త్వరలో తెరపైకి ‘కాన్‌ సిటీ’ | - | Sakshi
Sakshi News home page

త్వరలో తెరపైకి ‘కాన్‌ సిటీ’

Mar 25 2026 7:20 AM | Updated on Mar 25 2026 7:20 AM

తమిళసినిమా: నటుడు అర్జున్‌ దాస్‌, మలయాళ నటి అన్నా బెన్‌ జంటగా నటించిన తాజా చిత్రం కాన్‌ సిటీ. నటుడు యోగిబాబు, నటి వడివుక్కరసి, బాలనటుడు అఖిలన్‌ తదితరు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని పవర్‌ హౌస్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం ద్వారా హరీష్‌ దొరై రాజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్‌, , టైటిల్‌ ను విడుదల చేయగా ప్రేక్షకుల్లో మంచి స్పందన తెచ్చుకున్నాయి. త్వరలో చిత్రం తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్‌ వర్గాలు పేర్కొంటూ ఇది సరికొత్త కదా కూడిన ఫ్యామిలీ ఎంటర్‌ కథాచిత్రంగా ఉంటుందన్నారు. నగర జీవితంలో అప్పుల్లో చిక్కుకున్న ఒక కుటుంబం ఇతివత్తమే ఈ చిత్రం అని పేర్కొన్నారు. అలాంటి కుటుంబానికి ఒక నోట్ల ముద్రణ మిషన్‌ లభిస్తే జరిగే పరిణామాలు ఏమిటన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కాన్‌ సిటీ సాగుతుందన్నారు. విచిత్రమైన ఊహలు, కుటుంబ అనుబంధాలు, వినోదం ,ఉచ్చుకత ,వంటి అంచనాతో అనూహ్య సంఘటన మయంగా రూపొందించిన ఈ చిత్ర డిజిటల్‌ హక్కులను నెట్‌ ఫ్లిక్స్‌ సంస్థ పొందినట్లు తెలిపారు. చిత్రం విడుదలకు ముందే ఓటిటీ హక్కులు విక్రయణ జరగడంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్రానికి శాన్‌ లోల్డన్‌ సంగీతాన్ని, అరవింద్‌ విశ్వనాథన్‌ ఛాయాగ్రహణం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement