తెలుగుగంగ కాలువలో పడి యువకుడు గల్లంతు | - | Sakshi
Sakshi News home page

తెలుగుగంగ కాలువలో పడి యువకుడు గల్లంతు

Mar 23 2026 8:34 AM | Updated on Mar 23 2026 8:34 AM

బుచ్చినాయుడుకండ్రిగ: ఉబ్బలమడుగు సమీపంలోని తెలుగుగంగ కాలువలో కాలు జారిపడి తమిళనాడు రాష్ట్రానికి చెందిన యువకుడు గల్లంతయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం తిరువట్టూరు టౌన్‌కు చెందిన జీవా (25) ఓ ప్రైవేటు కంపెనీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. 15 మంది స్నేహితులతో కలసి ఆదివారం ఉబ్బలమడుగు జలపాతానికి విహారయాత్రకు వచ్చారు. ఉబ్బలమడుగు జలపాతంలో జీవా స్నేహితులతో పాటు మద్యం సేవించి సమీపంలో ఉన్న తెలుగుగంగ కాలువ వద్దకు వచ్చిన ముగ్గురు స్నేహితులు ఈత కొట్టారు. కాలువలో మద్యం మత్తులో ఈత కొట్టుతున్న ముగ్గురు పైకి రావడానికి ఇబ్బంది పడుతుండగా జీవా వారిని పైకి లాగడానికి ప్రయత్నిస్తుండగా కాలుజారి కాలువలో పడిపోయాడు. దీంతో ఈతరాని జీవా కాలువలోని నీటి ప్రవాహాంలో కొట్టుకు పోయి, మునిగిపోయి, గల్లంతు అయాడు. వెంటనే స్నేహితులు పోలీసు, ఫైర్‌, రెవెన్యూ, ఫారెస్టు అధికారులు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ హరిప్రసాద్‌, సిబ్బందితో కలసి జీవా మృతదేహాం కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement