
కరోనా వలస జీవులకు ఎక్కడ లేని కష్టాలు తెచ్చిపెట్టింది. జేబులో చిల్లిగవ్వ లేక..ఎక్కడ ఉండాలో తెలియక భార్యాబిడ్డలతో బిక్కుబిక్కు మంటూ నడక సాగిస్తున్నారు వలస కూలీలు. హైదరాబాద్ నుంచి చత్తీస్‌ఘడ్‌కు కాలినడక వెళ్తూ ఆదిలాబాద్ దేవాపూర్ చెక్‌పోస్ట్ వద్ద తన కూతురుని అక్కున చేర్చుకుని సేద తీరుతున్న చిత్రమిది. (ఆనంద్‌ను మిస్ అవుతోన్న తమన్నా )
– సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
ఇతర రాష్ట్రాల వారిని అనుమతించం
సాక్షి, ఆదిలాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగించినందున ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని జిల్లాకు తీసుకురావడానికి అనుమతించమని కలెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. లాక్‌డౌన్ పూర్తయిన వెంటనే తీసుకురావచ్చని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఫోన్ చేసి సమస్యలు తెలపగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వివిధ సమస్యలపై 13 కాల్స్ వచ్చాయి.(జనతాబజార్లలో ఆక్వా ఉత్పత్తులు: సీఎం జగన్)
ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతున్నందున ఎక్కడివారు అక్కడే ఉండాలన్నారు. పట్టణంలోని శాంతినగర్, దస్నాపూర్, పిట్టలవాడ, టీచర్స్‌కాలనీ, బేల, బజార్‌హత్నూర్ మండలాల్లో బియ్యం, నగదు అందలేదని కొందరు తెలపగా, ఏప్రిల్ నెల బియ్యం పంపించామని, ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని నిలిపివేసిందని, వచ్చే నెలలో తిరిగి చెల్లిస్తామన్నారు. బ్యాంకు ఖాతాల్లో నగదు జమకాని వారు పోస్టల్ కరస్పాండెంట్‌ను సంప్రదించాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్వో నటరాజ్, ఎల్డీఎం చంద్రశేఖర్, డీఎఫ్‌వో ప్రభాకర్, అధికారులు పాల్గొన్నారు. (క్షిణించిన కిమ్ ఆరోగ్యం.. కొరియాకు చైనా వైద్యులు )
Comments
Please login to add a commentAdd a comment