తిరుత్తణి: మద్యం దుకాణం ప్రారంభానికి వ్యతిరేకంగా మహిళలు ఆర్డీఓ కార్యాలయం ముట్టడించి ఆందోళన చేశారు. తిరుత్తణి యూనియన్‌లోని ఎల్లంపల్లె గ్రామ బస్ షెల్టర్‌కు సమీపంలో కొత్తగా టాస్మాక్ దుకాణం ప్రారంభానికి గది నిర్మిస్తున్నట్లు ఆరోపిస్తూ ఎల్లంపల్లెకు చెందిన మహిళలు సహా వందమంది శుక్రవారం ఆర్డీఓ కార్యాలయం ముట్టడించి ఆర్డీఓ కనిమొళికి ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ అత్యవసర పనుల నిమిత్తం ఫిర్యాదు స్వీకరించి వెంటనే వెళ్లిపోయారు. అయితే తమ డిమాండ్ నెరవేర్చాలనే డిమాండ్‌తో మహిళలు ఆర్డీఓ కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఏఎస్పీ శుభమ్‌దిమాన్, సీఐ శివకుమార్ మహిళలతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.


