సాక్షి, చైన్నె: మల్టీ–స్పెషాలిటీ హెల్త్‌కేర్ నెట్‌వర్క్ కావేరి హాస్పిటల్ ,చైన్నె సూపర్ కింగ్స్(సీఎస్‌కే) జట్టుకు అధికారిక భాగస్వామిగా వ్యవహరించనున్నట్లు ప్రకటించింది. క్రీడా వైద్యం , అథ్లెట్ల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడంలో ఈ భాగస్వామ్యం కీలకం కానున్నది. క్రీడాకారులకు ఎదురయ్యే గాయాలకు అధునాతన చికిత్స, త్వరితగతిన కోలుకునేలా పునరావాస సేవలను అందించడానికి కావేరి హాస్పిటల్ ప్రత్యేకంగా ’స్పోర్ట్స్ అండ్ ఆర్థ్‌రోస్కోపిక్ సెంటర్’ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ద్వారా ప్రొఫెషనల్ అథ్లెట్లతో పాటు క్రీడల్లో చురుగ్గా ఉండేవారికి అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి ఈ సందర్భంగా కావేరి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కో–ఫౌండర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ మాట్లాడుతూ.. ‘నేటి కాలంలో స్పోర్ట్స్ మెడిసిన్ అనేది కేవలం గాయాలకు చికిత్స చేయడం మాత్రమే కాదని, అది ఖచ్చితత్వం, వేగంగా కోలుకోవడం , ఆటగాళ్లు తిరిగి తమ పీక్ పెర్ఫార్మెన్స్‌ను అందుకునేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. చైన్నె సూపర్ కింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ.. తమ క్రీడాకారుల ఆరోగ్యం, ఫిట్‌నెస్ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా పేర్కొన్నారు. వైద్య రంగంలో కావేరి హాస్పిటల్‌కు ఉన్న అపారమైన అనుభవం, అత్యాధునిక మౌలిక సదుపాయాలు తమ జట్టుకు ఎంతో మేలు చేస్తాయని వ్యాఖ్యానించారు. ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ అయ్యప్పన్ పొన్ను స్వామి, క్లినికల్ లీడ్ డాక్టర్ ఎస్ శివరామ్ పాల్గొన్నారు.


