థియేటర్‌కు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది! | - | Sakshi
Sakshi News home page

థియేటర్‌కు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది!

Oct 24 2025 7:44 AM | Updated on Oct 24 2025 7:46 AM

థడై అదై ఉడై చిత్ర ఆడియోను

ఆవిష్కరించిన ఏజే బాలకృష్ణన్‌, అరుళ్‌దాస్‌తో యూనిట్‌ సభ్యులు

తమిళసినిమా: గాంధీమతి పిక్చర్స్‌ పథకంపై అరివళగన్‌ మురుగేశన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం థడై అధై ఉడై. అంగాడి తెరు చిత్రం ఫేమ్‌ మహేష్‌, తిరుక్కురల్‌ చిత్రం ఫేమ్‌ గుణబాబు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కేఎం పారివళ్లాల్‌, తిరువారూర్‌ గణేష్‌,మహాధీర్‌ ముహమ్మద్‌, తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సాయి సుందర్‌ సంగీతాన్ని, తంగపాండియన్‌, చోటా మణికంఠన్‌లో ద్వయం ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 31వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో తిరుక్కురళ్‌ చిత్రం ఫేమ్‌ ఏజే బాలకృష్ణన్‌, నటుడు అరుళ్‌ దాస్‌ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. అనంతరం దర్శకుడు ఏజే బాలకృష్ణన్‌ మాట్లాడుతూ థడై అదై ఉడై (నిషేధాన్ని బద్ధలు కొట్టు). ఈ చిత్ర టైటిలే చాలా ముఖ్యమైందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో చూస్తే రచనలు నిషేధించబడ్డాయని, నాటకాలు నిషేధించబడ్డాయని, చిత్రాల కూడా నిషేధించబడ్డాయని అన్నారు. కాగా అలాంటి అంశాలతో రూపొందిన థడై అదై ఉడై చిత్రం మంచి విజయాన్ని సాధించాలని పేర్కొన్నారు. 1980 ప్రాంతంలో చిత్రాలను అందరూ చూసే వారిని అయితే ఇప్పుడు 30 శాతం మంది మాత్రమే చూస్తున్నారని అన్నారు. చిత్ర దర్శక నిర్మాత అరివళగన్‌ మురుగేశన్‌ మాట్లాడుతూ ఈ వేదికపై అందరం నవ్వుకుంటున్నామని అయితే అందరూ రక్తం చిందించి ఈ చిత్రం కోసం పనిచేసినట్లు పేర్కొన్నారు. వ్యవసాయం కంటే చిత్ర నిర్మాణం కష్టంగా ఉంది అంటూ తన తండ్రి పేర్కొన్నారు. అలా 36 గంటలు ఈ చిత్రం కోసం శ్రమించిన యూనిట్‌ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. తాను జపాన్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసి సంపాదించిన డబ్బుతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటూ ఊర్లోని వారందరూ సంపాదించింది ఖర్చు చేసి ఎందుకు సినిమా నిర్మిస్తున్నానని తిట్టారన్నారు. అయినా తాను కచ్చితంగా విజయం సాధిస్తానని నమ్మకంతో ఈ చిత్రం చేసినట్లు చెప్పారు.

థియేటర్‌కు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది! 1
1/1

థియేటర్‌కు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement