వంద శాతం పోలింగ్‌ నమోదే లక్ష్యం | Adilabad Collector Review On Election | Sakshi
Sakshi News home page

వంద శాతం పోలింగ్‌ నమోదే లక్ష్యం

Published Wed, Dec 5 2018 3:51 PM | Last Updated on Wed, Dec 5 2018 3:51 PM

Adilabad Collector Review On Election - Sakshi

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ 

ఆదిలాబాద్‌టౌన్‌: ఈ నెల 7న జరిగే శాసనసభ ఎన్నికల్లో వంద శాతం పోలింగ్‌ నమోదే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ అన్నారు. మంగళవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ను ప్రశాంత వాతావరణంలో జరిపేలా డిజిటలైజేషన్‌ సర్వేలైన్‌ ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఓటర్లందరూ తమ ఓటు హక్కును సద్విని యోగం చేసుకోవాలని కోరారు.
‘ఓట్‌ ఫర్‌ ఆదిలా బాద్‌’ యాప్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉంది, ఎలా వెళ్లాలి, ఎంత దూరంలో ఉందనే విషయాలను తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. చిన్నపిల్లలు ఉన్న మహిళల కోసం 25 మోడల్‌ ఫీడింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో జేసీ సంధ్యారాణి, జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్, అసిస్టెంట్‌ కలెక్టర్‌ గోపి, సహాయ కలెక్టర్‌ ప్రతీక్‌జైన్, డీఆర్‌డీఏ పీడీ రాజేశ్వర్‌ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేక సౌకర్యాలు..
ఆదిలాబాద్, బోథ్‌ నియోజకవర్గాల్లో మొత్తం 6,837 మంది వికలాంగులు ఉన్నారని తెలిపారు. వీరిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు 435 ఆటోలు ఉంటాయని, సహాయకులుగా ఐకేపీ సిబ్బందిని నియమించామని అన్నారు. నడవలేని వారికి 383 వీల్‌చైర్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లోని మహాలక్ష్మివాడ పాఠశాల, బోథ్‌ నియోజకవర్గంలోని గేర్జం పాఠశాలలను ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వికలాంగుల పరిష్కారం కోసం స హాయ కేంద్రం 08732–220169పై సంప్రదించాలని సూచించారు.

మద్యం షాపుల బంద్‌..
ఎన్నికల నేపథ్యంలో బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 7న సాయంత్రం 5గంటల వరకు మద్యం దుకాణాల మూసివేసి ఉంచాలని ఎక్సైజ్‌ శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. మద్యం, డబ్బు పంపిణీ చేస్తే సివిజిల్‌ యాప్‌ సహకారంతో సమాచారం అందించాలన్నారు. ఇప్పటివరకు సి–విజిల్‌ 183 ఫిర్యాదులు రాగా, ఇందులో 163 ఫిర్యాదులపై చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం 5గంటల వరకు ముగించాల్సి ఉంటుందన్నారు. రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లను వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాల్లో తరలించవద్దని, నిబంధనలను ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
భారీ పోలీసు బందోబస్తు : జిల్లా ఎస్పీ
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పోలీసు బందోబస్తు చేపడుతున్నట్లు జిల్లా ఎ స్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ అన్నారు. ఇద్దరు అడిషన ల్‌ ఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 20 మంది సీఐ లు, 25 మంది ఎస్సైలు, 550 సివిల్‌ ఫోర్స్, 200 మంది ఏఆర్‌ ఫోర్స్‌తోపాటు నాలుగు కంపెనీలకు చెందిన 400 మంది, ఏపీఎస్పీకి సంబంధించి 200 మంది, ఆదిలాబాద్‌కు చెందిన 165 మంది హోంగార్డులు, యావత్‌మాల్‌కు చెందిన 400 మం ది హోంగార్డులు ఎన్నికల విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. ఇప్పటివరకు 348 బైండోవర్‌ కేసులు నమోదు చేశామని, 17 లైసెన్స్‌ గల పిస్టోళ్లను స్వా« దీనం చేసుకున్నట్లు వివరించారు. పోలింగ్‌ కేంద్రాల్లో 130 సమస్యాత్మక కేంద్రాలను గుర్తిం చామని, పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలను అందుబాటులో ఉంచామని తెలిపారు.
  
ఎన్నికల రోజు సెలవు..
ఎన్నికల సందర్భంగా సెలవు ప్రకటించామని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, బ్యాంకులకు 6, 7 తేదీ ల్లో సెలవు ప్రకటించామని పేర్కొన్నారు. ప్రైవేట్‌ సంస్థలు 7న సెలవు ఇవ్వాలని ఆదేశించారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎగ్జిట్‌ పోల్‌ నిర్వహించవద్దని, ఇతర జిల్లాల వ్యక్తులు 48గంటల పాటు జిల్లాలో ఉండరాదని అన్నారు. సమస్యలు ఉంటే 1800 425 1939 టోల్‌ఫ్రీపై సమాచారం ఇవ్వాలని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement