పుదుచ్చేరి సమరంలో వింతలు | - | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరి సమరంలో వింతలు

Mar 25 2026 7:20 AM | Updated on Mar 25 2026 7:20 AM

ఒకే కుటుంబం..వివిధ పార్టీలు

ప్రత్యర్థులుగా మారిన కుటుంబ సభ్యులు

ఒకే కుటుంబం నుంచి

వివిధ నియోజకవర్గాలలో పోటీ

13 చోట్ల బరిలోకి డీఎంకే అభ్యర్థులు

సాక్షి, చైన్నె: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల సమరంలో ఆసక్తికర, విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు వేర్వేరు పార్టీల తరపున, కొన్ని చోట్ల ఒకరిపై మరొ రు పోటీకి దిగడం హాట్‌ టాపిక్‌గా మారింది. వివరాలు.. పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ సోమవారం ముగియడంతో మంగళ, బుధవారం పరిశీలన చేపట్టనున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో సోదరులు, మామ–అల్లుళ్లు, మేనల్లుళ్లు ప్రత్యర్థులుగా మారడం విశేషం.

ఒకే నియోజకవర్గంలో కుటుంబ సభ్యుల పోటీ

మొదలియార్‌పేట నియోజకవర్గంలో ఎన్‌డీఏ కూటమిలో బీజేపీ తరపున మంత్రి ఓం కుమార్‌ నామినేషన్‌ వేయగా, ఇదేనియోజకవర్గంలో ఆయన కుటుంబానికి చెందిన జస్టిన్‌ , జోస్‌ చార్లెస్‌లు సైతం పోటీలో ఉండటం రసవత్తరంగా మారింది. ఇక లాజ్‌ పేటలో కాంగ్రెస్‌ తరపున శివ కొలుందు పోటీ చేస్తుండగా, ఆయన సోదరుడు వి.పి. రామలింగం రాజ్‌భవన్‌ నియోజకవర్గం నుండి జనతా పార్టీ తరపున బరిలో ఉన్నారు. అంగలం నియో జకవర్గం ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సాయి జె శరవణన కుమార్‌, ఆయన అల్లుడు, మంత్రి నమశ్శివాయం తిరుభువనై నియోజకవర్గంలో బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యే అంగాలన్‌ డీఎంకే తరపున ఇక్కడ పోటీ చేస్తుండగా, బీజేపీని వీడి టీవీకేలో చేరిన మాజీ మంత్రి జే సాయి శరవణ కుమార్‌ సైతం పోటీలో ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. ఉరులయ పేట నియోజకవర్గంలో ఎల్‌కే నెహ్రూ టీవీకే మద్దుతో నామినేషన్‌ వేయగా, ఆయన మేనల్లుడు వినాగం తట్టం చావడి లో నామినేషన్‌ దాఖలు చేశారు. సీఎం రంగస్వామి మంగళం,తట్టంచవాడి నియోజకవర్గాల నుండి పోటీ చేస్తుండగా, రూ. 537 కోట్లతో కోటీశ్వరుడి జాబితాలో ఉన్న లక్ష్య జననాయగ కట్చి నేత జోస్‌చార్లెస్‌ మార్టిన్‌ కామరాజనగర్‌, నెల్లితోపు స్థానాల నుండి పోటీకి దిగారు. మాజీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి సత్యమూర్తి మంగళం, బాగూర్‌ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు.

డీఎంకే అభ్యర్థుల ఖరారు–జాబితా విడుదల

కాంగ్రెస్‌తో సుదీర్ఘ చర్చల తర్వాత డీఎంకే తన వాటాలోని 14 సీట్లలో 13 మంది అభ్యర్థులను ప్రకటించింది.ఇందులో ఒక సీటు వీసీకేకు కేటాయించింది. డీఎంకే అభ్యర్థులు అభ్యర్థులుగా విల్లియనూర్‌ నియోజకవర్గం –శివ, ఉప్పళం –అనీబాల్‌ కెన్నెడీ, మొదలియార్‌పేట – సంపత్‌, కారైకాల్‌ సౌత్‌ నజీమ్‌ పోటీ చేస్తున్నారు. మంగళం నియోజకవర్గంలో సీఎం రంగస్వామిని ఢీకొట్టేందుకు డీఎంకే ఎస్‌.ఎస్‌. రంగన్‌ను బరిలోకి దించింది. కాగా కాంగ్రెస్‌ 16 చోట్ల పోటీ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement