జలపాతం వద్ద కలెక్టర్‌ సిక్తా సందడి.. | Collector Sikta Patnaik Family Visited Kuntala Falls | Sakshi
Sakshi News home page

జలపాతం వద్ద కలెక్టర్‌ కుటుంబ సభ్యులు 

Published Sun, Aug 2 2020 12:17 PM | Last Updated on Sun, Aug 2 2020 12:38 PM

Collector Sikta Patnaik Family Visited Kuntala Falls - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: కుంటాల జలపాతాన్ని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ కుటుంబం శనివారం సందర్శించింది. జలపాతానికి వెళ్లే మార్గంలో ఉన్న మెట్ల ద్వారా జలపాతం జలధారల వద్దకు చేరుకొని అక్కడి అందాలను తిలకించారు. కుటుంబ సభ్యులతో చేరుకున్న కలెక్టర్‌ సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ ఆహ్లాద వాతావరణాన్ని ఆస్వాదించారు. ఇటీవల కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టగా జలపాతానికి వచ్చారు. గైడ్‌ పుట్ట సోమన్న కలెక్టర్‌తో ఆమె కుటుంబ సభ్యులకు జలపాతం విషయాలను వివరించారు. జలపాతం  అభివృద్ధిపై అటవీ శాఖాధికారులు కలెక్టర్‌కు విన్నవించారు. ఆమె వెంట తహసీల్దార్‌ శ్రీదేవి, ఆర్‌ఐ మీరాబాయి, ఎఫ్‌ఎస్‌ఓ వసంత్‌రావు, ఎఫ్‌బీఓ రాధాకృష్ణ ఉన్నారు. 


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement