మళ్లీ ఢిల్లీకి పంచాయితీ
సాక్షి,చైన్నె : అన్నాడీఎంకే – బీజేపీ ఎన్‌డీఏ కూటమి సీట్ల పంపకాల పంచాయతీ మళ్లీ ఢిల్లీకి చేరింది. హుటాహుటిన గురువారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళణిస్వామి ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అన్నాడీఎంకే , బీజేపీ సీట్ల పంపకాలు ఆసక్తికరంగా మారి ఉన్న విషయం తెలిసిందే. బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్, కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ చైన్నెకు రావాల్సి ఉండగా, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ముందుగానే అలర్ట్ అయ్యారు. పీయూష్‌గోయాల్ ద్వారా అధిక సీట్లకు బీజేపీ వర్గాలు పట్టుబడుతుండటంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షాద్వారా సమస్యనుపరిష్కరించుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఢిల్లీకి సీట్ల సర్దుబాటు పంచాయతీ మళ్లీ చేరినట్టైంది.
165 స్థానాలు లక్ష్యం
ఈసారి ఎన్నికలలో అన్నాడీఎంకే 165 స్థానాలలో పోటీ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. కూటమిలోని బీజేపీకి 22, పీఎంకే అన్బుమణికి 17, దినకరన్ అమ్మమక్కల్ మున్నేట్ర కళగంకు 9, తమిళ మానిల కాంగ్రెస్‌కు 3 సీట్లు ఇవ్వడానికి సిద్ధమైనట్టు సమాచారం. కూటమిలోకి వస్తే పుదియ తమిళగంకు 3 ఇవ్వడమే కాకుండా, ఐజేకే, పుదియ నీది తదితర పార్టీలకు రెండు లేదా ఓ సీటును ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు తెలిసింది. అయితే, ఈ పార్టీలు అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంలో పోటీ చేసే విధంగా పళనిస్వామి నిబంధన ఉంచుతుండటం గమనార్హం. దీంతో ఆయా పార్టీలు సీట్ల సంఖ్యను పెంచాలన్న ఒత్తిడి తీసుకు రావడంతో వ్యవహారం అమిత్ షా ముందు ఉంచి , సర్దుబాటు చేయడం లక్ష్యంగా పళణి స్వామి ఢిల్లీ వెళ్లినట్టఅన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.


