20 ఏసీ డబుల్‌ డెక్కర్‌ బస్సులు | - | Sakshi
Sakshi News home page

20 ఏసీ డబుల్‌ డెక్కర్‌ బస్సులు

Mar 19 2026 7:45 AM | Updated on Mar 19 2026 7:45 AM

సాక్షి, చైన్నె : చైన్నెలో 20 ఏసీ డబుల్‌ డెక్కర్‌ బస్సులను రోడ్డెక్కించేందుకు ఎంటీసీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి బుధవారం టెండర్లు జారీ చేసింది. చైన్నెలో ఒకప్పుడు డబుల్‌ డెక్కర్‌ బస్సుల సేవలు జరిగిన విషయం తెలిసిందే. వంతెనల ఏర్పాటు విస్తృతం కావడంతో ఈ బస్సులు కనుమరుగయ్యాయి. తాజాగా ఈ బస్సులను మళీ రోడ్డెక్కించేందుకు చర్యలు తీసుకున్నారు. తాజాగా మహాబలిపురం వైపుగా పర్యాటక డబుల్‌ డెక్కర్‌ బస్సు సేవలు అందుతున్నాయి. దీనికి వస్తున్న అమిత స్పందనతో మరిన్ని బస్సులు నడిపేందుకు సన్నద్ధమవుతున్నారు. అదే సమయంలో ఓపెన్‌ టాప్‌ రూపంలో రెండవ అంతస్తును వదలి పెట్టే దిశగా ఆలోచనలో ఉన్నప్పటికీ, తాజాగా 20 డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సుల కొనుగోలుకు ఎంటీసీ వర్గాలు నిర్ణయించాయి. ఇందుకు సంబంధించి టెండర్లు జారీ చేశాయి.

జ్వరం వస్తే 7 రకాల వైద్య పరీక్షలు

– ఆరోగ్య శాఖ ఆదేశాలు

సాక్షి, చైన్నె : రోజుల తరబడి జ్వరం, తీవ్ర దగ్గు, జలుబు, వంటి సమస్యలతో ఆస్పత్రులకు వచ్చే వారికి ఏడు రకాల వైద్య పరీక్షలు చేయడానికి ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా వేసవి కాలంలో అడుగు పెట్టాం. కొన్ని చోట్ల భానుడ భగ.. భగ మంటున్నాడు. మరికొన్ని చోట్ల వర్షాలు పలకరిస్తున్నాయి. బుధవారం నాగపట్నం, తిరువారూర్‌, మైలాడుతురై , తెన్కాశి తదితర జిల్లాలో అనేక చోట్ల వర్షం పడింది. డెల్టా, సముద్ర తీరం, దక్షిణ తమిళనాడు జిల్లాలో ఏడు రోజుల పాటూ అక్కడక్కడ చెదరుముదురుగా వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అదే సమయంలో మారిన వాతావరణం నేపథ్యంలో జ్వరాలు సైతం స్వైర విహారం చేసున్నాయి. అయితే ప్రాణాంతక సమస్య నెలకొన్నట్టుగా పరిస్థితులు లేవు. అదే సమయంలో రూపాంతరం చెందిన కరోనా పరిస్థితుల రూపంలో కొత్త వైరస్‌ల ప్రభావం ఉండ వచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు ఆస్పత్రులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులకు రోజుల తరబడి జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధ పడుతున్న వారికి ఏడు రకాల వైద్య పరిశోధనలు నిర్వహించే విధంగా ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. సీజనల్‌ జ్వరాలే అయినా, వీటి ద్వారా పెద్ద ప్రభావం బాధితులకు ఏర్పడదని, అయితే ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షలకు ఆదేశించినట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది.

పన్నీరుకు ఇంటర్వ్యూ

సాక్షి, చైన్నె:మూడు సార్లు సీఎంగా,పలుమార్లు ఎమ్మె ల్యేగా, ఆర్థిక మంత్రిగా వ్య వహరించిన మాజీ సీఎం పన్నీరు సెల్వం తాజాగా ఎమ్మెల్యే సీటు కోసం ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తనకు ఉన్న వ్యక్తిగత బలం, గెలుపు అవకాశాలు తదితర అంశాలను గురించి ఆయన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ నేతృత్వంలోని కమిటీ ముందు వివరించిన తానేమిటో నిరూపించుకున్నారు. ఇది వరకటి అసెంబ్లీ ఎన్నిక ల వరకు పన్నీరు సెల్వం అన్నాడీఎంకేలో అత్యంత కీలక నేత. ఆయనే అభ్యర్థులను ఎంపిక చేసే వారు. అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో కీలకంగా వ్యవహరించే వారు. అయితే, తాజాగా ఆయన అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురయ్యారు. మళ్లీ చేరే ప్రయత్నాలు చేసినా అవన్నీ బెడిసి కొట్టడంతో చివరకు డీఎంకేలో చేరారు. ఆయన తనయుడు రవీంద్రనాథ్‌ కూడా డీఎంకే తీర్థం ఇటీవల పుచ్చుకున్నారు. ఈ పరిస్థితులలో తేని జిల్లా బొడి నాయకనూరు, పెరియకుళం నియోజకవర్గాలలో పోటీ చేయడానికి పన్నీరు, రవీంద్రనాథ్‌ డీఎంకేలో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో స్టాలిన్‌ సమక్షంలో బుధవారం సాయంత్రం జరిగిన ఇంటర్వ్యూలకు పన్నీరు హాజరైన తానేమిటో నిరూపించుకుని సీటు కోసం ప్రయ త్నాలు చేయాల్సిన పరిస్థితి రావడం గమనార్హం.

లారీ ఢీకొని

చైన్నె బస్సు బోల్తా

– ఒకరు మృతి, 20 మందికి గాయాలు

తిరువొత్తియూరు: చైన్నె నుంచి తిరువణ్ణామలైకి ప్రభుత్వ లగ్జరరీ బస్సు ఒకటి వెళ్తోంది. ఈ బస్సును తిరువణ్ణామలై జిల్లాకు చెందిన ఏలుమలై (52) నడుపుతున్నాడు. ఈ బస్సు సారం జంక్షన్‌ సమీపంలోకి వస్తుండగా, కరూర్‌ నుంచి చైన్నెకి వస్తున్న టారస్‌ లారీ అతివేగంగా వచ్చి ప్రభుత్వ బస్సును ఢీకొట్టింది. దీంతో ప్రభుత్వ బస్సు బోల్తా పడి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రైవేట్‌ బ్యాంకు ఉద్యోగి కళ్లకురిచ్చి జిల్లా మురుకమ్పాడికి చెందిన శశికళ (25) అనే మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న ప్రభుత్వ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ సహా 20 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని తిండివనం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో చేర్చారు డారస్‌ లారీ డ్రైవర్‌ బీహార్‌ రాష్ట్రానికి చెందిన మహ్మద్‌ అస్లాం లారీ ముందు భాగం మొత్తం దెబ్బతినడంతో అందులో ఇరుక్కుపోయాడు. అతన్ని క్రేన్‌ సహాయంతో పోలీసులు రక్షించారు. ఈ ప్రమాదం కారణంగా చైన్నె– తిరుచ్చి జాతీయ రహదారిపై సుమారు 1 గంటకు పైగా ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను సరిచేశారు. బస్సును క్రేన్‌ సహాయంతో ఒలక్కూర్‌ పోలీసులు రక్షించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.జాతీయ రహదారి ప్రాంతంలో విద్యుత్‌ లైట్లు లేకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement