సగటు మనిషి జీవన చిత్రం పేరూరు కవిత్వం | - | Sakshi
Sakshi News home page

సగటు మనిషి జీవన చిత్రం పేరూరు కవిత్వం

Sep 29 2025 8:08 AM | Updated on Sep 29 2025 8:08 AM

సగటు మనిషి జీవన చిత్రం పేరూరు కవిత్వం

సగటు మనిషి జీవన చిత్రం పేరూరు కవిత్వం

కొరుక్కుపేట: రైతు జీవన స్థితిగతులను, సామాజిక ప రిస్థితులను తన కవితా వస్తువులుగా తీసుకుని ఉగ్గుపా ల నుంచే కవితా సంపుటి తీసుకురావడం సంతోషదాయకమని, పేరూరుకి స్నేహితులంటే అపారమైన ప్రే మని వక్తలు కొనియాడారు. ఆదివారం చైన్నె, మైలాపూ ర్‌లోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనంలో జనని సాంఘిక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో డాక్ట ర్‌ నిర్మల సభాధ్యక్షతన గుర్రం జాషువా జయంతిని ని ర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘ టించి, తిరుపతి రచయిత పేరూరు బాలసుబ్రమణ్యం రాసిన ఉగ్గుపాల నుంచే కవితా సంకలనంపై పరిచయ సభ ఏర్పాటు చేశారు. సమావేశానికి రచయిత డాక్టర్‌ నె మిలేటి కిట్టన్న, జనని ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మన్నవ గంగాధరప్రసాద్‌, వసుంధరాదేవి, పొట్టిశ్రీరాములు స్మా రక భవన నిర్వాహక కమిటీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి, డాక్టర్‌ విస్తాలి శంకరరావు, జనని సంస్థ ప్రధానకార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, యువశ్రీ,కాసల నాగభూ షణం, కిడాంబి లక్ష్మీకాంత్‌ హాజరయ్యారు. రచయిత పేరూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ నేను అనుభవించిన జీవితాన్నే నా కవితా వస్తువుగా తీసుకున్నాన్నంటూ నా పుస్తకాన్ని జనని చైన్నెలో పరిచయం సభ ఏర్పాటు చేయడం వారికి కతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement