తిరువొత్తియూరు: చైన్నె మాధవరంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి అరుణ్, సీఐ ఉమాపతి వాహన తనిఖీలు నిర్వహించారు. మాధవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జీఎన్‌న్‌టీ రోడ్డులో ఓ ప్రైవేట్ కళాశాల సమీపంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఓ కారును తనిఖీ చేశారు. అందులో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న 40 వజ్రాలు ఉన్నట్టు గుర్తించారు. అధికారులు వజ్రాలను స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారి పెరుమాళ్ సమక్షంలో విచారణ జరిపి ప్రభుత్వ ఖజానాకు అప్పగించారు. సరైన పత్రాలు సమర్పించి ఖజానా నుంచి తీసుకోవాలని సూచించారు. ఇదే తరహాలో పాడియనల్లూరు టోల్‌గేట్ సమీపంలో కారులో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.35 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
భూమినాథన్‌కు అవార్డు
సాక్షి, చైన్నె: ఆప్టిమల్ మీడియా సొల్యూషన్స్ ఆధ్వర్యంలో ఈటీ ఎక్సలెన్స్ సమ్మిట్ – తమిళనాడు 2026 ను ఘనంగా నిర్వహించారు. ఇందులో చైన్నెస్ అమృత గ్రూప్ ఆఫ్ ఇన్‌న్‌స్టిట్యూషన్‌న్ చైర్మన్ ఆర్.భూమినాథన్‌కు దక్షిణ భారతదేశంలో ఏవియేషన్ కళాశాల అనే ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. గౌరవ అతిథిగా పాల్గొ న్న నటి, నిర్మాత కలై అరసి రాధికా శరత్‌కుమార్, తమిళనాడు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి (రిటైర్డ్) సబితా ఆనంద్, సెల్వి, నటి అపర్ణా బాలమురళి చేతులమీదుగా భూమినాథన్ అందుకున్నారు.
20 లీటర్ల నీటి క్యాన్‌పై రూ.5 పెంపు
కొరుక్కుపేట: ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ముడి చమురు దిగుమతులు తీవ్రంగా ప్రభావితమయ్యా యి. ఇది పరోక్షంగా వివిధ నిత్యావసర వస్తువుల ధ రల పెరుగుదలకు దారితీసింది. ఈ పరిస్థితుల్లో త మిళనాడులో శుద్ధి చేసిన తాగునీటి క్యాన్‌ల ధర లీటరు కు రూ. 3 పెరిగింది. ఇక 20 లీటర్ల క్యాన్‌పై ధర రూ. 5 పెరిగింది. ముడి పదార్థాల ధరల పెరుగుదల, వి ద్యుత్ ఛార్జీల పెరుగుదల మొదలైన వివిధ కారణాల వల్ల ఈ పెరుగుదల చోటుచేసుకుంది. తాము ఈ ధరల పెంపును అమలు చేస్తున్నట్లు బాటిల్ వాటర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ విషయమై తమిళనాడు బాటిల్ వాటర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ, తాము గత 20 ఏళ్లుగా అన్ని పరిస్థితులను అధిగమించి ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం ముడి పదార్థాల ధరలు పెరిగాయి, ఉద్యోగుల జీతాలు కూడా పెరిగాయి అని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెరగడం వల్ల, తాగునీటి ధరను పెంచాల్సిన అవసరం ఏర్పడిందని వెల్లడించారు.


