వీఐటీ చైన్నెలో జాతీయ స్థాయి న్యాయవ్యవస్థ సెమినార్‌ | - | Sakshi
Sakshi News home page

వీఐటీ చైన్నెలో జాతీయ స్థాయి న్యాయవ్యవస్థ సెమినార్‌

Mar 24 2026 7:57 AM | Updated on Mar 24 2026 7:57 AM

కొరుక్కుపేట: వీఐటీ విశ్వవిద్యాలయం, తమిళనాడు లా కాలేజ్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ సంయుక్తంగా న్యాయ రంగం అనే పేరుతో రెండు రోజుల జాతీయ స్థాయి సెమినార్‌ను నిర్వహించాయి. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో న్యాయ రంగం పాత్ర అనే శీర్షికతో జరిగిన ఈ సెమినార్‌కు తమిళనాడు నలుమూలల నుండి వివిధ న్యాయ కళాశాలల నుండి 200 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ సెమినార్‌కు వీఐటీ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్‌ జి.విశ్వనాథన్‌ ముఖ్య అతిథిగా హాజరుకాగా, వీఐటీ ఉపాధ్యక్షుడు జి.వి.సెల్వం స్వాగతం పలికారు.ఈ సెమినార్‌ ముగింపు వేడుక ఆదివారం కళాశాల ప్రాంగణంలో జరిగింది. తమిళనాడు తాత్కాలిక గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథన్‌ ఆర్లేకర్‌ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసి సెమినార్‌లో ఉత్తమ పరిశోధనా పత్రాలను సమర్పించిన విద్యార్థులకు పతకాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేసి మాట్లాడారు. మనం అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధించాలంటే, న్యాయవ్యవస్థ కూడా అభివృద్ధి చెందాలి. కేవలం ఆర్థికాభివృద్ధి మాత్రమే దేశాభివృద్ధిని సూచించదు, అన్ని రంగాలలోనూ అభివృద్ధి జరగాలి. దేశంలోని ప్రతి ఒక్కరికీ న్యాయం అందుబాటులో ఉండేలా మనం నిర్ధారించినప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా మద్రాస్‌ హైకో ర్టు న్యాయమూర్తి కుమారేష్‌ బాబు మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే, ప్రజల ప్రాథమిక హక్కులను తప్పనిసరిగా కల్పించాలి. దేశ అభివృద్ధికి ప్రభుత్వ సహకారమే కాకుండా ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం అని అభిప్రాయపడ్డారు.

గవర్నర్‌ను సత్కరిస్తున్న వీఐటీ చాన్స్‌లర్‌ తదితరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement