Migrant Laborers
-
వలస కార్మికుల హక్కులపై వర్క్‌షాప్, టీపీసీసీ నాయకులకు ఆహ్వానం
అంతర్జాతీయ కార్మిక చట్టాలపై బీడబ్ల్యుఐ సంస్థ ఈనెల 17, 18 రెండు రోజుల పాటు చెన్నైలో నిర్వహిస్తున్న వర్క్ షాప్ కు తెలంగాణకు చెందిన ఇద్దరు యువ నాయకులకు ఆహ్వానం అందింది. చట్టపరమైన న్యాయవాద శిక్షణ - వలస కార్మికుల హక్కులు (లీగల్ అడ్వకసీ ట్రైనింగ్ - మైగ్రంట్ వర్కర్స్ రైట్స్) శిక్షణ కార్యక్రమానికి తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (గల్ఫ్ జెఏసి) చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రవాస భారతీయుల విభాగం (టీపీసీసీ ఎన్నారై సెల్) గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి హాజరవుతున్నారు. స్విట్జర్లాండ్ రాజధాని జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బీడబ్ల్యుఐ) అనే గ్లోబల్ యూనియన్ ఫెడరేషన్ తన సభ్య యూనియన్ జగిత్యాల జిల్లాకు చెందిన 'ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్' కు ఈ ఆహ్వానం అందజేయగా ఇద్దరు యువ నాయకులను నామినేట్ చేసింది. 127 దేశాలలో 351 ట్రేడ్ యూనియన్ లతో ఒక కోటి 20 లక్షల సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బిడబ్ల్యుఐ భారతదేశంలో దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నది. అంతర్జాతీయ వలసలు, గల్ఫ్ దేశాలలో వలస కార్మికుల హక్కులు అనే అంశంపై చెన్నయిలో శిక్షణ ఇస్తారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే నాయకుల జ్ఞానం పెంపొందించడానికి, నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ఈ క్రింది అంశాలపై శిక్షణ ఇస్తారు. అంతర్జాతీయ వలసలను నియంత్రించే చట్టపరమైన విధాన నమూనా (పాలసీ ఫ్రేమ్ వర్క్) వ్యవస్థ భాగస్వాముల అవగాహనను విస్తరించడం. వలస కార్మికుల హక్కులను నిలబెట్టడానికి, సురక్షితమైన వలసలను ప్రోత్సహించడానికి భాగస్వామ్య సంఘాల జోక్యాలపై నవీకరణలు మరియు సురక్షిత సమాచారాన్ని సేకరించడం. కంట్రీస్ ఆఫ్ ఆరిజిన్ (కార్మికులను పంపే మూలస్థాన దేశాలు) మరియు కంట్రీస్ ఆఫ్ డెస్టినేషన్ (కార్మికులను తీసుకునే గమ్యస్థాన దేశాలు) లలో వలస కార్మికులకు అందుబాటులో ఉండి వారికి సహాయాన్ని అందించడానికి కార్మిక సంఘాలు (ట్రేడ్ యూనియన్స్) ఎలాంటి కార్యాచరణ, వ్యూహాలను కలిగి ఉండాలో చర్చిస్తారు. -
Targeted Attacks: కశ్మీర్లో నాలుగు రోజుల్లో ముగ్గురి హత్య
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. మైనార్టీలు, వలస కూలీలే లక్ష్యంగా దాడులు చేస్తుండటం కలకలం సృష్టిస్తోంది. నాలుగు రోజుల క్రితం ఓ కశ్మీరీ పండిట్‌ను టెర్రరిస్టులు ఇంట్లోకి చొరబడి కాల్చి చంపారు. తాజాగా మరో ఇద్దరు వలస కూలీలను పొట్టనబెట్టుకున్నారు. షోపియాన్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున కూలీలు నివాసం ఉంటున్న ప్రాంతంలో గ్రెనేడ్ దాడి చేయగా.. ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. గత నాలుగు రోజుల్లో రెండుసార్లు దాడులు జరగటం భయానక పరిస్థితులను తలపిస్తోంది. షోపియాన్‌లోని హర్మెన్ ప్రాంతంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు నివసిస్తున్న ఇంటిపైకి టెర్రరిస్టులు గ్రెనేడ్ విసిరారు. ఈ దాడిలో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ యూపీలోని కన్నౌజ్‌కు చెందిన రామ్‌సాగర్, మోనిశ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఉగ్రదాడి నేపథ్యంలో హర్మెన్ ప్రాంతంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. లష్కరే తోయిబాకు చెందిన హైబ్రీడ్ ఉగ్రవాది ఇమ్రాన్ బషీర్ గనీని అరెస్టు చేశారు. పోలీసుల విచారణంలో కూలీలపైకి గ్రెనేడ్ విసిరింది ఇమ్రానే అని తేలింది. గత శనివారం ఇదే షోపియాన్ ప్రాంతంలో పురాన్ క్రిషన్ భట్(56) అనే కశ్మీరీ పండిట్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. చౌధరీ గూండ్ గ్రామంలో పూరాన్ భట్ తన ఇంటి వద్ద ఉండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భట్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ దాడిని తామే చేసినట్లు కశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రకటించింది. భట్ హత్యతో కశ్మీర్ లోయలో మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. అంతకు ముందు సెప్టెంబర్ 2న మునీర్ ఉల్ ఇస్లామ్ అనే పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇదీ చదవండి: ఉప్పల్ తండ్రీకొడుకుల హత్య కేసు: కుంకుమ-పసుపు క్లూస్.. పూజలు వికటించడంతో కక్షగట్టి! -
ఈ సౌకర్యం ఉంటేనే విమాన టికెట్ !
మోర్తాడ్ (బాల్కొండ): ఖతర్‌కు వెళ్లాలనుకునే వలసకార్మికులకు క్వారంటైన్ చిక్కులు వచ్చిపడ్డాయి. అక్కడి హోటళ్లలో క్వారంటైన్‌కు అవసరమైన గది ఖాళీగా ఉంటేనే వీరి ప్రయాణానికి అనుమతి లభిస్తోంది. ఇతర గల్ఫ్దేశాలకంటే ఖతర్‌కు విమాన సర్వీసులు ఎక్కువగానే ఉన్నా అక్కడకు వెళ్లిన తరువాత ఏడు రోజులపాటు క్వారంటైన్ చేయడానికి అవసరమైన హోటల్ గదులు దొరకడం లేదు. ఫలితంగా ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఖతర్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ దేశానికి వచ్చే విదేశీయులు ఎవరైనా వారంపాటు హోటళ్లలో సెల్ఫ్ క్వారంటైన్ ఉండాల్సిందే. కోవిడ్–19 సెకండ్ వేవ్ తరువాత పరిస్థితి కాస్త కుదుటపడటంతో గల్ఫ్ దేశాల్లో వివిధ కంపెనీల కార్యకలాపాలు గాడినపడుతున్నాయి. 2022లో ప్రపంచ ఫుట్‌బాల్ క్రీడాటోర్నీకి ఖతర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఖతర్‌లో ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. ఇతర గల్ఫ్‌దేశాల కంటే ఖతర్ నుంచే వీసాలు ఎక్కువగా జారీ అవుతున్నాయి. అయితే ఖతర్ నుంచి సెలవుపై వచ్చి తిరిగి వెళ్లాలనుకునేవారు, కొత్తగా వెళ్లేవారు తప్పనిసరిగా వారంపాటు హోటల్ గదిలో క్వారంటైన్ ఉండాలి. శంషాబాద్ ఎయిర్‌పోర్టుతోపాటు మనదేశంలోని ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి ఖతర్‌కు షెడ్యూల్ విమానాలు నడుస్తున్నాయి. హోటల్ గదిని బుక్ చేసుకున్నట్లు రసీదు చూపితేనే విమానయాన సంస్థలు టికెట్ జారీ చేస్తున్నాయి. కానీ, ఖతర్‌లోని హోటల్ గదులు నిండిపోవడంతో 20 రోజులకు మించి వెయిటింగ్లో ఉండాల్సివస్తోంది. ఒకవేళ ఖతర్ క్వారంటైన్ నిబంధన ఎత్తేస్తే సులభంగా ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది. -
వాళ్లను ముందుగానే తరలించి ఉంటే..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనాను కట్టడి చేయడం కోసం అనూహ్యంగా మార్చి 24 అర్ధరాత్రి నుంచి లాక్‌డౌన్‌ను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వలస కార్మికులు ఆ మరుసటి రోజు నుంచే తమ స్వస్థలాకు బయల్దేరిన విషయం తెల్సిందే. అలా రాజస్థాన్ రాష్ట్రానికి మొదటి విడతన అంటే మార్చి 25 తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు అహ్మదాబాద్, సూరత్, ఢిల్లీ, ముంబై, ఇండోర్ నగరాల నుంచి దాదాపు మూడు లక్షల మంది రాజస్థాన్‌కు చేరుకున్నారు. వీరంతా కాలి నడకన, సొంత వాహనాలు, ఇతర కిరాయ వాహనాల్లో నానా కష్టాలు పడి స్వస్థలాలకు చేరుకున్నారు. (పంజాబ్ సీఎం కీలక నిర్ణయం) అప్పటికి రాష్ట్రంలో కరోనా కేసుల శాతం ఒక శాతం ఉండగా, వలస కార్మికుల రాకతో 1.5 శాతానికి చేరుకుందని ‘ఆజీవిక బ్యూరో’ లెక్కలు తెలిపింది. మే 4వ తేదీ నుంచి వలస కార్మికులు గమ్యస్థానాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లు, బస్సుల ద్వారా అనుమతించడంతో మరో విడత వలస కార్మికుల రాక మొదలైంది. మే చివరి దాక కొనసాగిన ఈ వలస కార్మికుల రాకలో రాజస్థాన్‌కు మరో నాలుగు లక్షల మంది చేరుకున్నారు. అప్పటి వరకు 1.5 శాతం ఉన్న కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా మూడు శాతానికి చేరుకుంది. (‘క్వారంటైన్ బబుల్’ ఓ కొత్త దృక్పథం) మొదటి విడతలో చేరుకున్న వలస కార్మికులకంటే రెండు విడతలో చేరుకున్న వలస కార్మికుల్లో రెంటింపు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన వలస కార్మికులను తరలించాకే దేశంలో లాక్‌డౌన్‌ను అమలు చేసి ఉన్నట్లయితే నేడు కరోనా మహమ్మారి ఇంత తీవ్రంగా ఉండేది కాదని ఆజీవిక బ్యూరోతోపాటు రాజస్థాన్‌లో వలస కార్మికులకు వైద్య సేవలు అందిస్తున్న ‘బేసిక్ హెల్త్‌కేర్ సర్వీసెస్’ సహ వ్యవస్థాపకులు పవిత్ర మోహన్ అభిప్రాయపడ్డారు. రాజస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య దాదాపు 20 వేలకు చేరుకుంది. (లాక్డౌన్ సడలించాక పెరిగిన కేసులు) -
మరింత తగ్గిన మరణాల రేటు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా బాధితుల మరణాల రేటు మరింత తగ్గింది. శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో ఎటువంటి మరణాలు నమోదు కాలేదు. దీంతో మొత్తం మరణాల రేటు 1.64 శాతానికి తగ్గింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 73గా ఉంది. శుక్రవారం ఉ. 9 గంటల నుంచి శనివారం ఉ.9 గంటల వరకు 12,771 మందికి పరీక్షలు నిర్వహించగా 210 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇందులో 41 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఉండగా, 8 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,460కు చేరింది. ఇందులో 741 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలవి కాగా, 131 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివి. కరోనా వైరస్ నుంచి కోలుకున్న 45 మందిని కొత్తగా డిశ్చార్జి చేయడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,601కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,786గా ఉంది. సున్నాకు చేరిన వెరీ యాక్టివ్ క్లస్టర్లు: రాష్ట్రంలో రెడ్ క్లస్టర్ల (వెరీ యాక్టివ్ క్లస్టర్ల) సంఖ్య సున్నాకు చేరింది. రెండ్రోజుల క్రితం 9గా ఉన్న రెడ్ క్లస్టర్ల సంఖ్య శనివారం నాటికి సున్నాకు చేరింది. వెరీ యాక్టివ్ క్లస్టర్లుగా చెప్పుకునే వీటిలో పాజిటివ్ కేసులు నమోదైన రోజు నుంచి 5 రోజుల లోపల తిరిగి నమోదవుతాయి. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 393 క్లస్టర్లు ఉన్నాయి. అందులో గ్రీన్జోన్లో 201 ఉన్నాయి. 6–14 రోజులలోగా నమోదయ్యే యాక్టివ్ క్లస్టర్లు 92, 15 నుంచి 28 రోజుల్లోగా నమోదయ్యే డార్మెంట్ క్లస్టర్లు 100 ఉన్నాయి. -
మరో 35 మంది డిశ్చార్జి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి కొత్తగా కోలుకున్న 35 మందిని డిశ్చార్జి చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,556కు చేరింది. తాజాగా డిశ్చార్జి అయిన వారిలో 14 మంది వలస కూలీలు ఉన్నారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు మొత్తం 9,831 మందికి పరీక్షలు నిర్వహించగా 138 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. వీటిలో 84 కేసులు వలస కూలీలకు చెందినవి కాగా, మరో నాలుగు కేసులు విదేశాల నుంచి వచ్చినవి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,250కు చేరింది. మొత్తం కేసుల్లో 700 వలస కూలీలవి కాగా, 123 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. కరోనాతో మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 73కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,621గా ఉంది. కరోనాను జయించిన 6 నెలల చిన్నారి తిరుపతి రుయా నుంచి డిశ్చార్జి కరోనా మహమ్మారి బారిన పడిన 6 నెలల చిన్నారి కోలుకుని ఇంటికి చేరుకుంది. చిత్తూరు జిల్లా కేవీబీ పురానికి చెందిన ఆ పసిపాపకు కరోనా సోకడంతో తిరుపతి రుయా కోవిడ్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యుల కృషితో వైరస్ నుంచి విజయవంతంగా కోలుకుని శుక్రవారం డిశ్చార్జి అయ్యింది. రుయా కోవిడ్ ఆస్పత్రి నుంచి శుక్రవారం నలుగురు డిశ్చార్జి కాగా అందులో ఈ చిన్నారి కూడా ఉంది. చంటిబిడ్డ కరోనాను జయించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. తమ పాపకు వైద్యం అందించిన వైద్యులకు చిన్నారి తల్లి, బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సేవలను కొనియాడారు. కోలుకున్న వారికి డిశ్చార్జి కాపీలను రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి అందజేయగా. ప్రభుత్వం తరఫున రెవెన్యూ అధికారులు 2 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. -
కరోనా నుంచి కోలుకున్న మరో 51 మంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి 51 మంది కోలుకోవడంతో వారిని డిశ్చార్జి చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఇందులో 8 మంది వలస కూలీలు ఉన్నారు. దీంతో మొత్తం కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,332కు చేరింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు మొత్తం 9,370 మందికి పరీక్షలు నిర్వహించగా 110 మందిలో పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వీరిలో 12 మంది వలస కార్మికులున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3,571కు చేరింది. ఇందులో 418 కేసులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలవి కాగా, కోయంబేడుకు సంబంధించినవి 226, విదేశాల నుంచి వచ్చిన 111 మంది ఉన్నారు. వీరిని మినహాయిస్తే రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,816గా ఉంది. కృష్ణా జిల్లా, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా వైరస్‌తో మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 62కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,177గా ఉంది. -
ఒకేరోజు 101 మంది డిశ్చార్జ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 101 మందిని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఇందులో 79 మంది రాష్ట్రంలోని వాళ్లు కాగా 22 మంది వలస కూలీలు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,226కు చేరింది. రికవరీ రేటు 66.85 శాతానికి చేరింది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 11,638 మందికి పరీక్షలు నిర్వహించగా 85 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో 52 మంది పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3,330కు చేరింది. ఇందులో 345 మంది వలస కూలీలు ఉండగా, కోయంబేడు కాంటాక్టు కేసులు 223, విదేశాల నుంచి వచ్చిన వారు 111 మంది ఉన్నారు. వీరిని మినహాయిస్తే ఏపీలో కరోనా పాజిటివ్ సోకిన కేసుల సంఖ్య 2,674గా ఉంది. శుక్రవారానికి మొత్తం మరణాల సంఖ్య 60కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,044గా ఉంది. -
లక్షన్నర దాటిన పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ/డెహ్రాడూన్: 1,51,767 పాజిటివ్ కేసులు, 4,337 మరణాలు. దేశంలో కరోనా సృష్టించిన విలయమిది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నానాటికీ పెరిగిపోతోంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,387 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 170 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసులు 1,51,767కు, మరణాలు 4,337కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. భారత్‌లో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 83,004 కాగా, 64,425 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. వలస కూలీలు స్వస్థలాలకు తిరిగి వస్తుండడంతో ఉత్తరాఖండ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపయ్యేందుకు మే 17 నాటికి 16 రోజులు పట్టగా, ప్రస్తుతం 4 రోజులే పడుతోంది. ఇక్కడ మే 17 నాటికి 92 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం ఆ సంఖయ్య 438కి చేరింది. 3న పార్లమెంటరీ స్థాయీ సంఘం భేటీ దేశీయ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం జూన్ 3న సమావేశం కానుంది. ఆ రోజు తమ ముందు హాజరై కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలు, రాష్ట్రాలతో సమన్వయం, లాక్డౌన్ అమలు తీరును వివరించాలంటూ ఈ స్థాయీ సంఘం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘానికి సీనియర్ కాంగ్రెస్ నేత ఆనంద్‌కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చిన అనంతరం జూన్ 3న తొలిసారిగా భేటీ కానుంది. -
ప్లాట్‌ఫామ్‌పై ఆహార పొట్లాలు.. ఎగబడ్డ జనం!
-
‘వలస కార్మికుల పూర్తి బాధ్యత మాదే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికుల పూర్తి బాధ్యత తీసుకుని వారి సొంత ప్రాంతాలకు తరలిస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టంచేశారు. రాష్ట్రం నుంచి ఏ ఒక్క వలస కార్మికుడు కాలినడకన తన సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిన దుస్థితి రాకుండా చూడాలని, అవసరమైన రైళ్లు సమకూర్చాలని సీఎస్‌ను కేసీఆర్ ఆదేశించారు. రైళ్లు లేని ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా తరలించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ సాక్షి, హైదరాబాద్ : ఖాళీగా ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామానికి కార్యదర్శి తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉన్నందున..దానికి తగ్గట్టుగా పోస్టులను నియమించాలని స్పష్టం చేసింది. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలని ఆదేశిస్తూ పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ ఎం.రఘునందన్‌రావు..జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఖాళీలను గుర్తించి రాతపరీక్షల ద్వారా వీరిని ఎంపిక చేయాలన్నారు. ఆదర్శ గ్రామాలుగా మలచడంలో కార్యదర్శుల పాత్ర కీలకం గనుక ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. మరోవైపు జిల్లా పరిషత్ సీఈవో, డిప్యూటీ సీఈవో, డీపీవో, డీఎల్పీవో, ఎంపీడీవో, ఎంపీవో పోస్టులను అడ్‌హక్ ప్రాతిపదికన భర్తీ చేసినందున.. క్షేత్రస్థాయిలో పనిచేసే జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల నియామకాలను చేపట్టాలని సూచించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 12వేల పైచిలుకు గ్రామ పంచా యతీలుండగా..ఇందులో దాదాపు 2వేల మేర పంచాయతీ కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా, బదిలీల ప్రక్రియ పూర్తిచేయకుండా కొత్త నియామకాలు చేపట్టాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి అన్నారు. పంచాయతీరాజ్‌శాఖలో 15 ఏళ్లుగా బదిలీల ప్రక్రియ చేపట్టలేదని, కనీసం ఇప్పుడైనా బదిలీలు చేసి పదోన్నతులు, ఖాళీ పోస్టుల భర్తీ చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. -
ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వానిదే
సాక్షి, విజయవాడ/ మంగళగిరి/ తాడేపల్లిరూరల్: వలస కూలీలకు భోజనం, వసతి, వారి తరలింపునకు ప్రత్యేక శ్రామిక రైళ్ల ఏర్పాటు తదితర ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటి వరకు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో 17 ప్రత్యేక శ్రామిక రైళ్ల ద్వారా దాదాపు 20 వేల మంది వలస కూలీలను స్వరాష్ట్రాలకు చేర్చింది. డివిజన్ పరిధిలో ఈ నెల ఐదో తేదీ నుంచి దాదాపుగా ప్రతి రోజూ ఒక ప్రత్యేక శ్రామిక రైలును నడుపుతున్నారు. ఇందుకయ్యే ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. మానవతా దృక్పథంతో వలస కూలీలకు భోజనం, వసతితో పాటు అన్ని సదుపాయాలూ కల్పించి వారిని స్వస్థలాలకు పంపాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకనుగుణంగా అధికారులు పనిచేస్తున్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, జార్ఖండ్, అసోం, మణిపూర్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను విజయవాడలోని రాయనపాడుతో పాటు నెల్లూరు, నిడదవోలు, కొవ్వూరు, ఒంగోలు రైల్వేస్టేషన్ల నుంచి రైళ్ల ద్వారా గమ్యస్థానాలకు చేర్చుతోంది. స్వస్థలాలకు భవన నిర్మాణ కార్మికులు మంగళగిరిలోని ఎయిమ్స్‌తో పాటు కాజ, చినకాకాని, తాడేపల్లి జాతీయ రహదారి వెంట పలు నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్, బిహార్, ఒడిశా, రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లతో పాటు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా్లలకు చెందిన 2,400 మంది కార్మికులను సోమవారం శ్రామిక రైలుతో పాటు ఆర్టీసీ బస్సుల్లో అధికారులు వారి స్వస్థలాలకు పంపారు. -
‘వాళ్లను అలా వదిలేయడం సిగ్గు చేటు’
సాక్షి, ముంబై : కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన చర్యలు కేవలం ఆర్థిక మనుగుడకు సరిపోతాయని బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా వ్యాఖ్యానించారు. ఈ సమయంలో డిమాండ్‌ను సృష్టించే పెద్ద అవకాశాన్నికోల్పోయామంటూ తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు కొనుగోళ్లు పెరగాలంటే జీఎస్టీ తగ్గింపులు అవసరమని షా చెప్పారు. కొనుగోలును ప్రోత్సహించడానికి స్వల్ప కాలిక ఉపశమనం లభించాలనీ, కనీసం మూడు-ఆరునెలలు పాటు జీఎస్టీ భారాన్ని తగ్గించాలన్నారు. (మనమే మాయం చేశాం..సిగ్గుతో తలదించుకోవాలి!) సరఫరా కోసం ద్రవ్యత లభ్యతను సృష్టించుకున్నాం..కానీ ఆర్థిక పునరుజ్జీవనంలో చాలా ముఖ్యమైన భాగం డిమాండ్ పరిస్థితి ఏంటి అని ఆమె ప్రశ్నించారు. డిమాండ్ పుంజుకోకపోతే ఆర్థిక పునరుజ్జీవనం సాధ్యం కాదనే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మనం పెద్ద అవకాశాన్ని కోల్పోయామని షా అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఉద్యోగుల వేతనాలన్నింటినీ చెల్లించమని అన్ని పరిశ్రమలను కోరడం అన్యాయమన్నారు. డిమాండ్ లేక కుదేలైన సంస్థలకు ఇది కష్టమన్నారు. పరిశ్రమలు పూర్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించకపోతే..తాము మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వుంటుందన్నారు. (కరోనా : ఉద్యోగులపై వేటు, క్లౌడ్ కిచెన్స్‌కు బ్రేక్) మరోవైపు కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కాలంలో వలస కార్మికుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభ సమయంలో వారి మానాన వారిని వదిలివేయడం అవమానకరమని, దీనికి అందరమూ సిగ్గు పడాలన్నారు. అభివృద్ధి చెందాలని భావిస్తున్న దేశ సౌభాగ్యానికి ఇది మంచిది కాదన్నారు. పేదలకు సామాజిక భద్రత ప్రాముఖ్యాన్ని గురించి నొక్కిచెప్పిన షా, కనీస ప్రాతిపదిక ఆదాయాన్ని ప్రకటించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. (వలస వెతలు: కంటతడి పెట్టించే వీడియోలు) ఉద్దీపన ప్యాకేజీ సానుకూలతల గురించి మాట్లాడుతూ సంస్కరణల పరంగా వ్యవసాయం మంచి ప్రోత్సాహం లభించిందని కిరణ్ మజుందార్ షా భావించారు. అయినప్పటికీ, ఆధునికీకరణ పరంగా వారికి ఇంకా ఎక్కువ ప్రోత్సాహకాలు లభించాలన్నారు. అలాగే గ్రామీణాభివృద్ధికి ఎంఎస్ఎంఈ రంగానికి ప్రోత్సాహకాలు లభించాయని షా తెలిపారు. దీంతోపాటు కరోనా వైరస్ కేసుల సంఖ్య కంటే మరణాల రేటుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. తాను ఎప్పుడూ చెబుతున్నట్టుగానే, పెరుగుతున్న కేసుల గురించి భయపడకుండా మెరుగైన చికిత్సలు, ఔషధాలు, రోగుల నిర్వహణతో వైరస్‌ను మ్యానేజ్ చేయాలని ఆమె సూచించారు. -
వలస కూలీలను ఆదుకుందాం
కరోనా పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన, భయం పూర్తిగా తొలగిపోవాలి. ఇది జరగాలంటే ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టాలి. ప్రజల్లో భయాందోళనలను పోగొట్టడానికి ముందుగా చర్యలు తీసుకోవాలి. కరోనా లక్షణాలు ఉన్నాయని తెలియగానే పరీక్షలు, వైద్యం చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితిని తీసుకురావాలి. అప్పుడే మరింత సమర్థవంతంగా వైరస్‌ను అరికట్టగలుగుతాం. నడిచి వెళ్తున్న వలస కార్మికులు ఎక్కడ తారసపడ్డా వారిని బస్సులు ఎక్కించి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాలి. వారి పట్ల ఉదారంగా ఉండాలి. ఇదివరకు ఆదేశించిన విధంగా వారికి భోజనాలు, తాగు నీరు ఏర్పాటు చేయాలి. ప్రొటోకాల్ పాటిస్తూ నడిపే బస్సుల్లో వారి వద్ద చార్జీలు వసూలు చేయొద్దు. 15 రోజుల పాటు వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి. కరోనా లక్షణాలు కనిపించగానే వైరస్ ఉన్నదీ లేనిదీ ఒక వ్యక్తి ఎలా నిర్ధారించుకోగలుగుతారు అన్నది చాలా ముఖ్యం. ఆ వ్యక్తి ఎవర్ని సంప్రదించాలి? ఎలా సంప్రదించాలి? అన్న దానిపై ఒక పటిష్టమైన యంత్రాంగం అవసరం. లక్షణాలను గుర్తించి వైద్యం కోసం వెళ్లేలా అవగాహన కల్పించేందుకు ప్రతి ఇంటికీ ఒక కరపత్రం పంచాలి. సాక్షి, అమరావతి: మండుటెండలో పిల్లా, పాపలతో నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీల పట్ల ఉదారత చూపాలని, వారికి తగిన సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మన రాష్ట్రం మీదుగా వెళ్తున్న వలస కూలీలు కొందరు చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్–19 నివారణ చర్యలు, వలస కూలీలు, జాగ్రత్తలు తీసుకుంటూనే సాధారణ కార్యకలాపాలు కొనసాగించడం, రైతు భరోసా కేంద్రాలు.. తదితర అంశాలపై శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస కూలీలను వారి సొంత ఊళ్లకు పంపేందుకు బస్సులు తిప్పడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం విధివిధానాలను రూపొందించాలని చెప్పారు. నడిచి వెళ్తున్న వలస కార్మికులు.. ఎక్కడికక్కడ ప్రొటోకాల్ పాటిస్తూ నడిపే బస్సుల్లో 15 రోజుల పాటు ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం జగన్ ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. జాగ్రత్తలతో కార్యకలాపాలు ► కోవిడ్–19 విస్తరించకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూనే తిరిగి కార్యకలాపాలను ప్రారంభించేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను రూపొందించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళన, వివక్ష తగ్గించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ► ప్రజలు వైద్యానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చూడాలన్నారు. కరోనా రావడం తప్పు కాదని, అది పాపం కాదనే విషయాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకోపోవాల్సి ఉందని స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ఆందోళన వద్దని తెలియజెప్పాలి ► కోవిడ్ విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాలి. ఇందులో భాగంగా ఎక్కడెక్కడ ఎలాంటి విధానాలు పాటించాలన్న దానిపై స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) తయారు చేయాలి. ► బస్సుల్లో పాటించాల్సిన జాగ్రత్తలు.. రెస్టారెంట్లు, మాల్స్‌లో క్రమ క్రమంగా తిరిగి కార్యకలాపాలు మొదలయ్యేలా ఎస్ఓపీ తయారు చేయాలి. ► కరోనాపై ఆందోళన అవసరం లేదని, లక్షణాలు కనిపిస్తే భయపడవద్దని, అనుమానం వస్తే.. ఎవర్ని సంప్రదించాలన్న దానిపై పూర్తి వివరాలను ఇంటింటా పంచే కరపత్రంలో పొందుపరచాలి. ప్రజలు స్వతంత్రంగా ముందుకు రావడం ద్వారా పరిస్థితిలో మార్పు వస్తుంది. వైఖరిలో మార్పు రావాలి ► కరోనా వచ్చిన వారి పట్ల వివక్ష చూపడం, తక్కువ చేసి చూడటం మానుకోవాలి. దీని కోసం తీసుకోవాల్సిన చర్యలు ఇప్పుడు ముఖ్యమైనవి. భవిష్యత్తులో విలేజ్ క్లినిక్స్ స్థాయికి కోవిడ్ పరీక్షలను తీసుకెళ్లాలి. ► భౌతిక దూరం పాటించేలా చేయడానికి దుకాణదారులే ముందుకు వచ్చే పరిస్థితిని తీసుకు రావాలి. తన దుకాణం ముందు వృత్తాలు గీసుకునేలా వారికి అవగాహన కల్పించాలి. రైతు భరోసా కేంద్రాలు ► వ్యవసాయ రంగంలో రైతు భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషించబోతున్నాయని సీఎం అన్నారు. మార్కెట్ ఇంటెలిజెన్స్ విధానం, మార్కెట్ ఇంటర్వెన్షన్ విధానం.. ఈ రెండూ చాలా ముఖ్యమైనవని చెప్పారు. వీటి విషయంలో రైతు భరోసా కేంద్రాలు సమర్థవంతంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు, అనంతలో పెరిగిన డిశ్చార్జ్‌లు ► రాష్ట్రంలో డిశ్చార్జ్‌లు పెరుగుతున్నాయని, శుక్రవారం ఒక్క రోజే 101 మంది డిశ్చార్జ్ అయ్యారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ► గత 24 గంటల్లో రాష్ట్రంలో 48 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 31 కేసులు కోయంబేడుకు సంబంధించినవేనని తెలిపారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో డిశ్చార్జ్‌ల సంఖ్య బాగా పెరిగిందని వివరించారు. ► లాక్డౌన్ ఎగ్జిట్ వ్యూహంలో వైద్య పరంగా ఎలాంటి విధానాలను అనుసరించాల్సిన దానిపై సమావేశంలో చర్చ జరిగింది. కృష్ణా, కర్నూలు జిల్లాల్లో టెస్టింగ్ కెపాసిటీని పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. హైవేలపై ప్రత్యేక శిబిరాలు వలస కూలీల కోసం తక్షణమే ఏర్పాటుచేయాలని సీఎస్ ఆదేశం జాతీయ రహదారులపై నడిచి లేదా సైకిళ్లపై వెళుతున్న వలస కూలీలకు అన్ని సౌకర్యాలతో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి.. ఆ తర్వాత వారిని రైళ్లు, బస్సుల్లో స్వరాష్ట్రాలకు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. ఇందుకోసం జాతీయ రహదారులపై ప్రతి 20 కిలోమీటర్లకు ఒక ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి.. అక్కడ వలస కూలీలకు ఆహారం, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. హైవేలపై పెట్రోలింగ్ నిర్వహించి వలస కూలీలను ఆపివేసి వారిని శిబిరాల్లో ఉంచాలన్నారు. వచ్చే 15 రోజుల వరకూ ఈ ఏర్పాట్లు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్టు ఆమె చెప్పారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో శనివారం క్యాంపు కార్యాలయం నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంకా ఏమన్నారంటే.. బిడ్డను చంకన ఎత్తుకొని, నెత్తిపై బండెడు బరువును మోస్తూ కర్ణాటక నుంచి శ్రీకాకుళానికి కాలి నడకన వెళ్తోంది ఈ మహిళ. మార్గం మధ్యలో తాడేపల్లి వద్ద ఈమెతోపాటు పలువురు వలస కూలీలను పోలీసులు విజయవాడ క్లబ్‌లోని రిలీఫ్ క్యాంపునకు చేర్చారు. అక్కడ వారికి భోజనం, వసతి కల్పించి.. ఆ తర్వాత బస్సులో గమ్యస్థానానికి చేర్చారు. ► ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చాక, మన రాష్ట్రానికి చెందిన వారికి ద్వితీయ ప్రాధాన్యం ఇవ్వాలి. ► ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని రాష్ట్రాలవారీగా, మన రాష్ట్రానికి చెందిన వారిని జిల్లాల వారీగా వేరు చేసి స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలి. ► జాతీయ రహదారులపై ప్రతి చెక్ పోస్టు వద్ద ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి వలస కూలీలను సొంత జిల్లాలకు పంపే ఏర్పాట్లు చేయాలి. ► రెండు రోజులుగా నడిచి వెళుతున్న సుమారు రెండు వేల మంది ఒడిశాకు చెందిన వలస కూలీలను గుర్తించి, వారిని ఆ రాష్ట్ర సరిహద్దు వరకూ బస్సులు, రైళ్ల ద్వారా పంపేందుకు ఏర్పాట్లు చేశాం. ► కరోనా టెస్టుల సంఖ్యను రెట్టింపు చేయాలి.. ఆ వైరస్ పట్ల ప్రజల్లో నెలకొన్న భయాన్ని తొలగించాలి. ► వైఎస్సార్ గ్రామ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలకు అవసరమైన స్థలాలను త్వరితగతిన గుర్తించాలి. ► వలస కూలీల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించొద్దని పోలీసులకు సూచించాలని డీజీపీ, ఎస్పీలను ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్ర పన్నుల శాఖ కమిషనర్ పియూష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎస్ చొరవతో స్వస్థలాలకు..
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్: రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీల కష్టాలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పందించారు. వారిని స్వస్థలాలకు తరలించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. శుక్రవారం తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమీక్ష సమావేశం అనంతరం జాతీయ రహదారిపై విజయవాడ వెళుతుండగా ఆ దారి వెంట సొంత రాష్ట్రాలకు నడుచుంటూ వెళుతున్న వలస కూలీలు ఆమె కంటబడ్డారు. పిల్లా పాపలతో, తట్టా బుట్టా నెత్తిన పెట్టుకుని వెళుతున్న వారి వద్ద తన కాన్వాయ్ ఆపి వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ► చెన్నై నుంచి తమ రాష్ట్రం బిహార్‌కు వెళుతున్నట్టు వారు చెప్పడంతో సీఎస్.. వారి మాతృభాషలోనే మాట్లాడుతూ వారి కష్టాలు తెలుసుకున్నారు. ► ఆ వెంటనే కృష్ణా, గుంటూరు జిల్లాల సంయుక్త కలెక్టర్లకు ఫోన్ చేసి ఇలా నడిచి వెళుతున్న వలస కూలీలందరికీ ఆశ్రయం కల్పించి వారికి భోజనం, ఇతర వసతులు కల్పించాలని ఆదేశించారు. శ్రామిక్ రైళ్లలో వారిని వారి రాష్ట్రాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ► సీఎస్ ఆదేశాలతో వలస కూలీలను ప్రత్యేక బస్సుల ద్వారా విజయవాడ రాయనపాడు తరలించి, అక్కడి నుంచి ప్రత్యేక రైలు ద్వారా బిహార్‌కు తరలించారు. -
వలస కూలీల పట్ల ఉదారంగా ఉండాలి
ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన కూలీలు ఇక్కడకు వచ్చేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రాని పరిస్థితులు ఉంటే.. వెనకడుగు వేయొద్దు. అవసరమైన పక్షంలో వారికి కూడా ప్రయాణ సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: వలస కూలీల విషయంలో ఉదారంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఇతర రాష్ట్రాల కూలీలకు షెల్టర్ ఏర్పాటు చేసి.. భోజనం, తదితర సదుపాయాలను కల్పించాలని స్పష్టం చేశారు. వివిధ పరిశ్రమల్లో పనులకు వెళ్తామంటే సహకారం అందించాలని, లేదా వారి రాష్ట్రాలకు వెళ్లిపోతామంటే ప్రయాణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఈ విషయంలో సంకోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చొరవ తీసుకుని వారికి తగిన విధంగా సాయం చేయాలన్నారు. వెళ్లేటప్పుడు దారి ఖర్చుల కింద ఒక్కో కూలీకి రూ.500 ఇవ్వాలని ఆదేశించారు. కోవిడ్–19 నివారణ చర్యలు, వలస కూలీల తరలింపు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, ధరలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏపీకి చెందిన వలస కూలీలు, రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీల తరలింపు విధానాలపై చర్చించారు. విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 1.5 లక్షల మంది వచ్చే అవకాశాలున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం జగన్ ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. క్వారంటైన్ సదుపాయాలపై దృష్టి పెట్టాలి ► మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వారి ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న వారికి కూడా క్వారంటైన్ సదుపాయాలపై దృష్టి పెట్టాలన్నారు. ► విదేశాల నుంచి వస్తున్న వారిలో ఆయా దేశాల్లో కరోనా తీవ్రత ఆధారంగా వారిని వర్గీకరిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ► మహారాష్ట్రలోని థానే నుంచి 1,000 మందికిపైగా వలస కూలీలు గుంతకల్లుకు వచ్చారని, వీరందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. థానేలో కేసుల తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా వీరిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. ► సరిహద్దుల్లో 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని.. పోలీసులు, వైద్య బృందాలు సమన్వయం చేసుకుంటాయని అధికారులు తెలిపారు. డిశ్చార్జి కేసుకు సంబంధించి పటిష్టమైన ప్రొటోకాల్ పాటిస్తున్నామని, వరుసగా రెండు పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే డిశ్చార్జి చేస్తున్నామని చెప్పారు. ► టెలి మెడిసిన్‌లో భాగంగా సబ్ సెంటర్లకు మందులు పంపించి.. డాక్టర్లు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మేరకు వారికి పంపిణీ చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ► రైతులకు అండగా నిలిచేందుకు తగినంత మేర పంటల సేకరణ జరగాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ రైతులు సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే స్పందించాలని, ఈ విషయంలో అ«ధికారులు అగ్రెసివ్‌గా ఉండాలని సూచించారు. ► ఈ సమీక్షలో సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్ జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విదేశాల నుంచి వచ్చే వారు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులకు చేరుకుంటారు. వారికి అక్కడే మెడికల్ స్క్రీనింగ్ చేయిస్తాం. మార్గదర్శకాల ప్రకారం వారిని క్వారంటైన్ చేసి పర్యవేక్షిస్తాం. ఆ తర్వాతే వారిని స్వస్థలాలకు పంపిస్తాం. – సీఎంతో అధికారులు వలస కూలీల తరలింపు ఖర్చు ప్రభుత్వానిదే వివిధ పనులు, యాత్రలు, చదువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి చిక్కుకుపోయిన వారిని తిరిగి సొంత గ్రామాలకు తరలించడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం పనుల కోసం తాత్కాలికంగా వెళ్లి ఇరుక్కుపోయిన వారిని మాత్రమే తరలిస్తామని, అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్న వారికి అనుమతులు లేవని స్పష్టం చేసింది. వీరి తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని, శ్రామిక్ రైళ్ల ద్వారా తరలించే వారి వ్యయాన్ని, భోజన వసతిని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పష్టం చేశారు. తరలింపు నిబంధనలు ఇవి.. ► ఇతర రాష్ట్రాలకు తాత్కాలికంగా పనుల కోసం వెళ్లి చిక్కుకుపోయిన వారికే అనుమతి ► ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటూ సొంత గ్రామాలకు ఒకసారి వెళ్లిరావాలి అనుకునే వారిని అనుమతించరు ► శిబిరాల్లో ఉన్న వారి కోసం దగ్గరలో ఉన్న ప్రాంతం నుంచి శ్రామిక్ రైల్‌ను ఏర్పాటు చేస్తారు ► ఒకవేళ శిబిరాల్లో కాకుండా సొంతంగా వేరే చోట ఉంటే అదే రైల్లో ప్రయాణించడానికి అనుమతిస్తారు. దీనికి ముందుగా అధికారుల అనుమతి తీసుకోవాలి. ► శ్రామిక రైళ్లకు అయ్యే వ్యయం, అందులో ప్రయాణికులకు భోజన వసతిని ఐఆర్‌సీటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తుంది ► రైల్లో వచ్చిన వారిని ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా శిబిరానికి లేదా వైద్య శిబిరానికి తరలిస్తారు ► రైల్లో తరలించేంత సంఖ్యలో లేకపోతే వారిని ప్రత్యేక బస్సులు ద్వారా తరలిస్తారు ► వ్యక్తులు, కుటుంబ సభ్యులు, బృందాలను అత్యవసర కేసుల్లో మాత్రమే అనుమతిస్తారు. -
సీఎం జగన్ కృషి అభినందనీయం
సాక్షి, అనంతపురం: లాక్డౌన్ నేపథ్యంలో ముంబైలో చిక్కుకున్న వలస కూలీలను రప్పించేందుకు చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ముంబై నుంచి గుంతకల్లుకు రేపు(బుధవారం) ఉదయం వలస కూలీలు చేరుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన 500 మంది వలస కార్మికులు రానున్నారని తెలిపారు. వలస కూలీలపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమన్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం సీఎం జగన్ రేయింబవళ్లు శ్రమిస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. -
‘వారిని ఎందుకు ఆదుకోవడం లేదు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీరుతో వలస కార్మికుల జీవితాలు నాశనమయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం కాంగ్రెస్ నేతలు చేపట్టిన రైతు సంక్షేమ దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలని కోరారు. మద్యం షాపులను తెరవద్దని.. దీని వలన మరిన్ని సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. 40 రోజులు లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని.. మద్యం అమ్మకాలు జరిపితే సమస్యలు మరింత జఠిలమవుతాయన్నారు. లాక్డౌన్ సమయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వలస కార్మికులను ఆదుకోవడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సార్లు చెప్పిన ముఖ్యమంత్రి వినడం లేదన్నారు. 44 రోజుల లాక్డౌన్లో రాష్ట్రంలో వలస కార్మికులు ఎంత మంది ఉన్నారో సరైన లెక్కలు ప్రభుత్వం లేవని దుయ్యబట్టారు. వలస కార్మికులు కోసం హైదరాబాద్‌లో 400 అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టామన్నారని.. కానీ అవీ ఎక్కడెక్కడ ఉన్నాయో వివరాలు లేవన్నారు. తెలంగాణ అభివృద్ధికి వలస కార్మికులు దోహదపడ్డారని..వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. వారు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు రైల్వే శాఖ టిక్కెట్ ధర 50 రూపాయలు ఛార్జ్ చేస్తుందని.. వలస కార్మికుల టిక్కెట్ డబ్బులను కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని తెలిపారు. -
కొవ్వూరులో వలస కూలీల ఆందోళన
కొవ్వూరు: స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతించాలని వందలాది మంది వలస కార్మికులు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో సోమవారం ఆందోళనకు దిగారు. గోదావరిలో ఇసుక తవ్వే పనుల కోసం ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కొవ్వూరుకు వందలాది కార్మికులు వలస వచ్చారు. లాక్డౌన్ కారణంగా వారంతా పనులు లేకుండా ఇప్పుడు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సోమవారం తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వారంతా కొవ్వూరు గోదావరి మాత విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి కొవ్వూరు టోల్గేట్ జంక్షన్ వద్దకు చేరుకునే సరికి వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోకి వెళ్లాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు రావాల్సి ఉందని, అవి వచ్చేవరకు వెళ్లడానికి వీలులేదని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీచార్జి చేయడంతో కొంతమంది కార్మికులు గాయపడ్డారు. అనంతరం కార్మికులు కొంతమంది పోలీసులపైకి రాళ్లు విసిరారు. ఈ రాళ్లదాడిలో తణుకు సీఐ చైతన్యకృష్ణతో పాటు పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ రాజేశ్వరరెడ్డి 3 రోజుల్లో తరలింపునకు రైలు ఏర్పాటు చేస్తారని చెప్పడంతో కార్మికులు శాంతించారు. -
వలస కూలీలు వచ్చే లోపు ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లు
సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి చెందిన వలస కూలీలు వచ్చే లోగా ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. ఆదివారం విజయవాడలో కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చైర్మన్ కృష్ణబాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 14 రాష్ట్రాల్లో ఏపీకి చెందిన వారు రెండు లక్షల మంది ఉన్నారని, ఇతర రాష్ట్రాల వారు 12,794 మంది ఇక్కడ రిలీఫ్ క్యాంపుల్లో ఉన్నారన్నారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చే విషయంలో మొదటి ప్రాధాన్యత వలస కూలీలకు, కార్మికులకు ఉంటుందన్నారు. రెండో దశలో యాత్రికులు, విద్యార్థులు, పర్యాటకులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. తొమ్మిది రైళ్ల ద్వారా రాష్ట్రానికి చెందిన వారిని తీసుకొస్తామని వివరించారు. వీరి కోసం ప్రతి గ్రామ సచివాలయంలో 10–15 పడకలను సిద్ధం చేస్తామన్నారు. మొత్తం లక్షకు పైగా పడకలతో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆళ్ల నాని ఇంకా ఏమన్నారంటే.. ► రెడ్ జోన్లలో ఆర్టీసీ బస్సుల్లో నిత్యావసరాలు, కూరగాయల కోసం మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేస్తాం. ► ప్రతి పీహెచ్సీలో మందులు అందుబాటులో ఉంచి సబ్ సెంటర్ల ద్వారా పంపిణీ చేస్తున్నాం. ఇందుకోసం మోటార్ సైకిళ్లు, కిట్ బ్యాగ్‌లు అందుబాటులో ఉంచాం. ► మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే సోమవారం విజయవాడ నుంచి రెండు రైళ్లు బలార్షాకు బయలుదేరతాయని కృష్ణబాబు తెలిపారు. ► ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు spandana.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ► మౌంట్ అబూలో ఉన్న ఏపీకి చెందిన 670 మందికి రైలు ఏర్పాటు చేశారు. ఎన్నారైలకు ఆయా దేశాలు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించాయి. 6 వేల మంది గల్ఫ్ నుంచి, 4,500 మంది ఇతర దేశాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిని పంపేందుకు విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ, ఏపీలో ఉన్నవారిని గ్రూప్‌ల ద్వారా పంపిస్తాం. అనుమతి ఉంటే చెక్‌పోస్టుల వద్ద వారిని అనుమతించాలి. -
ఎక్కడి వారక్కడే: సీఎం జగన్
సాక్షి, అమరావతి: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను మాత్రమే వారి వారి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించిందని.. ఈ విషయాన్ని పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారు అర్ధంచేసుకుని ఎక్కడి వారు అక్కడే ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియలో రాష్ట్రానికి దాదాపు లక్షమంది వచ్చే అవకాశముందని.. వారందరినీ క్వారంటైన్ చేసేందుకు వీలుగా యుద్ధప్రాతిపదికన గ్రామ, వార్డు సచివాలయాలు యూనిట్లుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతులతో లక్ష పడకల ఏర్పాటుకు తక్షణం మార్గదర్శకాలు జారీచేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని ఆదేశించారు. టెలీమెడిసిన్ విధానాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు మద్యం దుకాణాలను తెరవాలని, అయితే.. మద్యం నియంత్రణలో భాగంగా మద్యం ధరలను 25 శాతం పెంచాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కోవిడ్–19 నివారణ చర్యలు, వలస కూలీలు వారివారి రాష్ట్రాలకు తరలింపు.. ఇతర రాష్ట్రాల్లోని మన వలస కూలీలను తీసుకురావడం.. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల మేరకు సోమవారం నుంచి లాక్డౌన్ సడలింపు తదితర అంశాలపై ముఖ్యమంత్రి తన నివాసంలో ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అధికారులు ప్రస్తావించిన అంశాలు.. సీఎం వైఎస్ జగన్ చేసిన ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.. ప్రజల సహకారం కొనసాగాలి ► పొరుగు రాష్ట్రాల్లో ఉన్న మన వారు పెద్దఎత్తున ఇక్కడకు రావడానికి ప్రయత్నిస్తున్నారని, ఇందులో భాగంగా వేలల్లో విజ్ఞప్తులు వస్తున్నాయని అధికారులు ప్రస్తావించారు. కానీ, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం వలస కూలీలనే అనుమతిస్తూ ముందుకు వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. ► పొరుగు రాష్ట్రాల్లో ఉన్న మనవారికి ఇది కష్టం అనిపించినా.. విపత్తు తీవ్రత, ప్రజారోగ్యం, వారి కుటుంబాల్లోని పెద్దల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుకు నడవాలని నిర్ణయించారు. ► ప్రస్తుతం ఇలా బయల్దేరుతున్న వలస కూలీలు భారీగా ఉంటున్నందున వారందర్నీ క్వారంటైన్ కేంద్రాల్లో పెడుతున్నాం, పరీక్షలు చేస్తున్నాం. వీరికి సదుపాయాల కల్పన చాలా కష్టమవుతోంది. ► అందువల్ల మిగిలిన వారు సహకరించాలి. ఎక్కడి వారు అక్కడే ఉండడం క్షేమకరం. సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడొద్దు. ► ప్రభుత్వ చర్యలకు ప్రజల సహకారం ఇంకా కొనసాగాలి. కరోనాపై పోరాటంలో మీరు చూపుతున్న స్ఫూర్తి ప్రశంసనీయం. ► ప్రభుత్వం ఇస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని ప్రజలకు సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. యుద్ధప్రాతిపదికన క్వారంటైన్ సదుపాయాలు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలు పెద్దఎత్తున రానున్న నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన క్వారంటైన్ సదుపాయాలను కల్పించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అలాగే.. ► భోజనం, టాయిలెట్స్, బెడ్స్, బెడ్షీట్లు తదితరాలన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. ► ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను వీలైనంత త్వరగా తయారుచేసి అవసరమైన నిధులను విడుదల చేయాలి. ► కేంద్రం సూచించినట్లుగా వలస కూలీలను ప్రత్యేక రైళ్ల ద్వారా వారివారి రాష్ట్రాలకు పంపాలి. అదే.. అంతర్ జిల్లాల్లో కూలీలను పంపేటప్పుడు బస్సుల ద్వారా పంపాలి. ► ఇందుకయ్యే ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తోందని అధికారులు వివరించగా.. వలస కూలీలను పంపేటప్పుడు వారికి పండ్లతో కూడిన ఒక కిట్ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పటిష్టంగా టెలీమెడిసిన్ సమావేశంలో టెలీమెడిసిన్ అమలు తీరుతెన్నులపై ప్రస్తావనకు రాగా.. ఈ విధానాన్ని మరింత బలోపేతం చేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మిస్డ్‌కాల్ ఇచ్చిన వ్యక్తికి ఫోన్ చేసినప్పుడు అందుబాటులోకి రాకపోతే రోజుకు మూడుసార్లు చొప్పున చేయాలని.. అప్పుడే ఆ కాలర్ అందుబాటులో లేడని గుర్తించాలని ముఖ్యమంత్రి అన్నారు. గ్రామస్థాయిల్లో ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణం కోసం ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని.. ఈలోగా టెలీమెడిసిన్‌లో ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన వారికి మందులు డోర్ డెలివరీ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు ద్విచక్రవాహనాలను ఏర్పాటుచేసుకోవాలని, అలాగే థర్మల్ బాక్స్ కూడా ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. ఉపకేంద్రాలు ప్రారంభమైన తర్వాత మందులు సహా ప్రాథమిక చికిత్స కూడా అక్కడే అందుబాటులో ఉంటుందన్నారు. సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సొంత జిల్లాలకు వలస కూలీలు
సాక్షి, అమరావతి: ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వలస వెళ్లిన కూలీలు లాక్‌డౌన్‌తో ఆ జిల్లాల్లో చిక్కుకుపోయారు. ఇలా ఇతర జిల్లాల్లో చిక్కుకుపోయిన వలసకూలీలను రాష్ట్ర ప్రభుత్వం సొంత జిల్లాలకు తరలిస్తోంది. గ్రీన్ జోన్లో ఉన్న కూలీలను వారి సొంత జిల్లాల్లోని గ్రామాలు కూడా గ్రీన్ జోన్లోనే ఉంటే కొన్ని నిబంధనలతో తరలించేలా మార్గదర్శకాలు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో 11,048 మంది కూలీలను సొంత జిల్లాలకు తరలించినట్లు కోవిడ్–19 నోడల్ అధికారి, వాణిజ్య పన్నుల చీఫ్ కమిషనర్ పీయూష్ కుమార్ తెలిపారు. అత్యధికంగా 8,849 మందిని గుంటూరు నుంచి కర్నూలు జిల్లాకు తరలించారు. విశాఖ జిల్లాకు 98 మందిని, విజయనగరానికి 51 మందిని, శ్రీకాకుళానికి 50 మందిని పంపారు. ప్రభుత్వం, వివిధ స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న శిబిరాల్లో ప్రస్తుతం సుమారు 13,800 మంది వలస కూలీలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇవీ మార్గదర్శకాలు... ► శిబిరాల్లో ఉన్న వలస కూలీలు వ్యవసాయం లేదా పారిశ్రామిక రంగానికి చెందిన వారో గుర్తించాలి ► సొంత జిల్లాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నవారిని గ్రీన్ జోన్ నుంచి గ్రీన్ జోన్లోకి మాత్రమే అనుమతిస్తారు. ► రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్‌కు, గ్రీన్ నుంచి రెడ్ జోన్లోకి వెళ్లేందుకు అనుమతించరు. ► వలస కూలీలకు ర్యాండమ్‌గా కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించాలి. పరీక్షలో నెగిటివ్ వస్తేనే ఆయా గ్రామాలకు పంపిస్తారు. ► తరలింపు సమయంలో భౌతిక దూరం పాటిస్తూ బస్సుల్లో 50 శాతం మందే ప్రయాణించాలి ► శిబిరాల నుంచి తరలించే ముందు ఆయా జిల్లాల అధికారులకు ముందుగా తెలియచేయాలి ► సమీప గ్రామాలతో కలిపి స్థానికంగా క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసి విధిగా 14 రోజులు ఉన్న తరువాతే సొంత ఇళ్ల్లకు వెళ్లేందుకు అనుమతించాలి ► కూలీలు క్వారంటైన్లో ఉన్న 14 రోజుల సమయంలో కుటుంబ సభ్యులు, బంధు వులను కలిసేందుకు అనుమతించరు. ► కరోనా నిర్థారణ పరీక్షలో పాజిటివ్ వస్తే కోవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలి. -
వలసజీవులకు ఎట్టకేలకు విముక్తి
లాక్డౌన్ మొదలైనప్పటినుంచీ అష్టకష్టాలు పడుతున్న వలసజీవులకు ఎట్టకేలకు విముక్తి లభించే రోజొచ్చింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులందరినీ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి నిస్తూ, అందుకవసరమైన మార్గదర్శకాలను బుధవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసింది. వీరితోపాటు పర్యాటకులు, తీర్థయాత్రలకు వెళ్లి వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్నవారు, చదువుల నిమిత్తం వేరే రాష్ట్రాల్లో వుంటున్న విద్యార్థులు కూడా తమ సొంత గూళ్లకు చేరడానికి అవకాశం ఏర్పడింది. తమది కాని ప్రాంతంలో రోజుల తరబడి వుండాల్సిరావడం, దగ్గరున్న సొమ్ములు నానాటికీ హరించుకుపోవడం, స్వస్థలాల్లో వదిలివచ్చిన కుటుంబాల స్థితిగతులపై బెంగ వగైరాలన్నీ వీరందరినీ చుట్టుముట్టాయి. దానికితోడు పొట్టనిండేదెలా అన్న సమస్య, తెచ్చుకున్న ప్రాణావసర మందులు అయిపోతూ, ఎక్కడా దొరక్కపోవడం వంటివన్నీ ఆందోళనను మరింత పెంచాయి. అయితే ఇతర వర్గాలు ఎలాగోలా తమ గోడు వినిపించుకోగలవు. వారి గురించి పట్టించుకునేవారూ తారసపడతారు. ఏదోమేరకు సమస్య పరిష్కారమవుతుంది. కానీ వలస జీవుల వేదన పూర్తిగా భిన్నం. వారు కొత్తగా అక్కడికొచ్చినవారు కాదు. ఏనాటినుంచో ఆ నగరాన్నో, పట్టణాన్నో ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్నవారు. కానీ హఠాత్తుగా ఎవరికీ ఏమీ కానివారయ్యారు. బతకడానికి ఏమాత్రం సౌకర్యవంతంగా లేని గూడును కూడా ఖాళీ చేయమనే యజమానులు, సర్వం స్తంభించిపోవడంతో జేబులోవున్న కొద్ది సొమ్మూ ఖాళీ అయ్యే స్థితి వలసజీవులను వేధించింది. అంతకుమించి స్వస్థలాల్లో తమ వాళ్లను గురించిన బెంగ వారిని మరింత కుంగదీసింది. కొందరు వెనకా ముందూ ఆలోచించకుండా వెనువెంటనే నడకదారి పట్టారు. వెళ్లాల్సిన దూరం వందల కిలోమీటర్లా, వేల కిలోమీటర్లా... గమ్యం చేరగలమా, లేదా వంటి ప్రశ్నలేమీ వారు వేసుకోలేదు. కొందరు నిర్భాగ్యులకది ఆఖరి పయనం అయింది. ఒంట్లో సత్తువ తగ్గి, తినడానికేమీ దొరక్క, చివరకు దప్పిక తీర్చుకునే దారి కూడా లేక 25మంది మరణించారు. అందులో పన్నెండేళ్ల బాలిక మొదలుకొని యువకులు, వృద్ధులవరకూ ఎందరో వున్నారు. ఈ వలస జీవులు దశాబ్దాల తరబడి ఆ నగరాలనూ, పట్టణాలనూ ఆధారం చేసుకుని జీవనం సాగిస్తూవుండొచ్చుకానీ...తమ కాయకష్టం ద్వారా వారు సృష్టించిన, సృష్టిస్తున్న సంపద అపారమైనది. సంక్షోభం ముంచుకొచ్చేసరికి వీరు ఎవరికీ కాకుండా పోయారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఆదుకునే ప్రయత్నాలు చేశాయి. కానీ అవి అందుబాటులోకి రాని వారెందరో వున్నారు. కనుకనే లాక్డౌన్ విధించి దాదాపు 40 రోజులకు చేరువవుతున్నా ఇంకా నడకదారిన పోతున్నవారు దేశమంతటా కనబడుతూనే వున్నారు. కొన్నిచోట్ల వలసజీవులు తిరగబడుతున్న ఉదంతాలూ చోటుచేసుకుంటున్నాయి. వలసజీవుల కష్టాలు ఎలాంటివో తెలియాలంటే వారి జీవితాల్లోకి తొంగిచూడాలి. ఒక స్వచ్ఛంద సంస్థ 11,000 మందికి పైగా వలస కార్మికులను సర్వే చేస్తే దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. అందులో సగంమంది వద్ద ఒక పూట కడుపునిండా తినడానికి అవసరమైన ఆహారపదార్థాలు కూడా లేవు. 74 శాతంమంది వద్ద రూ. 300 కన్నా తక్కువ మొత్తం వుంది. 89 శాతంమందికి యజమానులు వేతనాలు ఎగ్గొట్టారు. గ్రామసీమల నుంచి పట్టణాలకూ, నగరాలకూ వలస వెళ్లినవారు మొత్తం 12 కోట్లమంది వుంటారని అంచనా. 1991లో మొదలైన ఆర్థిక సంస్క రణల వల్ల లభించిన ఆరుకోట్లకుపైగా ఉద్యోగాల్లో 92 శాతం అనిశ్చితమైనవి. ఇలాంటి అనిశ్చితిలో పనిచేస్తున్న కార్మికులు తమ శ్రమతో సృష్టిస్తున్న సంపద జీడీపీలో పదిశాతం. ఇంత సంపద సృష్టించినా సంక్షోభం వచ్చేసరికి వీరంతా సమస్యల్లో కూరుకుపోయారు. నిజానికి లాక్డౌన్ విధిం చడం, ఎక్కడివారిని అక్కడ ఉంచడం ఎంతో అవసరం. వీరంతా స్వస్థలాలకు తరలివెళ్లివుంటే కరోనా మహమ్మారి పల్లెసీమల్లో పెను విపత్తు సృష్టించేది. దాన్ని నియంత్రించడం అసాధ్యమయ్యేది. దశాబ్దాలుగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారి సంక్షేమానికి అవసరమైన చట్టాలు సరిగా లేకపోవడం, వున్నవాటిని కూడా సమర్థవంతంగా అమలు చేయించలేని ప్రభుత్వాల వైఖరి కార్మికులను ఈ సంక్షోభ సమయంలో నిస్సహాయుల్ని చేశాయి. ఇలాంటి విపత్తులెదురైన పక్షంలో కనీసం రెండు మూడునెలలు జీవించడానికి సరిపడా మొత్తం లభించేలా తగిన పథకాలు రూపొం దించి అమలు చేస్తే, వారు ఎవరికీ భారం కాకుండా వుండేవారు. నిర్మాణరంగం మొదలుకొని అనేక రంగాల్లో ఏళ్లతరబడి పనిచేసినా, వారి పేరు ఏ రిజిస్టర్కీ ఎక్కని దుస్థితి వుండబట్టే ఆ వలసజీవులు రెక్కలు తెగిన పక్షులుగా మారారు. దానికితోడు లాక్డౌన్ ప్రకటనకు ముందే షెల్టర్లు ఎన్ని వున్నాయో, ఎంతమందికి అక్కడ ఆవాసం కల్పించవచ్చునో, ఎన్నిటిని షెల్టర్లుగా మార్చవలసి వుంటుందో... వలసజీవులకు ఆహారపదార్థాలు అందించడంతోపాటు మందులు వగైరా సమ కూర్చడానికి ఎంత వ్యయం అవుతుందో లెక్కలేసి, తగిన మార్గదర్శకాలు జారీచేసివుంటే బాగుం డేది. వలసజీవుల్లో అత్యధికులు దళితులు, ఆదివాసీలు, మైనారిటీలే. వీరిలో చాలామంది సీజనల్ పనులు చేసుకుని బతికేవారే. ఈ కరోనా మహమ్మారి ఎన్నో గుణపాఠాలు నేర్పింది. సంక్షోభ సమయాల్లో వలసజీవులకు ఆసరాగా నిలిచే పథకాలను రూపొందించడం, అందుకు తగిన విధానాలను ఖరారు చేయడం ప్రభుత్వాలకు పెద్ద సవాలు. అలాగే మన ఆరోగ్య వ్యవస్థలను ప్రక్షాళన చేసుకోవడం, విపత్తు లేర్పడినప్పుడు అవి సమర్థవంతంగా పనిచేసేలా తీర్చిదిద్దడం ఎంతో అవసరం. కేంద్రం తాజా నిర్ణయంతో స్వస్థలాలకు చేరే వలసజీవులకు ప్రశాంత జీవనం సాగేందుకు అవసరమైన సదుపాయాలు ప్రభుత్వాలు కల్పించాలి. వారి పునరావాసానికి అనువైన పథకాలు కూడా రచించాలి. -
బాంద్రా ఘటన: అతడికి బెయిల్
ముంబై: బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద వలస కార్మికుల ఆందోళనకు కారణమైన వినయ్ దూబేకు బెయిల్ లభించింది. బాంద్రా కోర్టు మంగళవారం అతడికి రూ. 15వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. వలస కార్మికులను రెచ్చగొట్టి బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద అలజడికి కారణమయ్యాడని వినయ్ దూబే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. లాక్డౌన్ ఎత్తేస్తున్నారన్న ప్రచారంతో ఈనెల 14న భారీ సంఖ్యలో వలస కార్మికులు బాంద్రా రైల్వేస్టేషన్‌కు తరలివచ్చారు. అయితే లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించగానే వారందరూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు లాఠిచార్జి చేసి వారిని చెదరగొట్టారు. తాము తిరిగి వెళ్లేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలు కల్పించకపోతే కాలినడకన భారీ ర్యాలీగా ఉత్తర భారత్‌కు బయలుదేరేందుకు సిద్ధపడాలంటూ సోషల్ మీడియాలో వినయ్ దూబే ప్రచారం చేయడం వల్లే అమాయక కార్మికులు బాంద్రా రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారని తెలిపారు. దీంతో అతడిని అరెస్ట్ చేసి ఐపీసీ 117, 153ఏ, 188, 269, 270, 505(2), సెక్షన్ 3 కింద కేసులు నమోదు చేశారు. అతడికి విధించిన పోలీసు కస్టడీ నేటితో ముగిసింది. కాగా, వలసకూలీలను స్వస్థలాలకు పంపబోమని, వారి బాగోగులను ప్రభుత్వం చూసుకుంటుందని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ముంబై అలజడి; వినయ్ దూబే అరెస్ట్ -
నాన్న..ఇంకెంత దూరం!
కరోనా వలస జీవులకు ఎక్కడ లేని కష్టాలు తెచ్చిపెట్టింది. జేబులో చిల్లిగవ్వ లేక..ఎక్కడ ఉండాలో తెలియక భార్యాబిడ్డలతో బిక్కుబిక్కు మంటూ నడక సాగిస్తున్నారు వలస కూలీలు. హైదరాబాద్ నుంచి చత్తీస్‌ఘడ్‌కు కాలినడక వెళ్తూ ఆదిలాబాద్ దేవాపూర్ చెక్‌పోస్ట్ వద్ద తన కూతురుని అక్కున చేర్చుకుని సేద తీరుతున్న చిత్రమిది. (ఆనంద్‌ను మిస్ అవుతోన్న తమన్నా ) – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ ఇతర రాష్ట్రాల వారిని అనుమతించం సాక్షి, ఆదిలాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం మే 7 వరకు లాక్డౌన్ పొడిగించినందున ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని జిల్లాకు తీసుకురావడానికి అనుమతించమని కలెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. లాక్డౌన్ పూర్తయిన వెంటనే తీసుకురావచ్చని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఫోన్ చేసి సమస్యలు తెలపగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వివిధ సమస్యలపై 13 కాల్స్ వచ్చాయి.(జనతాబజార్లలో ఆక్వా ఉత్పత్తులు: సీఎం జగన్) ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్నందున ఎక్కడివారు అక్కడే ఉండాలన్నారు. పట్టణంలోని శాంతినగర్, దస్నాపూర్, పిట్టలవాడ, టీచర్స్‌కాలనీ, బేల, బజార్హత్నూర్ మండలాల్లో బియ్యం, నగదు అందలేదని కొందరు తెలపగా, ఏప్రిల్ నెల బియ్యం పంపించామని, ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని నిలిపివేసిందని, వచ్చే నెలలో తిరిగి చెల్లిస్తామన్నారు. బ్యాంకు ఖాతాల్లో నగదు జమకాని వారు పోస్టల్ కరస్పాండెంట్‌ను సంప్రదించాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్వో నటరాజ్, ఎల్డీఎం చంద్రశేఖర్, డీఎఫ్‌వో ప్రభాకర్, అధికారులు పాల్గొన్నారు. (క్షిణించిన కిమ్ ఆరోగ్యం.. కొరియాకు చైనా వైద్యులు )