
గ్రూప్–2 పరీక్షలకు 3,883 మంది గైర్హాజరు
తిరువళ్లూరు: జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో జరిగిన గ్రూప్–2, 2ఏ పరిక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా వున్న పోస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో భాగంగానే జిల్లా నుంచి 14,278 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం తిరువళ్లూరు, తిరుత్తణి, పొన్నేరి, పూందమల్లి, ఆవడి ప్రాంతాల్లో 34 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించడానికి 45 మంది స్పెషల్ స్క్వాడ్, 17 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, డెప్యూటీ కలెక్టర్‌ల నేతృత్వంలో మరో ఐదు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి నిఘా వుంచారు. కాగా పరీక్ష హాలుకు అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే లోపలికి అనుమతించారు. క్యాలుకులేటర్, బ్లూటాత్, సెల్‌ఫోన్‌లను అనుమతించలేదు. పరీక్ష కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్‌లను సైతం మూసివేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం జరిగిన పరీక్షలకు మొత్తం 1,4278 మంది హాజరుకావాల్సి వుండగా, 10,395 మంది హాజరయ్యారు. 3,883 మంది హాజరుకాలేదు. కాగా కాకలూరులోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ప్రతాప్ పరిశీలించారు.