
విస్తా ఇమేజింగ్ డయాగ్నొస్టిక్ సెంటర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే దానం
బంజారాహిల్స్ (హైదరాబాద్): కేన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సలహాదారు, ప్రముఖ కేన్సర్ వ్యాధి నిపుణుడు నోరీ దత్తాత్రేయుడు తెలిపారు. ఆదివారం ఫిలింనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన విస్తా ఇమేజ్ సూపర్ స్పెషాలిటీ డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభమైంది.
ఈ సెంటర్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు.. నోరి దత్తాత్రేయుడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ప్రారంభించారు. మదర్స్ డే సందర్భంగా స్పెషల్ కూపన్‌ను ఆయన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment