రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా పండుగ సందడి
మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు
ఇంటిళ్లి పాది ఆనందోత్సాహాల్లో ముస్లిం సోదరులు
పరస్పరం శుభాకాంక్షలు
భక్తిభావంతో..
సాక్షి, చైన్నె : ప్రతి ముస్లిం తన జీవితంలో పాటించాల్సిన నియమ నిబంధనల గురించి అల్లా ఆదేశానుసారం మహ్మద్ ప్రవక్త సూచించి ఉన్న పలు అంశాల గురించి తెలిసిందే. ఇందులో అతి ముఖ్యమైనవి ఐదు పూట్ల నమాజు, రంజాన్ మాసంలో రోజా, జీవితంలో ఒక్క సారైనా హజ్ యాత్ర సాగించడం. ఆ మేరకు రంజాన్ మాసంలో రోజా (ఉప వాస దీక్ష) తప్పని సరిగా ప్రతి ఒక్కరూ అనుసరించడం జరుగుతున్నది. ఈ మాసం పుణ్య కార్యాలకు, సమత మమతలకు నెలవుగా నిలవడమే కాదు, పాప కర్మల నుంచి విముక్తి పొండడానికి ముస్లీంలు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షల్ని నిర్వహించడం జరుగుతోంది. అలాగే శక్తి మేరకు సత్కార్యాలు చేస్తూ ఐదు పూట్ల నమాజుతో ప్రార్థనల్లో లీనం అవుతారు. అలాగే రాత్రుల్లో తరావీ నమాజు, తహజత్ నమాజులతో అల్లా కృపకు పాత్రులు అయ్యేందుకు భక్తితో ప్రార్థనలు చేయడం జరుగుతోంది. ఈ మేరకు గత నెల రోజులుగా పేద, గొప్ప అన్న బేధం లేకుండా అల్లాకు విశ్వాస పాత్రులుగా ఉంటూ ధాన ధర్మాలు, సత్కార్యాలు చేస్తూ వచ్చిన ముస్లింలు శనివారం రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
విందులతో.. ఉత్సాహం
కొన్ని చోట్ల మసీదులలో, మరికొన్ని చోట్ల ఈద్గాలతో ప్రత్యేక ప్రార్ధనలు ముగించుకున్న ముస్లిం సోదరులు పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మతాలకు అతీతంగా వివిధ పార్టీలకు చెందిన వారు సైతం శుభాకాంక్షలు తెలియజేశారు. మధ్యాహ్నం బిర్యాని సిద్ధం చేసి ఇంటిళ్లి పాది స్వీకరించడమే కాకుండా, బంధు మిత్రులకు పంచి పెట్టారు. పేదలకు దానాలు చేశారు. ఇంటిళ్లిపాది పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. మత సామరస్యాన్ని చాటే విధంగా హిందువులు సైతం అనేక చోట్ల ముస్లింలతో కలిసి పండుగను జరుపుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల వేళ కావడంతో రాజకీయ పక్షాల నేతలు సైతం ఈద్గా మైనాదానాలు, మసీదుల వద్దకు తరలి వచ్చి ముస్లీంలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంబూర్‌లో జరిగిన ప్రార్ధనలకు డీఎండీకే కోశాధికారి సుదీష్ పాల్గొని ముస్లింలతో ఆనందాన్ని పంచుకున్నారు.
చిన్న పిల్లల ఆనందం


