ఖర్చు రూ.40 లక్షలు మించరాదు | - | Sakshi
Sakshi News home page

ఖర్చు రూ.40 లక్షలు మించరాదు

Mar 21 2026 5:18 AM | Updated on Mar 21 2026 5:18 AM

తిరుత్తణి: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులు ఖర్చుగా రూ.40 లక్షలు దాటరాదని తిరుత్తణి నియోజకవర్గ ఖర్చులకు సంబంధించి పరిశీలకులు అధికారులకు అవగాహన కల్పించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా నగలు, నగదు, వస్తువులు పంపిణీకి అడ్డుకట్ట వేసే విధంగా 24 గంటల పాటు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తిరుత్తణి నియోజకవర్గ ఖర్చుల పర్యవేక్షణ పరిశీలకులు రాజేష్‌ త్రిపాఠి శుక్రవారం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణాధికారి కనిమొళితో సమావేశమైయ్యారు. అనంతరం ఎన్నికల నిర్వహణ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. తప్పనిసరిగా తనిఖీలు వీడియో ద్వారా రికార్డు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు ఖర్చులకు సంబంధించి ఎన్నికల సంఘం వస్తువులు, ఆహారం, ప్రచార ఖర్చులకు సంబందించి వివారాలు విడుదల చేసినట్లు అందుకు అనుగుణంగా అభ్యర్ధులు ఖర్చులు పెట్టాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement