవల్ లో ఉంటుందని చెప్పవచ్చు. మరో విషయం ఏంటంటే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ నటులు టాలీవుడ్ దర్శకులు, చిత్ర నిర్మాణ సంస్థలపై దృష్టి పెడుతుండడం తెలిసిందే. కాగా నటుడు అజిత్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన చైన్నెకి తిరిగి వచ్చిన తరువాత తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
అజిత్ 65వ చిత్రానికి దర్శకుడు..?
అజిత్ 65వ చిత్రానికి దర్శకుడు..?


