adilabad collector
-
ఆదిలాబాద్: గర్భిణి మృతిపై కలెక్టర్ సీరియస్
నార్నూర్ (గాదిగూడ): సకాలంలో వైద్యం అందక ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కునికాసా కొలాంగూడ గ్రామానికి చెందిన గర్భిణి కొడప రాజుబాయి (22) మృతిచెందిన ఘటనపై కలెక్టర్ సిక్తా పాట్నాక్, ఐటీడీఏ పీవో భవేశ్‌మిశ్రా సీరియస్ అయ్యారు. గర్భిణి మృతిపై విచారణ జరిపి నివేదిక అందించాలని డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్‌ను సోమవారం ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏజెన్సీ అదనపు వైద్యాధికారి డాక్టర్ మనోహర్ అధికారులతో కలిసి కునికాసా కొలాంగూడ గ్రామానికి వెళ్లారు. దాదాపు మూడు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించారు. గ్రామ శివారులోని వాగును మోకాళ్ల లోతు నీటిలో నడుచుకుంటూ దాటారు. తర్వాత గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబంతో మాట్లాడారు. రాజుబాయి మృతికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. గాదిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందిఉంటే తమ కూతురు బతికేదని రాజుబాయి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో వైద్యం అందకనే గర్భిణి మృతిచెందిందని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అదనపు వైద్యాధికారి మాట్లాడుతూ ఆరోగ్యం విషయంలో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తప్పే అన్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని పేర్కొన్నారు. -
జలపాతం వద్ద కలెక్టర్ సిక్తా సందడి..
సాక్షి, ఆదిలాబాద్: కుంటాల జలపాతాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కుటుంబం శనివారం సందర్శించింది. జలపాతానికి వెళ్లే మార్గంలో ఉన్న మెట్ల ద్వారా జలపాతం జలధారల వద్దకు చేరుకొని అక్కడి అందాలను తిలకించారు. కుటుంబ సభ్యులతో చేరుకున్న కలెక్టర్ సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ ఆహ్లాద వాతావరణాన్ని ఆస్వాదించారు. ఇటీవల కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టగా జలపాతానికి వచ్చారు. గైడ్ పుట్ట సోమన్న కలెక్టర్‌తో ఆమె కుటుంబ సభ్యులకు జలపాతం విషయాలను వివరించారు. జలపాతం అభివృద్ధిపై అటవీ శాఖాధికారులు కలెక్టర్‌కు విన్నవించారు. ఆమె వెంట తహసీల్దార్ శ్రీదేవి, ఆర్ఐ మీరాబాయి, ఎఫ్ఎస్ఓ వసంత్‌రావు, ఎఫ్బీఓ రాధాకృష్ణ ఉన్నారు. -
నాన్న..ఇంకెంత దూరం!
కరోనా వలస జీవులకు ఎక్కడ లేని కష్టాలు తెచ్చిపెట్టింది. జేబులో చిల్లిగవ్వ లేక..ఎక్కడ ఉండాలో తెలియక భార్యాబిడ్డలతో బిక్కుబిక్కు మంటూ నడక సాగిస్తున్నారు వలస కూలీలు. హైదరాబాద్ నుంచి చత్తీస్‌ఘడ్‌కు కాలినడక వెళ్తూ ఆదిలాబాద్ దేవాపూర్ చెక్‌పోస్ట్ వద్ద తన కూతురుని అక్కున చేర్చుకుని సేద తీరుతున్న చిత్రమిది. (ఆనంద్‌ను మిస్ అవుతోన్న తమన్నా ) – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ ఇతర రాష్ట్రాల వారిని అనుమతించం సాక్షి, ఆదిలాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం మే 7 వరకు లాక్డౌన్ పొడిగించినందున ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని జిల్లాకు తీసుకురావడానికి అనుమతించమని కలెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. లాక్డౌన్ పూర్తయిన వెంటనే తీసుకురావచ్చని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఫోన్ చేసి సమస్యలు తెలపగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వివిధ సమస్యలపై 13 కాల్స్ వచ్చాయి.(జనతాబజార్లలో ఆక్వా ఉత్పత్తులు: సీఎం జగన్) ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్నందున ఎక్కడివారు అక్కడే ఉండాలన్నారు. పట్టణంలోని శాంతినగర్, దస్నాపూర్, పిట్టలవాడ, టీచర్స్‌కాలనీ, బేల, బజార్హత్నూర్ మండలాల్లో బియ్యం, నగదు అందలేదని కొందరు తెలపగా, ఏప్రిల్ నెల బియ్యం పంపించామని, ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని నిలిపివేసిందని, వచ్చే నెలలో తిరిగి చెల్లిస్తామన్నారు. బ్యాంకు ఖాతాల్లో నగదు జమకాని వారు పోస్టల్ కరస్పాండెంట్‌ను సంప్రదించాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్వో నటరాజ్, ఎల్డీఎం చంద్రశేఖర్, డీఎఫ్‌వో ప్రభాకర్, అధికారులు పాల్గొన్నారు. (క్షిణించిన కిమ్ ఆరోగ్యం.. కొరియాకు చైనా వైద్యులు ) -
కలెక్టర్ శ్రీదేవసేనకు అరుదైన గౌరవం
సాక్షి, ఆదిలాబాద్: జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనకు అరుదైన గౌరవం లభించింది. ఇప్పటివరకు నాలుగు జాతీయ స్థాయి అవార్డులు ఆమె సొంతం చేసుకున్నారు. మరోసారి సీఎంఓ వరల్డ్ సంస్థ ద్వారా ‘ద వరల్డ్ ఉమేన్ లీడర్షిప్’ అవార్డును మంగళవారం ముంబైలో ఆ సంస్థ నిర్వాహకుల చేతుల మీదుగా అందుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ఇంకుడుగుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మహిళలకు శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ, పల్లెప్రగతి, గ్రామాల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలకు ఈ అవార్డు దక్కింది. పెద్దపల్లి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించినందుకు మహిళ కలెక్టర్ల విభాగంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2018 సంవత్సరంలో పెద్దపల్లి జిల్లాలో 271 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం హైరిస్క్ డెంగీ జిల్లాగా ప్రకటించింది. ఉపాధిహామీ కింద ఉచితంగా ఇంకుడు గుంతలను నిర్మించడంతో దోమల నివారణ, వృథా నీరు పోకుండా భూగర్భజలాలు పెంపొందించేందుకు దోహదపడ్డాయని కలెక్టర్ తెలిపారు. కాగా 2019లో 85 శాతం కేసులు తగ్గాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లాను ఆదర్శంగా తీసుకోవాలని ప్రకటించినట్లు పేర్కొన్నారు. దేశంలోనే స్వచ్ఛత జిల్లాగా ప్రకటించారని గుర్తు చేశారు. కాగా అప్పట్లో ప్రధాని మోడీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛభారత్, స్వచ్ఛదర్పణ్ పథకాల కింద నాలుగు జాతీయ అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. అందరి సహకారంతో స్వచ్ఛతలో జిల్లాను ముందుంచుతానన్నారు. -
కుటుంబసమేతంగా జోడేఘాట్‌కు కలెక్టర్
కెరమెరి(ఆసిఫాబాద్): కుమురం భీం మ్యూజియం ఓ అద్భుతమని..గిరిజన సంప్రదాయాలు, సంస్కతికి ప్రతీకగా నిలుస్తోందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. గురువారం చారిత్రక ప్రదేశమైన కెరిమెరి మండలం జోడేఘాట్‌లో ఏర్పాటు చేసిన కుమురం భీం మ్యూజియాన్ని కలెక్టర్ కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. విద్యార్థులు, గ్రామస్తులు వారికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. భీం సమాధిపై పూలు చల్లారు. వారికి మ్యూజియం క్యూరేటర్ మంగం విశ్వంభర్‌రావు భీం చరిత్రతో పాటు అన్ని విషయాలపై అవగాహన కల్పించారు. మ్యూజియంలో ఏర్పాటు చేసిన హైమన్‌డార్ఫ్ చిత్రమాలిక, ఆదివాసీల ఫొటో ఫ్రేంలు పరిశీలించారు. స్మృతిచిహ్నం, మనిషి ఆకృతిలో ఉన్న బొటానికల్ గార్డెన్, ఆదివాసీ ఆభరణాలు, పర్దాన్, తోటి, గోండు, నాయకపోడ్, తదితర కులాలకు చెందిన దేవతా ప్రతిమలను తిలకించారు. అనంతరం గుస్సాడీల నృత్యాలు, తన సహచరులతో మాట్లాడుతున్నట్లు ఉన్న భీం ప్రతిమలను చూసి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మ్యూజియానికి వివిధ మండలాలకు చెందిన ఆదివాసీలు వస్తారని.. మీరు కూడా వచ్చి సమస్యలు తెలుపవచ్చని స్థానికులకు సూచించారు. వారి వెంట తహసీల్దార్ ప్రమోద్ కుమార్, ఏటీడీవో భాస్కర్, ఎంపీపీ పెందోర్ మోతిరాం, జెడ్పీటీసీ సెడ్మకి దుర్పతబాయి, నాయకులు పెందోర్ రాజేశ్వర్, మోహన్‌రావు, కోవ విజయ్, మడావి రఘు తదితరులు ఉన్నారు. -
వంద శాతం పోలింగ్ నమోదే లక్ష్యం
ఆదిలాబాద్‌టౌన్: ఈ నెల 7న జరిగే శాసనసభ ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ నమోదే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ను ప్రశాంత వాతావరణంలో జరిపేలా డిజిటలైజేషన్ సర్వేలైన్ ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఓటర్లందరూ తమ ఓటు హక్కును సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ‘ఓట్ ఫర్ ఆదిలా బాద్’ యాప్ ద్వారా పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంది, ఎలా వెళ్లాలి, ఎంత దూరంలో ఉందనే విషయాలను తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. చిన్నపిల్లలు ఉన్న మహిళల కోసం 25 మోడల్ ఫీడింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో జేసీ సంధ్యారాణి, జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్, అసిస్టెంట్ కలెక్టర్ గోపి, సహాయ కలెక్టర్ ప్రతీక్‌జైన్, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేక సౌకర్యాలు.. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో మొత్తం 6,837 మంది వికలాంగులు ఉన్నారని తెలిపారు. వీరిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు 435 ఆటోలు ఉంటాయని, సహాయకులుగా ఐకేపీ సిబ్బందిని నియమించామని అన్నారు. నడవలేని వారికి 383 వీల్చైర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లోని మహాలక్ష్మివాడ పాఠశాల, బోథ్ నియోజకవర్గంలోని గేర్జం పాఠశాలలను ఆదర్శ పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వికలాంగుల పరిష్కారం కోసం స హాయ కేంద్రం 08732–220169పై సంప్రదించాలని సూచించారు. మద్యం షాపుల బంద్.. ఎన్నికల నేపథ్యంలో బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 7న సాయంత్రం 5గంటల వరకు మద్యం దుకాణాల మూసివేసి ఉంచాలని ఎక్సైజ్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మద్యం, డబ్బు పంపిణీ చేస్తే సివిజిల్ యాప్ సహకారంతో సమాచారం అందించాలన్నారు. ఇప్పటివరకు సి–విజిల్ 183 ఫిర్యాదులు రాగా, ఇందులో 163 ఫిర్యాదులపై చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం 5గంటల వరకు ముగించాల్సి ఉంటుందన్నారు. రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లను వాహనాల్లో పోలింగ్ కేంద్రాల్లో తరలించవద్దని, నిబంధనలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. భారీ పోలీసు బందోబస్తు : జిల్లా ఎస్పీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పోలీసు బందోబస్తు చేపడుతున్నట్లు జిల్లా ఎ స్పీ విష్ణు ఎస్.వారియర్ అన్నారు. ఇద్దరు అడిషన ల్ ఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 20 మంది సీఐ లు, 25 మంది ఎస్సైలు, 550 సివిల్ ఫోర్స్, 200 మంది ఏఆర్ ఫోర్స్‌తోపాటు నాలుగు కంపెనీలకు చెందిన 400 మంది, ఏపీఎస్పీకి సంబంధించి 200 మంది, ఆదిలాబాద్‌కు చెందిన 165 మంది హోంగార్డులు, యావత్మాల్కు చెందిన 400 మం ది హోంగార్డులు ఎన్నికల విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. ఇప్పటివరకు 348 బైండోవర్ కేసులు నమోదు చేశామని, 17 లైసెన్స్ గల పిస్టోళ్లను స్వా« దీనం చేసుకున్నట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాల్లో 130 సమస్యాత్మక కేంద్రాలను గుర్తిం చామని, పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎన్నికల రోజు సెలవు.. ఎన్నికల సందర్భంగా సెలవు ప్రకటించామని కలెక్టర్ దివ్యదేవరాజన్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, బ్యాంకులకు 6, 7 తేదీ ల్లో సెలవు ప్రకటించామని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థలు 7న సెలవు ఇవ్వాలని ఆదేశించారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎగ్జిట్ పోల్ నిర్వహించవద్దని, ఇతర జిల్లాల వ్యక్తులు 48గంటల పాటు జిల్లాలో ఉండరాదని అన్నారు. సమస్యలు ఉంటే 1800 425 1939 టోల్ఫ్రీపై సమాచారం ఇవ్వాలని కోరారు. -
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
నిర్మల్‌టౌన్: ఈ నెల 7న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో సెక్టోరల్ అధికారులు తమ విధులు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంతి అన్నారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో ఆదివారం రాత్రి ఎన్నికల ఏర్పాట్లపై సెక్టోరల్, పోలీసు అధికారులతో సమీక్షించారు. ఎన్నికల్లో సెక్టోరల్ అధికారులు కీలక భూమిక పోషించాలన్నారు. ఈవీఎం మిషన్లు పనిచేయకపోతే వెంటనే రిప్లేస్ చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులైన తాగునీరు, విద్యుత్, లైట్లు, ఫ్యాన్స్, టాయ్‌లెట్స్, కుర్చీలు, బెంచీలు తదితర వాటిని ముందుగానే పరిశీలించాలన్నారు. ఎన్నికల సందర్భంగా గంట గంటకు సమాచారం ఇవ్వాలన్నారు. గర్భిణులు క్యూలో నిలబడకుండా వారు నేరుగా ఓటింగ్‌కు వెళ్లేలా చూడాలన్నారు. ప్రతీ సెక్టోరల్ అధికారి వద్ద వీవీ ప్యాట్–2, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతీ పోలింగ్ స్టేషన్లో పోలింగ్ రోజు బూత్ లెవల్ అధికారి అందుబాటులో ఉండాలన్నారు. ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, ప్రథమ చికిత్స బాక్స్‌తో ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో టెంట్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఓటింగ్ అసిస్టెంట్ నియమించాలన్నారు. వీల్ చైర్స్ ఉండేలా చూడాలన్నారు. ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు చేపట్టాల్సిన ఏర్పాట్లు, సెక్టార్ అధికారుల విధులు తదితర విషయాలను వివరించారు. మరిన్ని ఎన్నికల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి పోలింగ్ రోజు కేంద్రాల్లో సెల్‌ఫోన్ అనుమతి లేదన్నారు. పోలింగ్ రోజు ఓటింగ్ కోసం వెళ్లే ఓటర్లకు, అధికారులకు, సిబ్బందికి, ఏజెంట్లకు ఎవరికి కూడా సెల్‌ఫోన్ తీసుకెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ శశిధర్‌రాజు, జేసీ భాస్కర్‌రావు, ఏఎస్పీ దక్షిణమూర్తి, ఆర్డీవో, ఆర్వోలు ప్రసూనాంబ, రాజు, వినోద్‌కుమార్, డీఎస్పీలు ఉపేందర్‌రెడ్డి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులపై దృష్టి
మంచిర్యాలటౌన్: డిసెంబర్ 7వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మరో పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అభ్యర్థులు వారి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రజలకు ఏమి చేస్తారనే దానిపై ఇంటింటా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా చర్యలను చేపట్టింది. ప్రతి ఉద్యోగి ఓటుహక్కు వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ అధికారులు పోస్టల్ బ్యాలెట్‌పై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఉద్యోగుల ఓట్లు సైతం తమకు అనుకూలంగా పడేందుకు అన్ని రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ మేనిఫెస్టోల్లో వారికి అనుకూల తాయిలాలు ప్రకటించి, ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు 3,896 మంది ఉండగా, ఇతర ఉద్యోగస్తులు మరో 2,600 మంది వరకు ఉన్నారు. ఇందులో టీచర్లు, ఎన్జీవోలు, పంచాయతీరాజ్ ఉద్యోగులు, రెవెన్యూ, పోలీసులు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్). దీనిని రద్దు చేయాలంటూ ఉద్యోగులు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇందుకు అన్ని ప్రధాన పార్టీలు సానుకూలంగా స్పందించాయి. అలాగే పీఆర్సీ, మధ్యంతర భృతిపై కూడా ఉద్యోగులు ఆశతో ఉన్నారు. ఉపాధ్యాయులైతే ఉమ్మడి సర్వీసు రూల్స్ రావడం లేదని అంటుండగా, ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తాము కోరుతున్న డిమాండ్లకు అనుకూలంగానే మేనిఫెస్టోలను ప్రకటించాలని ఆయా ఉద్యోగ సంఘాలు ప్రధాన పార్టీలను కోరుతున్నా, ఇప్పటికీ అధికారికంగా ఏ పార్టీ పూర్తిస్థాయిలో వారి మేనిఫెస్టోలను ప్రకటించలేదు. అన్ని పార్టీలు అనుకూలమే.. ఉద్యోగుల సమస్యలు, వారి డిమాండ్లను నెరవేర్చేందుకు అన్ని ప్రధాన పార్టీలు అనుకూలంగా ఉన్నట్లుగానే ప్రకటిస్తున్నాయి. రిటైర్మెంట్ వయస్సు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని, మంచి పీఆర్సీ, మధ్యంతర భృతి ఇస్తామని, సీపీఎస్‌ను రద్దు చేసేందుకు సానుకూల నిర్ణయం తీసుకుంటామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు బహిరంగ సభల్లో, ఉద్యోగ సంఘాల నాయకులు కలిసినప్పుడు ప్రకటిస్తున్నారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ అధినేతలు సైతం సీపీఎస్ రద్దుతో పాటు రిటైర్మెంట్ వయస్సును పెంచుతామని ప్రకటనలు చేస్తున్నారు. ఇందులో ఉద్యోగులు ఏ పార్టీని నమ్ముతారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ఉద్యోగుల డిమాండ్లను పరిష్కారిస్తామని ప్రకటిస్తే, ఉద్యోగులు అటువైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోస్టల్ బ్యాలెట్‌కు 30 వరకు అవకాశం ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఓటు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్లను అధికారులు అందిస్తున్నారు. జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు 3,896 మంది ఉండగా, వీరికి ఎన్నికల ఉత్తర్వులతో పాటు పోస్టల్ బ్యాలెట్ పొందేందుకు ఫారం 12లను అందించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం కలెక్టరేట్‌కు 1,449 మంది ఫారం 12లను అందించారు. ఇంకా ఆయా నియోజకవర్గాల్లోని రిటర్నింగ్ అధికారులకు మరో 409 మంది ఉద్యోగులు ఫారం 12లను అందించారు. మిగిలిన వారు ఈ నెల 30వ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులను తీసుకోనున్నారు. ఎన్నికల విధుల్లో లేని ఉద్యోగులతో పాటు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే ఉద్యోగులపై అన్ని పార్టీల నేతలు దృష్టి సారించారు. ప్రతీ ఉద్యోగి ఓటుహక్కును వినియోగించుకునేందుకు కలెక్టర్ భారతి హోళీకేరి ప్రత్యేక చర్యలు చేపట్టారు. -
ఏర్పాట్లు ముమ్మరం
భైంసా(ముథోల్): అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలు పక్కాగా అమలు పరుస్తున్నారు. ఈమేరకు జిల్లా ఎన్నికల అధికారి సంబంధిత అధికారులు, సిబ్బందితో ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. నామినేషన్ల ఘట్టం పూర్తయి ప్రస్తుతం ప్రచారపర్వం ఊపందుకుంది. ప్రత్యేక బృందాలు అభ్యర్థుల ప్రచారం, ఖర్చులపై నిఘా పెంచాయి. పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తయ్యేదాకా అధికారులు, సిబ్బందే కీలకం. ఇప్పటికే వారంతా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. కీలకమైన రెవెన్యూ.. ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ అధికారులదే ప్రధాన పాత్ర. నియోజకవర్గస్థాయిలో ఆర్డీవో ఎ న్నికల రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆయా శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఎన్నికల సంఘానికి జవాబుదారీగా ఈయనే ఉంటారు. రాష్ట్రంలో అసెంబ్లీ రద్దుకుముందే పనులు ప్రారంభించారు. ఓటరు నమోదు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వసతుల కల్పన, స్క్వాడ్ల ఏర్పాటు, ఎన్నికల నియ మావళి ఈ అధికారులే అమలు చేస్తున్నారు. తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, బీఎల్ఓలు వారికి కేటాయించిన విధులు నిర్వహిస్తున్నారు. ఆర్ఓ నేతృత్వంలోని నాలుగు బృందాలు విధిగా పని చేస్తున్నాయి. పోలింగ్‌కు వారం ముందే ఓటర్లకు పోల్చీటీలు అందించాలని వీరు నిర్ణయించారు. దృష్టి సారించిన పోలీసులు.. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శశిధర్‌రాజు వెల్లడించారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి నిఘా పెంచారు. ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటున్నారు. చాలా గ్రామాల్లో గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మద్యం, డబ్బు రవాణాను అడ్డుకుంటున్నారు. రాజకీయ సభలు నిర్వహించే ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. టెక్నాలజీ వినియోగం... ఈ ఎన్నికల్లో టెక్నాలజీ వినియోగం పెరిగింది. ఎన్నికల అధికారి కార్యాలయంలో ప్రత్యేకంగా ఐటీ విభాగం ఏర్పాటు చేశారు. నిపుణుల బృందం టెక్నాలజీ వినియోగంపై దృష్టి సారించింది. ఎన్నికల సంఘం సువిధ, సీవిజిల్, సమాధాన్ యాప్‌లను వినియోగిస్తున్నారు. పోటీచేసే అభ్యర్థుల నామినేషన్‌తో పాటు అన్ని వివరాలను ఆన్లైన్లో అనుసంధానం చేస్తున్నారు. ఎన్నికల రోజు వెబ్‌కాస్టింగ్ పర్యవేక్షించడం, కౌంటింగ్ వివరాలు ఎన్నికల సంఘానికి చేరవేసే వరకు ఐటీ విభాగమే కీలకం కానుంది. ఒక్కో నియోజకవర్గంలో ఇందుకు సంబంధించి 20 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు... ఎన్నికలు అంటేనే అందరికి మద్యం గుర్తుకువస్తుంది. ఈ క్రమంలో అక్రమ మద్యం విక్రయాలు అరికట్టేందుకు ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే బెల్టుషాపులు మూసి వేయించారు. విక్రయాలపై నియంత్రణ విధించారు. మద్యం దుకాణాల నిర్వాహకులకు సంబంధించి నిబంధనలకు అనుగుణంగా ఆదేశాలు జారీచేశారు. ఎక్సైజ్ బృందాలు అనుమానిత ప్రాంతాల్లో సోదాలు కూడా చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలోనే కౌంటింగ్... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండేవి. అప్పట్లో ఎన్నికల కౌంటింగ్ ఆదిలాబాద్‌లోనే జరిగేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త జిల్లాలు సైతం ఏర్పాటయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ నాలుగు జిల్లాలైంది. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలైన నిర్మల్, ముథోల్, ఖానాపూర్ కౌంటింగ్‌ను జిల్లాకేంద్రంలోనే చేపట్టనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధ్యాయుల పాత్ర... ఎన్నికలు సమగ్రంగా నిర్వహించేందుకు ప్రతి సారి ఉపాధ్యాయులనే అధిక సంఖ్యలో తీసు కుంటారు. పోలింగ్ అధికారి, ఏపీఓ ఇలా ఎం దులోనైనా ఉపాధ్యాయులే ఎక్కువగా కనిపిస్తారు. ఎన్నికల విధులకు సంబంధించిన ఉ ద్యోగుల జాబితాను విద్యాశాఖ రూపొంది స్తుంది. త్వరలోనే వీరికి ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈవీఎంలు, వీవీప్యాడ్లపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్యసేవల్లో ఏఎన్ఎంలు... పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలకు వెళ్లే అధికారులు, సిబ్బంది అనారోగ్యానికి గురైతే సేవలు అందించేందుకు ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచారు. వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే ఆశకార్యకర్తలు, ఏఎన్ఎంలకు ఆదేశాలు జారీచేసింది. ఆయా కేంద్రాల వద్ద ఈ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించింది. పోలింగ్ రోజున ఓటర్లు, సిబ్బంది అనారోగ్యానికి గురైతే ప్రాథమిక చికిత్స అందించనున్నారు. ఈ కేంద్రాల వద్ద అవసరమయ్యే మందులు కూడా అందుబాటులో ఉంచనున్నారు. గ్రామ అధికారులే... నిర్మల్ జిల్లావ్యాప్తంగా గ్రామాలే అధికంగా ఉన్నాయి. అన్ని గ్రామాల్లోనూ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ తదితర వసతుల కల్పనను గ్రామస్థాయి అధికారులే పర్యవేక్షిస్తున్నారు. ఆరు పోలింగ్ కేంద్రాలకు కలిపి ఒక సెక్టోరియల్ అధికారిని నియమించారు. ఆయా కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలపై దృష్టి సారించారు. వీఆర్ఓలు, బీఎల్ఓలు అక్కడి పరిస్థితులను తెలుసుకుని గ్రామ కార్యదర్శులతో కలిసి ఏర్పాట్లను చూస్తున్నారు. సర్వం సిద్ధం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికారులు ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి చేరిన ఎన్నికల సామగ్రిని నిమోజకవర్గాల వారీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయాలకు, అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయాలకు పంపిణీ చేసే చర్యలను చేపడుతున్నారు. స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన ఈవీఎంలు కలెక్టరేట్లో ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్న సిబ్బంది ఇందులో భాగంగా మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఓటరు నమోదు పత్రాలను బూత్‌ల వారీగా సిద్ధం చేసి ఆయా మండలాలకు పంపిస్తున్నారు. అలాగే బ్యాలెట్ పత్రాలను సైతం సిద్ధం చేశారు. అధికారులు ఎన్నికల ఏర్పాట్ల పనుల్లో బిజీగా మారిపోతున్నారు. -
మంచి ఉత్తీర్ణత సాధించాలి
తలమడుగు(బోథ్): విద్యార్థులు బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలని అసిస్టెంట్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. శుక్రవారం మండలంలోని లింగి గ్రామంలో కస్తూరిబా గాంధీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఎంత మంది విద్యార్థినులు ఉన్నారు. భోజనం మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతిలో ఎంత మంది విద్యార్థినులు ఉన్నారు. ఎలా ప్రిపేర్ అవుతున్నారని తెలుసుకున్నారు. తెలుగు భాషపై పట్టుతో పాటు ఇంగ్లిష్‌పై శ్రద్ధ పెట్టాలన్నారు. మార్చిలో జరిగే పరీక్షలకు ఇప్పటి నుంచే కష్టపడి చదవాలన్నారు. కాపీయింగ్‌కు పాల్పడకుండా ఇప్పటి నుంచి కష్టపడి చదివితే మంచి విజయం సాధించవచ్చన్నారు. ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఉదయం ఎంత భోజనం పెడుతున్నారు. మధ్యాహ్నం, రాత్రి వేళలో ఎలాంటి భోజనం అందిస్తున్నారని తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు అందుబాటులో ఉండి మంచి ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులను తయారు చేయాలన్నారు. ఆయన వెంట శ్రీనివాస్‌రెడ్డి, ఎస్వో సువర్ణ తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీని పరిశీలిస్తున్న అసిస్టెంట్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ -
పకడ్బందీ ఏర్పాట్లు
నిర్మల్అర్బన్: జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని మీడియా సెంటర్లో మం గళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు ముగ్గురు కేంద్ర ఎన్నికల పరిశీలకులు వచ్చారని తెలిపారు. ఈవీఎం, వీవీప్యాట్లను రాజకీయ పార్టీల సమక్షంలో సరిచూసి సంబంధిత నియోజకవర్గాలకు పంపినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 167 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. ఆయా కేంద్రాల్లో ఆదనపు బలగాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గంలో కొన్ని మండలాలు మంచిర్యాల, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉన్నాయని, అక్కడ శాంతి భద్రతల పర్యవేక్షణ నిరంతరం అక్కడి పోలింగ్ అధికారులతో సమీక్షించడం జరుగుతుందన్నారు. మూడు జిల్లాల ఎస్పీల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నామని అన్నారు. ప్రతీ నియోజకవర్గంలో వెబ్‌కాస్టింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను నియమించామని, వీరికి ఆదివారం శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 18 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని పొలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం వీల్‌చైర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 104 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. వారికి త్వరలోనే శిక్షణ ఇస్తామన్నారు. ఎన్నికల కోసం నియమించిన సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు 134 అద్దె బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా ఈవీఎంల పంపిణీ నిర్మల్అర్బన్: ఎన్నికల్లో వినియోగించే ఈవీ ఎం, వీవీ ప్యాట్లను నియోజకవర్గాల వారిగా పంపిణీ చేసినట్లు జేసీ భాస్కర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో గల ఈవీఎం గోదాంలో భద్రపరచిన ఈవీఎం, వీవీ ప్యాట్లను మంగళవారం రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో పరిశీలించారు. అనంతరం జేసీ మాట్లాడారు. ఎన్నికల్లో వినియోగించనున్న బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూని ట్, వీవీ ప్యాట్లను నిర్మల్, ఖానాపూర్, ము«థోల్ నియోజకవర్గాల వారీగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఖానాపూర్ నియోజకవర్గానికి 262 బ్యాలెట్ యూనిట్లు, 267 కంట్రోల్ యూనిట్లు, 286 వీవీ ప్యాట్లను ఉట్నూర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి పంపిణీ చేసినట్లు తెలిపారు. ముథోల్ ని యోజకవర్గానికి 301 బ్యాలెట్ యూనిట్లు, 306 కంట్రోల్ యూనిట్లు, 328 వీవీ ప్యాట్లను భైంసా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే నిర్మల్ నియోజకవర్గానికి 271 బ్యాలెట్ యూ నిట్లు, 276 కంట్రోల్ యూనిట్లు, 296 వీవీ ప్యాట్లను నిర్మల్ రిటర్నింగ్ అధికారికి అందజేసినట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు గండ్రత్ రమేష్, సాయి, రాజేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణగౌడ్, ఎంఐఎం పార్టీ నాయకులు మజహర్ తదితరులున్నారు. -
మా బడి తోట.. ‘దివ్య’మైన బాట
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ మరో వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల కాలంలోనే ఆమె కౌలు రైతులు, ఆదివాసీల కోసం చేపట్టిన చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్న విషయం విదితమే. తాజాగా ఆమె ఆలోచనల నుంచి వచ్చిందే ‘మా బడి తోట’. ఆదిలాబాద్ జిల్లా సర్కారు బడుల్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రతీ బడిలో సేంద్రియ పద్ధతిలో కిచెన్ గార్డెన్‌ను సాగు చేయాలి. తద్వారా విద్యార్థులకు మేలైన పోషకాహారం అందించడంతోపాటు వ్యవసాయం, పోషక విలువలపై ఈ పాఠశాలల్లో సాగు ద్వారా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. కూరగాయల విత్తన రకాలు అందజేత జిల్లాలో కేజీబీవీ, రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూల్, ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలతోపాటు వసతిగృహాలు కలిపి 1400లకు పైగా ఉన్నాయి. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లకు స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో కూరగాయల విత్తన రకాలకు సంబంధించి తయారుచేసిన ప్యాకెట్లను కలెక్టర్ అందజేశారు. ఒక్కో రకం కూరగాయల పంటకు ఇద్దరు ముగ్గురు విద్యార్థులు గ్రూపుగా కలసి దత్తత తీసుకోవాలి. బడి ఆవరణలో ఎంపిక చేసిన ప్రదేశంలో ఆయా రకాల విత్తనాలను ఆయా గ్రూపు విద్యార్థులతో నాటించాలి. నారు పెంపకంలో అటు కలుపు తీయడమే కాకుండా నీళ్లందించి వాటిని సంరక్షించే బాధ్యత ఆ దత్తత తీసుకున్న గ్రూపు పిల్లలే వహించేలా చూడాలి. కూరగాయలు అందించడం ద్వారా మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మేలు జరుగుతున్నందునా ఈ నారు పెంపకంలో వారిని భాగస్వాములు చేసి తోటను వృద్ధి చేయాలి. దీనికి సంబంధించి మాబడి తోట పెంపకానికి సూచనలను ఇస్తూ నాలుగు పేజీల నోట్‌ను తయారుచేసి ప్రతి పాఠశాలకు అందజేశారు. టమాటా మినహా ఇతర కూరగాయ గింజలన్ని నాటిన మొక్కల నుంచి తీసుకొని తర్వాత సంవత్సరంలో నాటేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు. స్థలం లేనిచోట.. ఆదిలాబాద్ జిల్లాలో 1400లకు పైగా పాఠశాలలు ఉంటే ఓ పది శాతం పాఠశాలల్లో స్థలం కొరత కారణంగా కిచెన్‌గార్డెన్ ఇబ్బందిగా ఉంటుందని కొంతమంది ప్రధానోపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటిచోట తీగజాతి సొరకాయ, బీరకాయ వంటివి పెంచాలని కలెక్టర్ సూచించారు. గోడల మీదా పెరిగేలా వాటిని ఏర్పాటు చేసుకోవాలి. ప్రహరీలు లేని పాఠశాలల్లో ముళ్ల కంచెలను ఏర్పాటు చేసుకోవాలి. నీటి వసతిలేని దగ్గర నీళ్లు వృథా కాకుండా విద్యార్థుల భోజనం తర్వాత చేతులు శుభ్రం చేసే దగ్గరి నుంచి కూరగాయల నారు వరకు నీళ్లు వెళ్లేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇలా మాబడితోట కార్యక్రమం విషయంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ‘దివ్య’మైన ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. -
కొత్త పంచాయతీలు 226..!
సాక్షి, ఆదిలాబాద్ : జిల్లాలో కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేసే గ్రామాల వివరాలు కొలిక్కి వస్తున్నాయి. ఈ నెల 16న సీఎం కేసీఆర్‌తో హైదరాబాద్‌లో కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల సమావేశం అనంతరం ఇదివరకు రూపొందించిన కొత్త జీపీల ప్రతిపాదనల్లో కొంత మార్పులు చేర్పులు చేపట్టిన విషయం తెలిసిందే. ఒకపక్క కొత్త గ్రామపంచాయతీల వివరాలను రూపొందిస్తూనే మరోపక్క ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేసే గ్రామాల విషయంలో గ్రామస్తుల అభిప్రాయ సేకరణ చేపట్టారు. మున్సిపాలిటీలో గ్రామాలు విలీనమైన పక్షంలో స్వల్పంగా మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉంది. జిల్లాలో 243 గ్రామపంచాయతీలు ఉండగా, తాజాగా కొత్త జీపీ(గ్రామ పంచాయతీ)ల ఏర్పాటు విషయంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, పంచాయతీరాజ్ ఏఈలు గత వారం రోజులుగా కసరత్తు చేస్తున్నారు. అవి తుది దశకు వస్తున్నాయి. తాజా మార్పులు చేర్పులకు ముందు జిల్లాలో 225 గ్రామాల కోసం అప్పట్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అందులో 300 జనాభాకు తక్కువ ఉన్న గ్రామాలను కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అర కిలోమీటర్ దూరమున్నవి కూడా పరిగణనలోకి తీసుకున్నారు. తాజాగా జరిగిన మార్పుల్లో 300 జనాభాకు తక్కువ ఉన్న గ్రామాలను, అర కిలోమీటర్ దూరంలో ఉన్న వాటిని దీంట్లో నుంచి తొలగించారు. గ్రామపంచాయతీకి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఎస్సీ, గ్రామాలను స్పెషల్ కేటగిరీలో కొన్నింటిని పరిగణనలోకి తీసుకొని గ్రామపంచాయతీల కోసం కొత్త ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇలా 226 గ్రామపంచాయతీలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. గురువారం వరకు ఉట్నూర్, నార్నూర్ మండలాలు మినహాయించి మిగతా మండలాల వివరాలు వచ్చాయి. దీనిపై శుక్ర, శనివారాల్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ నెల 25 వరకే కొత్త ప్రతిపాదనలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. దానిని 31 వరకు పొడిగించారు. కలెక్టర్ అభిప్రాయ సేకరణ.. జిల్లాలోని ఏకైక ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేసే గ్రామాల విషయంలో కలెక్టర్ దివ్యదేవరాజన్ గురువారం ఉదయం 11 నుంచి సాయంత్రం 7గంటల వరకు ఆయా గ్రామాలను సందర్శించి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. జిల్లా పంచాయతీ అధికారి జితేందర్‌రెడ్డి, ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ మారుతిప్రసాద్, ఇతర అధికారులతో కలిసి ఆమె గ్రామాలకు వెళ్లారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మావల, కచ్కంటి, అనుకుంట, బట్టిసావర్గాం, రాంపూర్, బెల్లూరి, నిషాన్ఘాట్ గ్రామాలను విలీనం చేయాలని ఇదివరకు ప్రతిపాదనలు రూపొందించారు. నిషాన్ఘాట్, బెల్లూరి మినహాయించి మిగతా అన్ని గ్రామాల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి అభిప్రాయాలను సేకరించారు. ప్రధానంగా మావల, కచ్కంటి, బట్టిసావర్గాం గ్రామాల ప్రజలు మున్సిపాలిటీలో విలీనంపై వ్యతిరేకత చూపారు. ప్రధానంగా మున్సిపాలిటీలో విలీనమైన పక్షంలో ఉపాధిహామీ కింద కూలీ పనులను కోల్పోయే పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేఆర్కే కాలనీ ఆర్ఓఎఫ్ఆర్ కింద రావడంతో దాని విషయంలోనూ ఆలోచన చేస్తున్నారు. సాయంత్రం వరకు అభిప్రాయ సేకరణ అనంతరం కలెక్టర్ రాత్రి అధికారులతో సమావేశమయ్యారు. ఈ విషయంలో చర్చించారు. విలీన గ్రామాల విషయంలో ఇంకా కొలిక్కి రాలేదు. శుక్ర, శనివారాల్లోనే ఇదికూడా తుదిదశకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మావల, బట్టిసావర్గాం గ్రామపంచాయతీల్లోని మిగతా గ్రామాలను మున్సిపాలిటీలో కలిపే అవకాశాలు లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా టీచర్స్ కాలనీ, దస్నాపూర్, కైలాస్‌నగర్, టైలర్స్‌కాలనీ, పిట్టలవాడ, దుర్గానగర్ కాలనీలు ఇప్పటికే పట్టణంలో కలిసిపోయినట్టు ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాలను కలిపి మావల, బట్టిసావర్గాం గ్రామాలను గ్రామపంచాయతీలుగానే ఉంచే అవకాశాలు లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే మేజర్ గ్రామపంచాయతీ అయిన మావల చిన్నపాటి గ్రామపంచాయతీగా మిగిలిపోనుంది. బట్టిసావర్గాంది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా ఈ రెండుమూడు రోజుల్లో గ్రామపంచాయతీల వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. రెండు రోజుల్లో కొలిక్కి.. గ్రామపంచాయతీల ఏర్పాటు కొలిక్కి వస్తోంది. వివిధ అంశాల ఆధారంగా పరిశీలన చేయడం జరిగింది. ఇప్పుడున్న 243 గ్రామపంచాయతీలకు అదనంగా మరో 226 గ్రామపంచాయతీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇందులో 47 గ్రామాలు మాత్రమే 500 జనాభాకు లోబడి ఉన్నాయి. మిగతా 179 గ్రామాలు 500 జనాభాకు పైబడి ఉన్నాయి. – జితేందర్‌రెడ్డి, డీపీఓ, ఆదిలాబాద్ -
నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న ఆదిలాబాద్ కలెక్టర్ జగన్మోహన్
-
'ఆదివాసీలు సంఘటితం కావాలి'
ఆదిలాబాద్: ఆదివాసీలు సంఘటితంగా హక్కుల కోసం పోరాడాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జగన్ మోహన్ అన్నారు. ఆయన ఆదివారం జెడ్పీ హాలులో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు సంఘటితమై తమ హక్కులు పోరాడి సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.