నాగలాపురం: మండలంలోని టీటీడీ అనుబంధ శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు శ్రీ వేదవల్లి తాయారుకు ఘనంగా ఉయ్యాలసేవ నిర్వహించారు. ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి, తిరుచ్చిపై అధిష్టింపజేసి ఉయ్యాలసేవ నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు వేకువజామునే సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు చేశారు. అనంతరం వేదవల్లి తాయారుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారి శ్రీనివాసులు, చెంగల్‌రాయులు, ఉదయ్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.


