యమహా మ్యూజిక్‌ అంబాసిడర్‌గా ఏఆర్‌ రెహమాన్‌ | - | Sakshi
Sakshi News home page

యమహా మ్యూజిక్‌ అంబాసిడర్‌గా ఏఆర్‌ రెహమాన్‌

Mar 24 2026 7:58 AM | Updated on Mar 24 2026 7:58 AM

సాక్షి, చైన్నె : భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన లెజెండరీ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ ప్రతిష్టాత్మక యమహా మ్యూజిక్‌ ఇండియా బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. భారతీయ సంగీత రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు, దేశీయంగా ప్రతిభావంతులైన యువ కళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ భాగస్వామ్యం జరిగింది. యమహా సంస్థ తన శ్రీమేడ్‌ ఇన్‌ ఇండియాశ్రీ చొరవలో భాగంగా భారత్‌లోనే అంతర్జాతీయ స్థాయి సంగీత పరికరాలను తయారు చేస్తోంది. రెహమానన్‌తో ఈ కలయిక ద్వారా దేశవ్యాప్తంగా సంగీత విద్యను మరింత చేరువ చేయాలని నిర్ణయించింది. యమహా మ్యూజిక్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ యమమోటో టకేతోషి మాట్లాడుతూ, భారతదేశపు గొప్ప సంగీత వారసత్వానికి ప్రపంచ గుర్తింపు లభించాలన్నదే మా ఆకాంక్ష. ఏఆర్‌ రెహమానన్‌తో కలిసి తదుపరి తరం సంగీతకారులను మేం ఉత్తేజపరుస్తాం అని తెలిపారు. చైన్నెలోని యమహా తయారీ కేంద్రం ద్వారా నాణ్యమైన పరికరాలను సరసమైన ధరకే అందిస్తున్నామని సేల్స్‌ యూనిట్‌ హెడ్‌ ర్యోజీ మారుయామా పేర్కొన్నారు. ఏఆర్‌ రెహమాన్‌మాట్లాడుతూ, సంగీత పరికరాల రంగంలో యమహా అంటే నమ్మకానికి మరో పేరుగా పేర్కొన్నారు. తన స్వచ్ఛంద సంస్థలైన కేఎం మ్యూజిక్‌ కన్సర్వేటరీ, సనన్‌షైన్‌ ఆర్కెస్రా ద్వారా శిక్షణ పొందుతున్న ఎందరో యువ కళాకారులకు యమహా పరికరాలు ఇప్పటికే ఎంతో ఉపయోగపడుతున్నాయని వివరించారు. మేడ్‌ ఇన్‌ ఇండియా పద్ధతిలో నాణ్యమైన పరికరాలు అందుబాటులోకి రావడం భారతీయ సంగీతకారులు ప్రపంచ వేదికపై రాణించడానికి దోహదపడుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement