తిరుత్తణి: వంద శాతం ఓటింగ్‌ను ప్రేరేపించే విధంగా తిరుత్తణి రైల్వేస్టేషన్‌లో ఓటరు సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. సెల్ఫీ తీసుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్‌కు ఓటర్లను ఆకర్షించే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం పలు అవగాహన కార్యక్రమమాలు నిర్వహిస్తున్నదిస్తోంది. నాటక ప్రదర్శన ద్వారా ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇందులోభాగంగా తిరుత్తణి రైల్వేస్టేషన్ ప్రాంగణంలో శనివారం రెవెన్యూ శాఖ ద్వారా ఓటరు సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. తిరుత్తణి నియోజకవర్గ ఎన్నికల నిర్వహణాధికారి కణిమొళి ఆధ్వర్యంలో సెల్ఫీ పాయింట్ ద్వారా ఓటర్లు ఫొటోలు దిగి వంద శాతం ఓటింగ్‌పై అవగాహన కల్పించారు.


