దీపావళిపై కన్నేసిన ‘మార్షల్‌’ | - | Sakshi
Sakshi News home page

దీపావళిపై కన్నేసిన ‘మార్షల్‌’

Mar 25 2026 7:20 AM | Updated on Mar 25 2026 7:20 AM

నేనూ దుల్కర్‌ సల్మాన్‌ క్లాస్‌మేట్స్‌

తమిళసినిమా: నటుడు కార్తీ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రాలలో మార్షల్‌ ఒకటి. ఇంతకుముందు టాణాకారన్‌ వంటి హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన నటుడు తమిళ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నటి కల్యాణి ప్రియదర్శన్‌ నాయకిగా నటిస్తున్నారు. కార్తీ, కళ్యాణి ప్రియదర్శన్‌ కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇది. దీన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నటుడు సత్యరాజ్‌ ,ప్రభు, లాల్‌ ,ఈశ్వరి రావ్‌ ,జాన్‌ కొక్కెన్‌ తదితరులు ముఖ్యపాత్రులు పోషిస్తున్న ఈ చిత్రానికి సాయ్‌ అభయంకర్‌ సంగీతం అందిస్తున్నారు. ఇది 1960 వ సంవత్సరంలో రామేశ్వరం ప్రాంతంలో జరిగిన హత్యల నేపథ్యంలో సాగే కథాచిత్రంగా ఉంటుందని యూనిట్‌ వర్గాలు ఇంతకుముందే వెల్లడించిన విషయం తెలిసిందే. చిత్ర షూటింగును రామేశ్వరం ,దురైయూర్‌ తదితర ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసిన ట్లు తాజా సమాచారం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న మార్షల్‌ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇటీవల ఒక వేదికపై దర్శకుడు తమిళ్‌ తెలిపారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

తమిళసినిమా: పాన్‌ ఇండియా కథానాయికల్లో ఒకరు శృతిహాసన్‌. ఈమె నటుడు కమలహాసన్‌ వారసురాలు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథానాయకి, గాయని, సంగీత దర్శకురాలు ఇలా పలు శాఖలో తన ప్రతిభను చాటుకుంటూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్న నటి ఈమె. అంతేకాకుండా చంచలనాలకు నిలయం శృతిహాసన్‌ అనే ముద్ర కూడా వేసుకున్నారీమె. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల్లో జ్యోష్‌ నింపే ఈమె ప్రేమ వ్యవహారం కూడా తెలిసిన పుస్తకమే. కాగా మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరిగా ఉన్నారు. కాగా ఇటీవల ఒక బేటిలో శృతిహాసన్‌ తన పాఠశాల జీవిత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అందులో భాగంగా నటుడు దుల్కర్‌ సల్మాన్‌ గురించి తెలిపారు. దుల్కర్‌ సల్మాన్‌ తాను బాల్యంలో చైన్నెలో ఓకే స్కూల్లో కలిసి చదువుకున్నామని చెప్పారు. రెండు ప్రముఖ పాఠశాలల్లో తమ విద్యాభ్యాసం జరిగిందన్నారు. ఆ సమయంలో తాము తరచూ కలుసుకునేవారుమని చెప్పారు. ఆయన తనను సోంబి అని పిలిచేవాడన్నారు. అప్పట్లో పలువురు సహా విద్యార్థులతో కలిసి తాను సోంబి పాటను పాడిన అనుభవం ఉందన్నారు. ఆ తర్వాతనే తనను దుల్కర్‌ సల్మాన్‌ సోంబి అని పిలిచే వాడిని పేర్కొన్నారు. అతనితో కలిసి చదివిన విద్యార్థులకు తాను కమలహాసన్‌ కూతురు అన్న విషయం మాత్రమే తెలుసు అని, తన పేరు తెలియదని చెప్పారు. కాగా తాజాగా ఈ భామ దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి ఆకాశంలో ఒక తార అనే తెలుగు చిత్రం లో నటించడం విశేషం. ఈ చిత్రం తమిళం, కన్నడం మలయాళం హిందీ భాషల్లో రూపొందు తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement