వలస కార్మికుల నమోదు పుస్తకాన్ని సర్పంచ్‌కు అందిస్తున్న ఎస్పీ
రాయగడ : రాయగడ జిల్లాలోని 11 సమితుల నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది గ్రామీ ణులు ఉపాధి కోసం కూలిపనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వలస కార్మికులుగా వెళ్తుంటా రు. కొన్ని సమయాల్లో వారు ఇతర రాష్ట్రాల్లో ప్రమాదాలకు గురి కావడం దళారుల గుప్పిట్లో నలిగిపోవడం, దోపిడీకి గురి కావడంతో పాటు సరైన వసతి, తిండి, లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆపైన ఒడిశా ప్రభుత్వం విషయం తెలుసుకుని కార్మికశాఖ ద్వారా వారిని వెతికి పట్టుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన దళారుల ద్వారా కార్మిక శాఖలో తమపేర్లు, వివరాలు, వెళ్లే ప్రాంతం, పనిచేసే పరిశ్రమల వివరాలను నమోదు చేసి ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని ప్రభుత్వం నియమ నిబంధనలు ఖరారు చేసినప్పటికి ఫలితం కనిపించడం లేదు. దీంతో ప్రస్తుతం రాయగడ జిల్లా పోలీసు అధికారి రాహుల్ పీఆర్ నేతృత్వంలో జిల్లాలో మొట్టమొదటిసారిగా గ్రామపంచాయతీల ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి పేర్ల నమోదు కార్యక్రమాన్ని మొదటిసారిగా జిల్లాలోని మునిగుడ సమితిలో కొత్తగా పంచాయతీ ఏర్పాటైన గుమిటిగుడలో బుధవారం ప్రారంభించారు.
జిల్లా అంతటా నమోదు
కార్యక్రమంలో భాగంగా సమితి సర్పంచ్, సమితి సభ్యుల ద్వారా పంచాయతీలో ఉన్నవారి పేర్లు, వేరే రాష్ట్రాలకు వెళ్లే వారి పేర్లు, ఫోన్ నంబర్లు, ఏఏ పరిశ్రమల్లో పనిచేస్తున్నది, ఎన్నిరోజులు వెళ్లారన్న సంపూర్ణ వివరాలు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ పీఆర్ మాట్లాడు తూ ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని 11సమితుల్లో 181గ్రామ పంచాయతీల్లోనూ సంపూర్ణ నమో దు కార్యక్రమం పూర్తిచేసి కార్మికశాఖ ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందు కోసం ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ రాహుల్‌పీఆర్, అడిషనల్ ఏఎస్పీ అశోక్ సాహు, ఎన్‌జీఓ డాని యల్, రీజనల్‌డైరెక్టర్ ఉమేజయల్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చొట్రాయిడు, సర్పంచ్ మంజు ల బిడ్రిక, సమితి సభ్యులు దాలింబనాయక్, ఎస్‌డీపీఓ ఎ.పి.మాలిక్‌తో సహా ఇతర అధికా రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment