
కుశస్థలిలో వరద ప్రవాహం
పళ్లిపట్టు: పళ్లిపట్టు పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పళ్లిపట్టు, తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద ప్రవాహం చోటుచేసుకుంటోంది. ప్రజాపనుల శాఖకు చెందిన 79 చెరువుల్లో 12 చెరువులు పూర్తిగా నిండాయి. అదే సమయంలో పళ్లిపట్టు సమీపంలోని ఆంధ్రాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న క్రమంలో చిత్తూరు జిల్లాలోని కృష్ణాపురం జలాశయం వేగంగా నిండుతోంది. దీంతో త్వరలో కుశస్థలి జలాశయం నిండి మిగులు జలాలు విడుదల చేసే అవకాశాలున్నాయి. అదే సమయంలో వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో కుశస్థలిలో వరద ప్రవాహం చోటుచేసుకుంది. దీంతో నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.