సాక్షి, చైన్నె: ప్రముఖ ఫ్యాషన్ రిటైల్ బ్రాండ్ ‘మ్యాక్స్ ఫ్యాషన్’ చైన్నె వలసరవాక్కంలో ఏర్పాటైంది. చైన్నె ప్రజలకు సినిమాపై ఉన్న మక్కువను ప్రతిబింబించేలా, ఒక సినిమా ప్రీమియర్ తరహాలో ఈ ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి కాయదు లోహర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి సందడి చేశారు. ఈ స్టోర్ ప్రారంభోత్సవం ఒక సాధారణ రిటైల్ షాప్ ఓపెనింగ్‌లా కాకుండా, ఒక సినిమా వేడుకలా సాగింది. సినిమా పోస్టర్లు, కటౌట్లు, సినిమా టికెట్ల వంటి ఎంట్రీ పాస్‌లు, పాప్‌కార్న్ కౌంటర్లతో థియేటర్ వాతావరణాన్ని తలపించారు.ప్రవేశ మార్గం వద్ద ఆటో రిక్షాలను ఏర్పాటు చేసి చైన్నె నగర నేటివిటీని ప్రదర్శించారు. నటి కాయదు లోహర్ రిబ్బన్ కట్ చేసి స్టోర్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానుల కేరింతలతో వలసరవాక్కం ప్రాంతం హోరెత్తింది. చైన్నె నగరంలో మ్యాక్స్ ఫ్యాషన్‌కు ఇది 34వ స్టోర్ అని పురుషులు, మహిళలు . పిల్లల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటుతో పాటుగా షాపింగ్ చేసేవారికి సులభంగా ఉండేలా అత్యాధునిక డిజైన్‌తో దీనిని నిర్మించామని మ్యాక్స్ ఫ్యాషన్ సీఈఓ సుమిత్ చందన్ ఈసందర్భంగా ప్రకటించారు. ఇక్కడి ప్రజలకు సినిమా అంటే ఉన్న ఇష్టాన్ని గౌరవిస్తూ, ఈ స్టోర్ లాంచ్‌ను ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌లా మార్చాలనుకున్నామన్నారు. ఫ్యాషన్, స్టోరీ టెల్లింగ్‌ను మిక్స్ చేసి కస్టమర్లకు ఒక గుర్తుండిపోయే అనుభూతిని అందించడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. నటి కాయదు లోహర్ మాట్లాడుతూ, శ్రీచైన్నెకి ప్రాణప్రదమైన సినిమా, ఫ్యాషన్ రెండింటినీ కలిపి ఈ వేడుకను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.


