విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
తిరువళ్లూరు: రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె నందనం నిర్వాహకుల ఆధ్వర్యంలో వంద మంది ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులకు ఉచితంగా సైకిల్‌ను రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె నందనం నిర్వాహకులు అందజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె నందనం ఆధ్వర్యంలో విద్యార్థులే లక్ష్యంగా వేర్వేరు సహాయకాలను అందిస్తున్నారు. ఇందులోభాగంగానే తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్‌లోని ప్లేస్‌పాళ్యం, అల్లికుళీ రెండు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9, 10వ తరగతి చదువుతున్న వందమంది విద్యార్థులకు సైకిల్‌ను అందజేయాలని రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె నందనంతోపాటు రోటరీ జిల్లా 3234 క్లబ్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే ప్లేస్‌పాళ్యంలో సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. రోటరీ అధ్యక్షుడు నవీన్‌ప్రసాద్‌యాదవ్ అధ్యక్షత వహించగా కార్యదర్శి రొటేరియన్ ఢిల్లీబాబు హాజరయ్యారు. ఢిల్లీబాబు మాట్లాడుతూ తమ రోటరీ సంఘం విద్య, ఎంపవర్‌మెంట్, కమ్యూనిటీ డెవలప్‌మెటంట్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రస్తుతం వంద మంది విద్యార్థులకు ఉచితంగా సైకిల్‌ను అందజేశామని, త్వరలోనే తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తతంృ చేస్తామని హెచ్చరించారు. కోశాధికారి వాసు విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


