తిరువళ్లూరు: చేతబడి చేశారని నమ్మించి మహిళ వద్ద రూ.5లక్షలు వసూలు చేసి ఉడాయించిన ఆలయ పూజారిపై పోలీసులకు బాధిత మహిళ పిర్యాదు చేసింది. తిరువళ్లూరు జిల్లా వెంగళ్ సమీపంలోని వెల్లియూర్ గ్రాఆవననికి చెందిన రేవతి(25). ఈమె విజయ్ అనే వ్యక్తితో వివాహం కాగా వీరికి ఇద్దరు పిల్లలు వున్నారు. కాగా ఆలయానికి నిత్యం వెళ్లేరేవతితో ఆలయ పూజారి ప్రకాష్ పరిచయం పెంచుకున్నాడు. రేవతి ఇంటికి చేతబడి చేశారని, వాటిని తీయకుంటే తీవ్ర నష్టం జరుగుతుందని నమ్మించి మహిళ నుంచి రూ.5.52 లక్షలు మోసం చేసి ఉడాయించాడు. ఈ సంఘటనపై మోసపోయామని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలుపోలీసులకు పిర్యాదు చేసింది. పోలీసులు ప్రకాష్ కోసం గాలిస్తున్నారు.
టీవీకే కార్యకర్తపై కేసు
వేలూరు: తిరుపత్తూరు సమీపంలో మహిళా పోస్టుమాస్టర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీకే కార్యకర్తపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. తిరుపత్తూరు జిల్లా ఒక గ్రామానికి చెందిన 24 సంవత్సరాల యువతి ఆ ప్రాంతంలోని తపాలా కార్యాలయంలో పోస్టుమాస్టర్. ప్రతిరోజూ బైకులో ఇంటి నుంచి తపాలా కార్యాలయానికి వెళ్లి వస్తుంటుంది. తిరుపత్తూరు సమీపంలోని ఆండిఅప్పనూరు గ్రామానికి చెందిన సత్యమూర్తి టివీకే పార్టీ న్యాయవాద విభాగం న్యాయవాదిగా ఉంటున్నాడు. ఇతను మహిళా పోస్టు మాస్టర్‌ను ప్రతిరోజూ లైంగికంగా వేధిస్తున్నట్లు తెలిసింది. యువతి మందలించడంతో ఆమైపె దాడికి యత్నించాడు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సత్యమూర్తిపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ఆయన కోసం గాలిస్తున్నారు.
తిరుచ్చిపై
సిరులతల్లి విహారం
చంద్రగిరి : తిరుచానూరు పద్మావతీదేవి శుక్రవారం బంగారు తిరుచ్చిపై విహరించారు. వారపు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ ముఖమండపం వద్ద కనులపండువడా స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం జరిపించారు. సాయంత్రం అలంకార మండపంలో వేడుకగా ఊంజల్ సేవ చేపట్టారు. అనంతరం అమ్మవారిని తిరుచ్చి వాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు.


